Horror: అమ్మాయిని రేప్ చేసి భయంతో తల నరికేశాడు, కజిన్ కాదు కిరాతకుడు, పక్కా స్కెచ్ తో!
గాంధీనగర్/ అహమ్మదాబాద్/ న్యూఢిల్లీ: వికలాంగురాలైన 12 ఏళ్ల అమ్మాయిని నమ్మించి తీసుకెళ్లిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు తెలిస్తే తాను జైలుపాలైతానని భయపడిన ఆ కిరాతకుడు ఆ బాలికను రెండు ముక్కలుగా నరికి చంపేశాడు. బాలిక శరీరం ఒక ప్రాంతంలో, తల తీసుకెళ్లి మరో ప్రాంతంలో విసిరేసి ఏమీ తెలీని అమాయకుడిలా నటించాడు. బాలికపై అత్యాచారం చేసి ఆమె శరీరాన్ని రెండు ముక్కలు చేసింది స్వయంగా ఆమె సమీప బంధువు ( Cousin) అని వెలుగు చూడటం కలకలం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం
గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుజరాత్ లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్ మీద ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక శ్రధ్ద ఉందనే విషయం దేశ ప్రజలకు తెలిసిందే.

ఇంట్లో ఉన్న అమ్మాయి మాయం
గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని దీసా పట్టణంలో 12 బాలిక నివాసం ఉంటున్నది. ఈ బాలిక వికలాంగురాలు. బాలిక ఎప్పుడూ ఇంటిలోనే ఉంటుంది. తల్లిదండ్రులు పనిపై బయటకు వెళ్లిన తరువాత ఇంట్లో ఉన్న బాలిక బయటకు వెళ్లి తరువాత ఇంటికి తిరిగిరాలేదు. సాయంత్రం ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులు బాలిక కనపడకపోవడంతో ఆందోళనకు గురైనారు.

అమ్మాయి తల నరికేశాడు
బనస్కాంత జిల్లాలోని మోటి బకార్ గ్రామం సమీపంలో బాలిక శవం పడి ఉన్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే బాలిక శవం మాత్రమే ఉండటం, ఆమె తల కనపడకపోవడంతో పోలీసులు గాలించారు. గ్రామానికి కిలోమీటరు దూరంలో బాలిక తల గుర్తించిన పోలీసులు హడలిపోయారు.

కజిన్ కాదు కిరాతకుడు
అమ్మాయిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని వెలుగు చూడటంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. బాలికను ఆమె 25 ఏళ్ల సమీప బంధువు (Cousin) బైక్ లో తీసుకెళ్లాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. బాలికను నమ్మించి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి పోలీసులకు భయపడి ఆమె తల నరికి చంపేశానని ఆమె సమీప బంధువు విచారణలో అంగీకరించాడని వెలుగు చూసింది. బాలిక కజిన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి కుషాల్ ఓజా మీడియాకు చెప్పారు. దంతేవాడ పోలీసులు ఈ కేసు విచారణ చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications