మాజీ ప్రధాని మనుమడు, హీరో ఆస్తులు ఎన్ని రూ. కోట్లు అంటే ?, తండ్రి మాజీ సీఎం !

బెంగళూరు/రామనగర: మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ముద్దుల మనుమడు, మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హీరో నిఖిల్ కుమారస్వామి ఆయన కుటుంబ ఆస్తుల వివరాలు రూ. ఎన్ని కోట్లు అని ప్రకటించారు.

కర్ణాటకలోని రామనగర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కుమార్వామి భార్య అనితా కుమారస్వామి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇప్పుడు కొన్ని ఆనివార్య కారణాల వలన, తోడికోడళ్ల ఫ్యామిలీ ఫైటింగ్ దెబ్బతో మాజీ సీఎం కుమారస్వామి భార్య కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు.

Nikhil Kumaraswamy

అనితా కుమారస్వామి పోటీ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఆమె కుమారుడు, సినిమా హీరో నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. సోమవారం నిఖిల్ కుమారస్వామి ఆయన తల్లిదండ్రులు కుమారస్వామి, అనితా కుమారస్వామిని వెంటపెట్టుకుని వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా నిఖిల్ కుమారస్వామి ఆయన కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించారు.

నిఖిల్ కుమారస్వామి పేరు మీద రూ. 46. 81 కోట్ల ఆయన భార్య రేవతి పేరు మీద రూ. 1.79 కోట్ల చరాస్తి, నిఖిల్ కుమారస్వామి పేరుతో రూ. 28 కోట్లు, ఆయన భార్య రేవతి పేరు మీద రూ. 28 లక్షల విలువైన స్థిరాస్తి ఉందని ప్రకటించారు. ఇదే సమయంలో నిఖిల్ కుమారస్వామి పేరుతో రూ. 38. 94 కోట్ల అప్పు ఉందని ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. గత లోక్ సభ ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి పోటీ చేసిన నిఖిల్ కుమారస్వామి ఆమన ఆస్తులు రూ. 74 కోట్ల ప్రకటించారు. ఇప్పుు నిఖిల్ కుమారస్వామి ఆస్తుల విలువ రూ. 77 కోట్లు అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+