భలే విచిత్రం: జైపూర్ లో కారులోకి దూసుకెళ్లిన గుర్రం (వీడియో)
రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్ లో ఆదివారం ఓ విచిత్రమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక వాహనం, మరో వాహనం గుద్దుకోవడం సాధారణం. కానీ ఇక్కడ ఓ కారు, గుర్రం రెండూ గుద్దుకున్నాయి.
ఇప్పటి వరకు ఎన్నో రకాల రోడ్డు ప్రమాదాలను మనం చూసి ఉంటాం. కానీ ఇదొక విచిత్రమైన ప్రమాదం. అసలు ఇది ఎలా జరిగిందో కూడా అర్థం కావడం లేదు. చూశాక మీరు కూడా 'అర్రె.. ఏంటిది?' అంటారు కచ్చితంగా.
ఈ విచిత్ర ప్రమాదం రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్ లో ఆదివారం చోటు చేసుకుంది. ఒక వాహనం, మరో వాహనం గుద్దుకోవడం సాధారణం. కానీ ఇక్కడ ఓ కారు, గుర్రం రెండూ గుద్దుకున్నాయి. గుర్రం నేరుగా కారులోకి దూసుకుపోయింది.
ఈ ప్రమాదంలో అటు కారు డ్రైవర్ కు, ఇటు గుర్రానికీ గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం స్థానికులు గుమిగూడారు. గుర్రాన్ని బయటికి తీయడం ఎలాగో అర్థం కాలేదు. ముందుగా డ్రైవర్ ను బయటికి తీసేందుకు ప్రయత్నించారు.
#WATCH Horse broke into a car's windshield after collision between the two. Horse and car driver suffered injuries #Jaipur (04 June) pic.twitter.com/YxN2CBFw4s
— ANI (@ANI_news) June 5, 2017
ఈలోగా ఎవరో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అక్కడికి చేరుకున్న అధికారులు కొన్ని గంటల పాటు శ్రమించి గుర్రాన్ని, డ్రైవర్‌ను కారు నుంచి బయటికు తీశారు . ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే...
ఆదివారం జైపూర్‌లోని హసన్‌పుర ప్రాంతంలో టాంగా నడుపుతున్న ఓ వ్యక్తి తన గుర్రాన్ని రోడ్డు పక్కన ఓ స్తంభానికి కట్టేశాడు. అనంతరం దానికి సరిపడా ఆహారాన్ని కూడా పక్కనే ప్యాకెట్‌లో పెట్టి వెళ్లాడు.
కానీ ఆ ప్యాకెట్ కనిపించలేదేమో గుర్రం ఏమీ తినకుండా అలాగే ఉండిపోయింది. అందులోనూ ఆ రోజు ఎండ తీవ్రత 43 డిగ్రీలు ఉంది. ఓ పక్క ఆకలికి, మరోపక్క వేడికి ఆ మూగప్రాణం తట్టుకోలేకపోయింది.
దాంతో చిరాకేసి కట్టేసిన తాడు తెంపుకొని అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ కారుపై దూకేసింది. దాంతో కారు ముందు అద్దం పగిలిపోయి గుర్రం సరాసరి డ్రైవర్ సీట్లో ఇరుక్కుపోయింది.












Click it and Unblock the Notifications