కాలేజ్ అమ్మాయిల హాస్టల్ లో సీక్రేట్ స్పై కెమెరాలు, ఎక్కడెక్కడ ఫిక్స్ చేశారంటే?
కాలేజ్ లో చదువుకుంటున్న అమ్మాయిలు, అబ్బాయిలు గదులు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొంత మంది అమ్మాయిలు లేడీస్ పీజీల్లో, అబ్బాయిలు జంట్స్ పీజీల్లో ఉంటూ కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు. లేడీస్ హాస్టల్ లో సీక్రేట్ కెమెరాలు పెట్టి అక్కడ అమ్మాయిల అశ్లీల చిత్రాలను రికార్డు చేస్తున్నారని వెలుగు చూడటం కలకలం రేపింది.
ప్రియన్ (22) అనే యువకుడు పుదుచ్చేరి మేరీ ఉజావర్కరై ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ప్రియన్ పుదుచ్చేరిలోని ఫేమస్ కాలేజ్ లో చదువుతున్నాడు. కాలేజీ విద్యార్థి అయిన ప్రియన్ శుక్రవారం తన స్నేహితుడితో కలిసి బంధువుల అమ్మాయిని కలవడానికి పుదుచ్చేరిలోని 100 ఫీట్ రోడ్డులోని లేడీస్ హాస్టల్‌కు వెళ్లాడు.

బంధువుల అమ్మాయి ఉంటున్న గదిలో టెలిఫోన్ వైరింగ్ బాక్స్ ఉండడంతో ప్రియన్ కు అనుమానం వచ్చింది. ఆ తర్వాత ప్రియన్ టెలిఫోన్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో సీక్రెట్ కెమెరా అమర్చినట్లు నిర్ధారించుకున్నాడు. అప్పుడు అందులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అతి చిన్న రహస్య కెమెరా అమర్చినట్లు ప్రియన్ గుర్తించాడు.
సీక్రేట్ కెమెరా విషయం తెలుసుకున్న ప్రియన్ అక్కడున్న సిబ్బందిని అడగగా మేము ఎందుకు సీక్రేట్ కెమెరాలు పెడుతాము, మాకు ఏమీ తెలీదు అని ప్రియన్ తో వాదించారు. ప్రియన్ చేస్తున్న ఆరోపణలను లేడీస్ హాస్టల్ సిబ్బంది ఖండించారు. ఆ సమయంలో ప్రియన్, లేడీస్ హాస్టల్ సిబ్బంది మధ్య వాగ్వివాదం జరిగింది.

ఆ తర్వాత సీక్రేట్ కెమెరా రికార్డు అయిన ఫుటేజీని పరిశీలించేందుకు ప్రియన్ తరపు వారు ప్రయత్నించారు. లేడీస్ హాస్టల్ సిబ్బంది సీక్రేట్ కెమెరాను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రత్యేక గదిలో మహిళలను అశ్లీలంగా చిత్రీకరించి వారి పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రచారం చెయ్యాని ప్రయత్నించారని, కెమెరాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన హాస్టల్ మేనేజర్, సిబ్బందిపై సంబంధిత ఆధారాలతో ప్రియన్ ఉరులాయన్‌పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
అనంతరం ఈస్ట్ ఎస్పీ స్వాతి సింగ్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ బాబుజీ నేతృత్వంలో పోలీసులు సంబంధిత హాస్టల్‌ను స్వయంగా వెళ్లి పరిశీలించారు. అనంతరం ప్రియన్ ఫిర్యాదు మేరకు పుదుచ్చేరిలోని హోటల్ మేనేజర్, పుదుచ్చేరిలోని వసంత్‌నగర్ ఆనంద్ (25), అరియాంగుప్పం నివాసి అబ్రహం (22)పై 5 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మొత్తం మీద లేడీస్ హాస్టల్ ఇంతకాలం సీక్రేట్ కెమెరాలు పెట్టారని వెలుగు చూడటంతో ఆ హాస్టల్ లోని అమ్మాయిలు హడలిపోతున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications