భార్య స్కూటీలో సీక్రెట్ చిప్.. హోటల్ సీన్ చూసి భర్త షాక్!

నమ్మకం లేని చోట బంధం నిలవడం కష్టమని ఈ ఘటన మరోసారి నిరూపించింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమె స్కూటీకి జీపీఎస్ (GPS) ట్రాకర్ అమర్చి, ఆమె బాగోతాన్ని రట్టు చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వ్యక్తి తన భార్యను మరో వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

ఏడాదిగా అనుమానం.. ట్రాకర్‌తో చెక్!
అమృత్‌సర్‌కు చెందిన రవి అనే వ్యక్తికి తన భార్య హిమనిపై గతేడాది కాలంగా అనుమానం మొదలైంది. ఆమె తరచుగా బయట సమయం గడపడం, ఫోన్ ఎత్తకపోవడం వంటి మార్పులు గమనించిన రవి.. ఎలాగైనా నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆమె వాడుతున్న యాక్టివా స్కూటీలో రహస్యంగా జీపీఎస్(GPS) ట్రాకర్‌ను అమర్చాడు.

Husband Installs GPS Tracker on Wife Scooty Hotel Scene Shocks Him in Amritsar

హోటల్‌లో సీన్ చూసి షాక్!
ఓ రోజు మధ్యాహ్నం ఆమె బయటకు వెళ్లినప్పుడు రవి ఫోన్ చేశాడు. ఆమె స్పందించకపోవడంతో వెంటనే తన మొబైల్‌లో జీపీఎస్ లొకేషన్ చెక్ చేశాడు. స్కూటీ ఒక హోటల్ వద్ద ఉన్నట్లు చూపించింది. రవి నేరుగా అక్కడికి వెళ్లి చూడగా.. తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి గతంలో రవి ఇంటికి 'సోదరుడి' వరుస అని చెప్పి వచ్చేవాడు.

గతంలోనూ ఇదే తప్పు..
రవి తెలిపిన వివరాల ప్రకారం.. వీరికి 2010లో వివాహం జరిగింది. 2018లో కూడా ఆమె ఇలాగే ఒక హోటల్‌లో వేరే వ్యక్తితో దొరికిపోయింది. అప్పట్లో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగి, పిల్లల భవిష్యత్తు కోసం ఆమెను రవి క్షమించాడు. కానీ మళ్లీ అదే రిపీట్ కావడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.

అసలు ఈ జీపీఎస్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది అంతరిక్షంలోని శాటిలైట్ల సహాయంతో పనిచేస్తుంది. వాహనంలో అమర్చిన చిన్న పరికరం (Tracker) నిరంతరం ఉపగ్రహాలకు సంకేతాలను పంపిస్తుంది. ఈ సంకేతాల ద్వారా ఆ వాహనం భూమిపై ఏ అక్షాంశం, రేఖాంశం వద్ద ఉందో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంటర్నెట్ సహాయంతో ఈ సమాచారాన్ని మన స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ మ్యాప్స్‌లో లైవ్ లొకేషన్‌గా చూడవచ్చు.

ప్రైవసీపై చర్చ..
వాహనాల భద్రత కోసం, దొంగతనాల నుంచి కాపాడుకోవడానికి ఈ టెక్నాలజీని కనిపెట్టారు. అయితే ఇప్పుడు వ్యక్తులపై నిఘా పెట్టడానికి దీన్ని వాడటం వల్ల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందనే చర్చ మొదలైంది. ఒక వ్యక్తికి తెలియకుండా వారిని ట్రాక్ చేయడం చట్టరీత్యా తప్పా కాదా అనే అంశంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+