బాలీవుడ్ చిత్రంతో సైకో కిల్లర్‌గా ఇన్ఫోసిస్ మాజీ టెక్కీ: 22మంది హత్య

Subscribe to Oneindia Telugu

పాట్నా: అతనొకప్పుడు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగి. ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ, ఓ బాలీవుడ్ చిత్రం చూసి సైకోగా మారిపోయాడు. అంతటితో ఆగకుండా సుమారు 22మందిని దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతడే బీహార్‌కు అవినాశ్ శ్రీవాత్సవ అలియాస్ అమిత్(35). అతడ్ని వాచిరస్తున్న పోలీసులకు కూడా అతడు చుక్కలు చూపాడు.

'విచారణతో సమయం వృథా చేయకండి, సైకో కిల్లర్‌ అమిత్‌ అని గూగుల్‌లో టైప్‌ చేయండి.. నా గురించి తెలుస్తుంది' అంటూ వరుస హత్యల నిందితుడైన అవినాష్‌ పేర్కొనడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. కాగా, వైశాలి జిల్లాలో ఓ బ్యాంకులో డబ్బు దొంగతనం చేస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.

దొంగతనం కేసులో అరెస్టు చేసిన పోలీసులు విచారణలో అవినాష్‌ మాటలకు నిర్ఘాంతపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. అవినాష్‌ శ్రీవాత్సవ అలియాస్‌ అమిత్‌(35), మాజీ ఎమ్మెల్సీ లల్లాన్‌ కుమారుడు.

How a former Infosys techie turned into a psycho killer who inspired a Bollywood film

ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి ఎంసీఏ పూర్తి చేసి కొన్నాళ్లు ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి వైశాలి జిల్లా సహా పలు చోట్ల 22మందిని హత్య చేశాడు. 2003లో జరిగిన తండ్రి హత్యకు ప్రతీకారంగా హంతకులను ఒక్కొక్కరిగా చంపుతూ సీరియల్‌ కిల్లర్‌గా మారానని అతడు పేర్కొన్నాడు.

హంతకులలో ఒకరైన పప్పూఖాన్‌ శరీరంలో 32 బులెట్లు దించానని మిగిలిన నలుగురిని అదే విధంగా కాల్చి చంపానని తెలిపాడు. పైగా ఈ హత్యలన్నింటికీ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాస్సీపూర్‌-2' బాలీవుడ్‌ చిత్రంలోని ముగింపు సన్నివేశం తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు. 1960ల్లో ముంబైలో వరుస హత్యలు చేసిన రమన్‌రాఘవ్‌ని కూడా అమిత్ ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నాడని పోలీసులు వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
"Don't waste your and my time interrogating me. Just google 'psycho killer Amit and you will get all the answers." This chilling statement was made without batting an eyelid by a man arrested by Bihar Police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి