కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 8 మంది మృతి, 60 మందికిపైగా గాయాలు
ముంబై: మహారాష్ట్రలోని థానేలో ఓ రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికిపైగా గాయాలపాలయ్యారు. దోంబివిలి ఎంఐడీసీ ఫేజ్-2 ప్రాంతంలోని అముదాన్ కెమికల్ కంపెనీలో గురువారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు.
ఫ్యాక్టరీలో మూడు పేలుళ్లు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కనీసం ఎనిమిది మందిని రక్షించినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పరిస్థితులను అడిగి తెలసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

దొంబివిలి ఎంఐడీసీలోని అముదన్ కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలిన ఘటన బాధాకరమని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ఈ ఘటనలో 8 మందిని రక్షించారని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.
VIDEO | The explosion at Amudan Chemicals located in Phase 2 of Dombivli MIDC area of Maharashtra's Thane district, which claimed seven lives and left dozens injured, was caught on the CCTV camera installed inside the factory.
— Press Trust of India (@PTI_News) May 23, 2024
(Source: Third Party) pic.twitter.com/hTZb8CXfmW
ఇక పేలుడు ధాటికి ఘటనాస్థలిలో పెద్ద బిలం ఏర్పడింది. పేలుడు కారణం గాజు కిటికీలు దెబ్బతిన్నాయి. బాయిలర్ పేలుడు కారణంగా ఉత్పత్తి చేయబడిన వేడి భారీ ఇనుప కిరణాలు వంగిపోయేలా చేసింది. పక్కనే ఉన్న ఫ్యాక్టరీల పైకప్పులు ఎగిరిపోయి భారీ నష్టం వాటిల్లింది. పేలుడు శబ్ధం కిలోమీటరు దూరం నుంచి వినిపించింది. ఈ పరిశ్రమలో కొందరు చిక్కుకున్నారని, వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. డ్రోన్లను ఉపయోగించారు.
Firefighters attempt to douse the fire after an explosion in the factory of Dombivali in Thane, Maharashtra on Thursday. Four people died and 39 injured in the blast. pic.twitter.com/YSvuqLBCj6
— DD India (@DDIndialive) May 23, 2024
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications