Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

45 ఏళ్ల భార్యకు 21 ఏళ్ల ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.. ఇదేం విడ్డూరం !

మనుషులు మనుషులు అనే విషయాన్ని మర్చిపోయి సభ్య సమాజం సైతం తలదించుకునే ఘటనలకు తెరలేపుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి.. బంధాల్ని కాలరాస్తున్నారు. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే పెళ్లి. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. నిండు నూరేళ్లు ఒకరికి మరొకరు తోడుగా కలిసి చేసే ప్రయాణానికి.. వివాహేతర సంబంధాలతో అర్ధాంతరంగా ముగింపు పలుకుతున్నారు.

వివాహేతర సంబంధం కారణాల వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయిన ఘటనలు చాలానే చూసుంటాం. ఈ మధ్య కాలంలో అయితే భార్యలు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం ఓ ప్యాషన్ అయిపోయింది. అలానే భర్తలు సైతం భార్యలను హత్య చేసిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యకు ఓ భర్త విడ్డూరమైన చర్యతో షాక్ ఇచ్చాడు.
గ్రామస్తులు అందరి ముందు ప్రియుడితో తన భార్యకు వివాహం జరిపించాడు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే సదరు వివాహిత వయస్సు 45 ఏళ్లు అయితే.. ఆమె ప్రియుడి వయస్సు మాత్రం 21 సంవత్సరాలు. అన్నింటికన్నా పెద్ద ట్విస్ట్ ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

husband-married-his-wife-with-lover-at-jharkhand-and-video-goes-viral

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని పాకుర్ జిల్లా ఘాఘర్‌జానీ గ్రామంలో భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అయితే ఆమె గత కొన్ని సంవత్సరాలుగా 21 ఏళ్ల యువకుడితో ప్రేమ సంబంధం కొనసాగించుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం కాస్త ఆమె భర్తతో పాటు గ్రామస్తుల దృష్టికి కూడా వచ్చింది.

దీంతో గ్రామంలోని ప్రజల సమక్షంలో పంచాయతీ నిర్వహించి ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలోనే మహిళ భర్త ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సంప్రదాయ ప్రకారం ఆమె నుదుటి నుంచి సింధూరం తుడిచి, చేతిలో ఉన్న గాజులు తీసివేసి ఆమెకు విడాకులు ప్రకటించాడు. అనంతరం అదే వేదికపై తన భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఈ తరహా పని చేయడం సరైన బుద్ది చెప్పడం లాంటిదే అని కాకుంటే ఇద్దరు పిల్లలు ఉండి కూడా ఈ తరహా పనికి పాల్పడిన ఆమెకు శిక్ష విధించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+