Master plan: కోటీశ్వరుడు కావాలని ఆశ, మతగురువుతో భార్యను రేప్ చేయించిన భర్త, రూ. 10 లక్షల బంగారం!

చెన్నై/తిరుచ్చి: నేను దేవుడిని, దేవదూత అంటూ ఓ మసీదులోని మతగురువు అమాయక ప్రజలను నమ్మించాడు. మతం మారి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే తనకు బ్రోకర్ అవుతాడని భార్య ఊహించలేకపోయింది. ఈయన దేవుడు, ఆయన చెప్పినట్లు నువ్వు వినాలి, ఆయనకు శారీక సుఖం ఇవ్వాలని, తరువాత నేను కోటీశ్వరుడు అయిపోతానని భర్త భార్య మీద ఒత్తిడి చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఇలా ప్రవర్తించడంతో భార్య ఎదురుతిరిగింది. వివాహిత మహిళ ఎదురు తిరగడంతో భర్త సహాయంతో ఆమెకు పవిత్ర జలం అంటూ అందులో మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. వివాహిత మహిళపై అత్యాచారం చేసిన మతగురువు, అందుకు సహకరించిన భర్తను అరెస్టు చేసిన పోలీసులు ఇద్దరికి బెండ్ తీస్తున్నారు.

ప్రియుడి కోసం మతం మార్చుకున్న యువతి

ప్రియుడి కోసం మతం మార్చుకున్న యువతి

తమిళనాడులోని తిరుచ్చిలోని కేకేనగర్ ప్రాంతానికి చెందిన ఓ హిందూ యువతి ముస్లీంగా మారి ఆమె పేరును పర్వీన్ (32) అని మార్చుకుంది. 12 ఏళ్ల క్రితం అస్లాం (39) అనే వ్యక్తిని పర్వీన్ ప్రేమించి అందుకే ముస్లీం మతం మార్చుకుంది. తరువాత అస్లాంను ప్రేమ వివాహం చేసుకుంది. అస్లాం ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. చదువుకున్న అస్లాం తనను అర్థం చేసుకుని జీవితాంతం బాగా చూసుకుంటాడని గుడ్డిగా నమ్మిన యువతి మతం మార్చుకుని పర్వీన్ గా పేరుమార్చుకుంది.

నేను దేవుడు, మీకు దేవదూత

నేను దేవుడు, మీకు దేవదూత

అస్లాంకు ఇస్లాం మతభోదనలు అంటే చాలా ఇష్టం. కేకేనగర్ లోని సత్తార్ మసీదు పెద్ద ఫరూక్ (42) అస్లాంకు ఇస్లాం మతభోదనలు చేస్తున్నాడు. ఆ సమయంలో తాను దేవుడు, తాను దేవదూత, నేను చెప్పినట్లు మీరు చేస్తే జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుందని, మీకు ఎలాంటి కష్టాలు రావని, మీరు కోటీశ్వరులు అయిపోతారని అస్లాంతో పాటు చుట్టుపక్కల వారికి మసీదు పెద్ద ఫారుక్ మాయమాటలు చెప్పాడు.

ఆశీర్వాదం కోసం తీసుకువస్తే !

ఆశీర్వాదం కోసం తీసుకువస్తే !

ఓసారి అస్లాం మతగురువు ఫారూక్ దగ్గర తన భార్య పర్వీన్ కు ఆశీర్వాదం ఇప్పించాలని ఆమెను అతని ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. ఆ సమయంలో ఆశీర్వాదం తీసుకుంటున్న పర్వీన్ భుజాలు పట్టుకుని పైకి లేపినట్లు నటించిన ఫారూక్ ఆమెను తాకరానిచోట తాకాడు. తరువాత అందమైన పర్వీన్ ను ఎలాగైనా అనుభవించాలని మత గురువు ఫారుక్ ఆమెపై కన్ను వేశాడు.

నాకు నీభార్య కావాలి, ఓకే చెప్పిన భర్త

నాకు నీభార్య కావాలి, ఓకే చెప్పిన భర్త

రాత్రి దేవుడు తనకు కలలో కనపడి నీ భార్యకు శారీరక సుఖం ఇవ్వాలని తనకు చెప్పాడని, అలా చేస్తే మీ కష్టాలు మొత్తం తీరిపోయి మీరు కోటీశ్వరులు అయిపోయి సుఖసంతోషాలతో జీవిస్తారని మతగురువు ఫారుక్ పర్వీన్ భర్త అస్లాంకు మాయమాటలు చెప్పాడు. మతగురువు ఫారుక్ కు తన భార్య పర్వీన్ ను అప్పగించడానికి ఎంబీఏ చదువుకున్న మూర్ఖుడు అస్లాం సిద్దం అయ్యాడు.

పవిత్ర జలంలో మత్తుమందు

పవిత్ర జలంలో మత్తుమందు

మతగురువుకు శారీరక సుఖం ఇవ్వడానికి పర్వీన్ ఎదురుతిరిగింది. అప్పటి నుంచి పర్వీన్ ను అనుభవించాలని మతగురువు ఫారుక్ చాలా ప్రయత్నాలు చేశాడు. ఇదే సమయంలో పర్వీన్ కు పవిత్ర జలం ఇచ్చే ముసుగులో అందులో మత్తుమందు కలిపిన మతగురువు ఫారుక్ భర్త అస్లాం సహాయంతో ఆ నీళ్లను పర్వీన్ కు ఇచ్చాడు.

రేప్ చేసి జీహాద్ కోసం నగలు లూటీ

రేప్ చేసి జీహాద్ కోసం నగలు లూటీ


మత్తుమందు కలిపిన నీళ్లు తాగిన పర్వీన్ మత్తులోకి జారుకుంది. ఆ సమయంలో పర్వీన్ పై మతగురువు ఫారుక్ అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తరువాత నువ్వు జీహాద్ కు సహకరించాలని పర్వీన్ మీద ఒత్తిడి చేసిన మతగురువు ఆమె దగ్గర ఉన్న 25 సవర్ల బంగారు నగలు. ( రూ. 10 లక్షల విలువైన 200 గ్రాముల బంగారు నగలు) లూటీ చేశాడు.

నాకు మొగుడు కాదు బ్రోకర్

నాకు మొగుడు కాదు బ్రోకర్


నీళ్లలో తనకు మత్తుమందు కలిపి ఇచ్చి మతగురువు ఫారుక్ అత్యాచారం చెయ్యడానికి, బంగారు నగలు లూటీ కావడానికి భర్త అస్లాం కారణం అయ్యాడని, వీడు మొగుడు కాదు, బ్రోకర్ అంటూ రగిలిపోయిన పర్వీన్ తిరుచ్చి కంటోన్మెంట్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు భర్త అస్లాం, మతగురువు ఫారుక్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+