ఉత్తమ ఇల్లాలు..భర్త కాళ్లు,చేతులు కట్టేసి ప్రియుడితో శృంగారం
ఒకప్పుడు వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం, జీవితాంతం ప్రయాణానికి మొదటి అడుగు. కానీ, నేడు కొన్ని దారుణ సంఘటనలు ఈ పవిత్ర బంధంపైనే ప్రశ్నలు రేపుతున్నాయి. పెళ్లి పేరుతో మోసం, బెదిరింపులు, హత్యలు, కుట్రలు వంటివి వెలుగుచూస్తుంటే, విస్మయం కలుగుతోంది. తాజాగా మరో వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా, కాకోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైరా బాద్షాపూర్ గ్రామానికి చెందిన ఆసిఫ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
తన భార్యకు అదే గ్రామానికి చెందిన సలీమ్‌తో వివాహేతర సంబంధం ఉందని, అంతేకాకుండా ఆమె తనను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా హింసించిందని ఆసిఫ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, సలీమ్ ఆసిఫ్ భార్యకు మత్తు మాత్రలు ఇచ్చేవాడు. ఆ మాత్రలను ఆమె తన భర్త ఆసిఫ్‌కు ఇచ్చి, అతను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అతని ముందే సలీమ్‌తో లైంగిక చర్యల్లో పాల్గొనేది.

కొన్నిసార్లు ఆసిఫ్ చేతులు, కాళ్లు కూడా కట్టేసి ఈ దారుణానికి పాల్పడలేదని వారు పేర్కొన్నారు. ఈ అమానుష ప్రవర్తన, మానసిక హింస భరించలేకనే ఆసిఫ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తన మరణానికి నాలుగు రోజుల ముందు ఆసిఫ్ తన సోదరుడికి ఈ విషయం చెప్పినట్లు తెలిపారు.
పోలీసులు ఆసిఫ్ భార్య, సలీమ్‌తో పాటు షారుఖ్ అనే మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.












Click it and Unblock the Notifications