Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిగ్ బాస్ లో ఎంట్రీకి ఎమ్మెల్యే ఎంత డబ్బులు తీసుకున్నారంటే ?, సినిమా డైలాగులతో రచ్చ చేసి !

బెంగళూరు/చిక్కబళ్లాపురం: కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రదీప్ ఈశ్వర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి మంత్రి డాక్టర్ కే. సుధాకర్‌ను ఓడించిన ప్రదీప్ ఈశ్వర్ కోసం ఎమ్మెల్యే అయిపోయారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రదీష్ ఈశ్వర్ తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు.

కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ బాషల్లో దంచికొడుతూ యువతను ఆకట్టుకున్న ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ నిత్యం సోషల్ మీడియాలో రచ్చరచ్చ చెయ్యడంతో చర్చనీయాంశమైంది. అలాగే చిక్కబళ్లాపురం నియోజక వర్గం చుట్టూ తరచూ తిరుగుతూ ప్రజల సమస్యలను వింటున్న ఎమ్మెల్యే (MLA) ప్రదీప్ ఈశ్వర్ పని తీరును ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. తరచుగా ట్రోల్స్, వివాదాల్లో చిక్కుకునే ప్రదీప్ ఈశ్వర్ ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ (Bigg Boss) హౌస్‌లోకి ప్రవేశించాడు.

How much money did Congress party MLA Pradeep Eshwar take to enter the Bigg Boss house?

కాంగ్రెస్ (Congress)పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ (Bigg Boss) హౌస్‌లోకి ప్రవేశించడానికి ప్రదీప్ ఈశ్వర్ ఎంత డబ్బులు తీసుకున్నాడు ? ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని గంటలు ఉన్నారు? బిగ్ బాస్ ఇంటికి ఎందుకు వెళ్లారు? అని ఇప్పుడు కర్ణాటకలో రచ్చరచ్చ అవుతోంది.

చిక్కబళ్లాపురం ఎమ్మెల్యే (MLA)ప్రదీప్ ఈశ్వర్ బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి ఎమ్మెల్యే. గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో రాజకీయ నేతలు ఎవ్వరూ పాల్గొనలేదు. దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రతిపక్షాలు (BJP) కూడా ప్రదీప్ ఈశ్వర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రదీప్ ఈశ్వర్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా బిగ్ బాస్ హౌస్ లో కాలం గడిపారు.

ఇదిలా ఉండగా ప్రదీప్ ఈశ్వర్ బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లో కాలుపెట్టడానికి ఎంత డబ్బులు (money) తీసుకున్నారు ? అని జోరుగా చర్చ జరుగుతోంది. ప్రదీప్ ఈశ్వర్ డబ్బులు తీసుకున్నాడు అని బెట్టింగ్ లు కూడా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన వీడియోలు బయటకు రావడంతో రచ్చ మొదలైయ్యింది.

How much money did Congress party MLA Pradeep Eshwar take to enter the Bigg Boss house?

కానీ బిగ్ బాస్ (Bigg Boss) హౌస్‌కి వెళ్లే ప్రతి కంటెస్టెంట్‌కి ఎంతో అంత పారితోషికం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీష్ ఈశ్వర్ కు బిగ్ బాస్ షో నిర్వహకులు ఎంత డబ్బులు చెల్లించారనే చర్చ సహజం. అయితే ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్‌ బిగ్ బాస్ లో అడుగుపెట్టడానికి ఒక్క రూపాయి (money)కూడా చెల్లించలేదని సమాచారం. డబ్బులు తీసుకోకుండా ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్ బాస్ హౌస్‌కి ఎందుకు వెళ్లారు అని మరో చర్చ మొదలైయ్యింది.

ఒక్క రూపాయి (money) కూడా తీసుకోకుండా చిక్కబళ్లాపురం ఎమ్మెల్యే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు ప్రవేశించారు? ఈ ప్రశ్న తలెత్తడం సహజం. బిగ్ బాస్ హౌస్ (Bigg Boss) టీమ్‌లోని కంటెస్టెంట్స్ కు స్ఫూర్తిని నింపడానికి రావాలని ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కు బిగ్ బాస్ షో నిర్వహకులుకోరారని తెలిసింది. అందుకు అంగీకరించిన ఎమ్మెల్యే ప్రదీష్ ఈశ్వర్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు.

How much money did Congress party MLA Pradeep Eshwar take to enter the Bigg Boss house?

ప్రదీశ్ ఈశ్వర్ దాదాపు మూడు గంటల పాటు బిగ్ బాస్ హౌస్ (Bigg Boss) లోనే ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రదీప్ ఈశ్వర్ దీని వలన ఏం లాభం? అనే ప్రశ్న తలెత్తింది. ఎమ్మెల్యే (MLA) ప్రదీప్ ఈశ్వర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. చిక్కబళ్లాపురం ప్రజలకు తమ ఎమ్మెల్యేగా ప్రదీప్ ఈశ్వర్ తెలుసు. చిక్కబళ్లాపురంలో ఇప్పటికే ప్రదీప్ ఈశ్వర్ సుడిగాలి పర్యటన చేపట్టారు.

అయితే కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లోని సామాన్యులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కు చాలా తక్కువ సమాచారం ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ (Bigg Boss) లోకి అడుగుపెట్టడంతో కర్ణాటక (Karnataka) మొత్తం ఇంటింటికి ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ పరిచయం అయ్యాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. దీని ద్వారా రాజకీయంగా ఎదగడానికి ప్రదీప్ ఈశ్వర్ కు అనుకూలం అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+