ఘోరం.. బిర్యానికి డ‌బ్బు ఇవ్వ‌లేద‌ని 60 సార్లు పొడిచేశాడు...( వీడియో ఇదిగో)

మాయమైపోతున్నడమ్మా మనిషిన్నవాడు... అనే ఈ ప‌దం అప్పుడ‌ప్పుడూ నిజ‌మ‌వుతూ ఉంటుంది. స‌మాజంలో రోజురోజుకూ మాన‌వ‌త్వం అనేది క‌నుమ‌రుగైపోతుంది. సాటి మ‌నిషి ప‌ట్ల క‌నీస మాన‌వ‌త్వం చూపించ‌కుండా దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. చిన్నచిన్న విష‌యాల‌కే కోపాలు తెచ్చుకుని చంపేసుకుంటున్నారు లేదా చ‌స్తున్నారు.. ఇలాంటి వార్త‌ల‌ను నిత్యం మ‌నం ఎక్క‌డో ఒక చోట వింటూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటుచేసుకుంది. బిర్యానికి డ‌బ్బులు ఇవ్వ‌లేని ఓ ప‌దిహేడేళ్ల కుర్రాడిని ఓ యువ‌కుడు ఏకంగా 60 సార్లు క‌త్తితో పొడిచి మ‌రీ చంపేసాడు. ఆ త‌ర్వాత ఆ బాడీపై ఏకంగా డ్యాన్స్ చేశాడు.

ఈ దారుణం మ‌రెక్క‌డో కాదు దేశ రాజ‌ధానిలో చోటుచేసుకుంది. బిర్యాని తినేందుకు 350 రూపాయ‌లు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ కుర్రాడు అత్యంత దారుణంగా పొడిచి చంపేసాడు. ఆ యువకుని మెడపై, ఛాతీపై ఏకంగా 60 సార్లు పొడిచాడు. ఆ త‌ర్వాత నిర్జీవంగా పడి ఉన్నఅతనిపై డ్యాన్స్‌ చేశాడు. బాధితుడు ఢిల్లీలోని జాఫ్రాబాద్‌ ప్రాంతంలో తన తల్లితో కలిసి ఉండేవాడు. అత‌ను రోజువారీ కూలీగా ప‌నిచేసేవాడు. రోజూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే కానీ ఆ యువ‌కుడి పొట్ట నిండ‌దు. అలాంటి యువ‌కుడిపై దాడి చేశాడు మ‌రో యువ‌కుడు. కూలీ చేసుకునే పూట గడుపుకునే ఆ యువ‌కుడు రోజువారిలాగే మంగళవారం రాత్రి జనతా మజ్దూర్‌ కాలనీ మీదుగా వెళ్లాడు. ఈ క్రమంలో అటుగా వెళ్లే ఓ ప‌ద‌హారేళ్ల కుర్రాడు అతడిని అడ్డుకున్నాడు. బిర్యానీ తినడానికి 350 రూపాయ‌లు కావాలి ఇవ్వూ అంటూ ఆ యువకుడిని అడిగాడు.

Horrific Biryani Feud: Teen Stabs Boy 55 Times, Slits Throat, and Commits Gruesome Dance

350 రూపాయ‌ల కోసం యువ‌కుడిని చంపాడు : దానికి ఆ కుర్రాడు తన వద్ద అంత డబ్బు లేదని చెప్పాడు. దాంతో కోపానికి గురైన ఆ యువ‌కుడు వెంట‌నే అతనిని కొట్టాడు. దీంతో ఒక్క‌సారిగా కింద‌ప‌డిప‌డిపోయాడు బాధితుడు. ఆవేశంతో నిందితుడు ప‌డిపోయిన బాధితుడిపై కూర్చుని మెడ‌, ఛాతీపై విచక్షణారహితంగా కత్తితో 60 సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్క‌డిక్క‌డే చనిపోయాడు. నిందితుడు అంత‌టితో ఆగ‌కుండా అతని బాడీపై డ్యాన్స్‌ చేశాడు. అయితే, ఈ విష‌యాన్ని గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

అయితే అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఇదంతా ఆ ప్ర‌దేశంలో ఉన్న‌ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఆ యువ‌కుడిపై కేసు న‌మోదు చేశారు. అయితే, ఆ నిందితుడు కూడా అదే కాల‌నీకి చెందిన‌వాడ‌ని, కానీ, వారిద్ద‌రికి ముఖ ప‌రిచ‌యం కూడా లేద‌ని పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడిపై గతంలోనూ ఓ హత్య కేసు ఉన్నదని, నిందితుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని పోలీసులు వివ‌రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+