ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసి.. సంసారం బ్రేకప్ అయ్యేదాక తెచ్చుకున్నాడు

గోమతిపూర్ : భర్త గారు ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తే.. భార్యామణి సంసారానికి బ్రేకప్ చెప్పింది. అదేంటి! ట్రాఫిక్ రూల్స్ కు సంసారానికి లింకేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కథ. ప్రియురాలిని బైక్ పై కూర్చోబెట్టుకున్న ఊరంతా చక్కర్లు కొట్టిన భర్త గారు.. ఆ జోష్ లో ట్రాఫిక్ రూల్స్ ను సైతం పట్టించుకోకుండా బైక్ ను పరుగులు పెట్టించాడు.

హెల్మెట్ ధరించకుండానే బైక్ డ్రైవ్ చేస్తుండడంతో.. బైక్ నంబర్ తో పాటు, అతగాడి ఫోటోలను క్లిక్ మనిపించారు. ఈ సందర్బంలో అతడు తన ప్రియురాలితో బైక్ పై ఉన్న ఫోటోలు కెమెరాలో రికార్డయ్యాయి. అనంతరం బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా.. ఆ ఫోటోలను తీసుకుని చలానా చెల్లించాల్సిందిగా సదరు వ్యక్తి ఇంటి తలుపు తట్టాడు ట్రాఫిక్ పోలీస్.

Husband caught having extra marital affair by a traffic rule

ఇంట్లోంచి బయటకొచ్చిన ఆ ఇల్లాలు.. విషయమేంటో కనుక్కున్నాక.. ట్రాఫిక్ పోలీస్ చేతిలో ఉన్న ఫోటోను చూసి కంగు తింది. ఎందుకంటే.. ఆ ఫోటోలో ఉన్నది తన భర్తే అయినా.. వెనుక కూర్చున్నది మాత్రం మరెవరో మహిళ. దీంతో చలానా సంగతి పక్కనబెట్టి.. తన భర్త తనను మోసం చేస్తున్నాడని, ఆ మహిళ వివరాలు కనుక్కోవాలని పట్టుబట్టింది. దీంతో తలపట్టుకున్న పోలీసులు, కిందా మీదా పడి ఆమెకు నచ్చజెప్పారు. అహ్మదాబాద్ లోని గోమతిపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనా.. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం.. ఇలా ఓ భర్తగారి బాగోతాన్ని బట్టబయలు చేసిందన్నమాట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+