విజయ్ కోసం కాంగ్రెస్ Vs ఎన్డీఏ, కూటముల్లో చీలిక : హంగ్ వేళ వారితోనే దళపతి..!!

తమిళనాడులో సంప్రదాయ పార్టీలను విజయ్ చావు దెబ్బ కొట్టారు. ఊహించని విజయం నమోదు కట్టబెట్టి తమిళ ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు. అయిదు దశాబ్దాలుగా డీఎంకే - అన్నా డీఎంకే కూటములకు పట్టం కడుతున్న ప్రజలు.. ఈ సారి ఒక్క ఛాన్స్ పేరుతో తమ ముందుకు వచ్చిన విజయ్ ను ఆశీర్వదించారు. సింగిల్ గా పోటీ చేసిన తమ హీరో కు అండగా నిలిచారు. అయితే, ఫలితం హంగ్ దిశగా వెళ్తోంది. ఈ సమయంలో విజయ్ కోసం రెండు ప్రధాన కూటముల్లో చీలక కనిపిస్తోంది. విజయ్ కు మద్దతు కోసం కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది.

తమిళనాడులో విజయ్ కింగ్ కావటం ఖాయం. అయితే, ఎవరి మద్దతుతో అవుతారు అనేది ఇక కీలకంగా మారుతోంది. డీఎంకే- అన్నా డీఎంకే మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యంతో తాము సీఎం కాకున్నా.. ప్రత్యర్థి కాకూడదనేది ఆ రెండు పార్టీల మధ్య ఓటమి తరువాత అమలు అవుతున్న ప్రధాన వ్యూహం. ఇదే ఇప్పుడు విజయ్ కు కలిసి వస్తోంది. తమిళనాడులో అధికారం దక్కాలంటే 118 సీట్లు కావాలి. ప్రస్తుతం విజయ్ 108 సీట్ల ఆధిక్యతలో ఉన్నారు. మరో పది సీట్లు తక్కువ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే.. మద్దతుగా ఇప్పటికే పలు పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. విజయ్ ఎవరి తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది నిర్ణయించుకోవాల్సి ఉంది. కాగా.. తమిళనాడు తమ కంట్రోల్ లో ఉండేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అన్నా డీఎంకే ద్వారా విజయ్ కు ఎర వేస్తోంది.

 విజయ్ ను గెలిపించిన ఒకే ఒక్క నినాదం, ఏపీలో ఆ గెలుపే అస్త్రంగా..!!
విజయ్ ను గెలిపించిన ఒకే ఒక్క నినాదం, ఏపీలో ఆ గెలుపే అస్త్రంగా..!!
hung-assembly-buzz-could-congress-back-tvk-to-form-government-in-tamil-nadu

విజయ్ కోసం ముందుకొస్తున్న చిన్న పార్టీలు

ఇది గమనించిన కాంగ్రెస్ కొత్త లెక్కలు తెర మీదకు తెస్తోంది. కాంగ్రెస్ తో సహా వామపక్షాలు విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు రాయబారాలు చేస్తున్నాయి. డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ సైతం విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తోంది. కాంగ్రెస్ 5, వామపక్షాలు 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. బీజేపీ తో విజయ్ కలవకుండా నియంత్రించే క్రమంలో కాంగ్రెస్ ఈ ఆఫర్ తెర మీదకు తెస్తోంది. అదే సమయంలో ఎన్డీఏ కూటమిలోని చిన్న పార్టీలు ఇదే ఆలోచన చేస్తున్నాయి. అయితే.. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం రెండు స్థానాల్లోనే ఆధిక్యతలో ఉంది. దీంతో... విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదు. తుది ఫలితాలు వచ్చిన తరువాత తన ముందు ఉన్న ప్రత్యామ్నాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. తానే సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాననే ధీమాతో ఉన్నారు. దీంతో.. తమిళనాడులో విజయ్ ఎవరితో కలుస్తారనేది సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+