గ్రేటర్ బెంగళూరులో రాజు ఎవరు ?, మంత్రి ఎవరు ?, ఎవరికి ఎక్కువ నష్టం అంటే !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులో కూడా మంచి పట్టు సంపాధించాలని బీజేపీ, కాంగ్రెస్. జేడీఎస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు 2023లో జరిగే ఎన్నికలకు చాలా తేడా ఉందని సర్వేలో వెలుగు చూసింది. బెంగళూరులో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రత్యక్ష యుద్దం జరుగుతోందని సర్వే తెలిపింది.
బెంగళూరులోని 28 నియోజక వర్గాలతో కలుపుకుంటే గ్రేటర్ బెంగళూరులో మొత్తం 32 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 32 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పోరటం ఎక్కువగా ఉందని వెలుగు చూసింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులో బీజేపీ 11 అసెంబ్లీ నియోజక వర్గాల్లో విజయం సాధించింది.

2018 అసెంబ్లీ ఎన్నికలో బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ 17 అసెంబ్లీ నియోజక వర్గాల్లో విజయం సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులో జేడీఎస్ పార్టీ నాలుగు సీట్లు సొంతం చేసుకుని ఆ పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.
2023 కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులో బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోరాటం చేస్తున్నారని, రెండు పార్టీల మధ్య కేవలం ఒక్కసీటు మాత్రమే తేడా ఉందని జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ (కన్నడ) సర్వే ఫలితాలు విడుదల చేసింది. గ్రేటర్ బెంగళూరులోని 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది.

గ్రేటర్ బెంగళూరులోని 14 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు కోల్పోయే అవకాశం ఉందని జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ సర్వే తెలిపింది. 2018లో నాలుగు సీట్లు సొంతం చేసుకున్న జేడీఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కోల్పోయి మూడు సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే తెలిపింది.
శనివారం, ఆదివారం బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు పలు నియోజక వర్గాల్లో ఉండటంతో ఒకటి రెండు సీట్లలో పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశం ఉందని జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ కన్నడ సర్వే తెలిపింది. మొత్తం మీద బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గ్రేటర్ బెంగూరులో వీలైనన్ని సీట్లు సొంతం చేసుకోవాలని శక్తివంచన లేకుండా పోరాటం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications