ప్రియుడి కోసం వెతుక్కుంటూ వెళ్లి.. మూడేళ్లకు వ్యభిచార కూపంలో ప్రత్యక్షం
కడప జిల్లాలోని రాయచోటిలో శుక్రవారం రాత్రి పోలీసులు వ్యభిచార గృహం పైన పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో హైదరాబాదుకు చెందిన ఓ బాధితురాలిని రక్షించారు.
హైదరాబాద్: కడప జిల్లాలోని రాయచోటిలో శుక్రవారం రాత్రి పోలీసులు వ్యభిచార గృహం పైన పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో హైదరాబాదుకు చెందిన ఓ బాధితురాలిని రక్షించారు. హైదరాబాదుకు చెందిన సదరు మహిళ తాను ప్రేమించిన వ్యక్తి కోసం ఇంటి నుంచి మూడేళ్ల క్రితం కడపకు వచ్చింది.
అయితే, ఆమెకు తన ప్రేమికుడి జాడ తెలియరాలేదు. తాను అతని చేతిలో మోసపోయానని గ్రహించింది. తిరిగి ఇంటికి వెళ్లలేకపోయింది. నాడు భయంతో ఒంటరిగా బస్టాండులో కూర్చుంది. అప్పుడు ఆమెను కొందరు పరిచయం చేసుకున్నారు.

ప్రేమికుడి విషయంలో సహకరిస్తామని నమ్మించారు. అనంతరం ఆమెను రాయచోటిలోని వ్యభిచార కేంద్రానికి తీసుకు వచ్చారు. ఇదిలా ఉండగా, 2013లో బాధితురాలు తప్పిపోయినట్లు హైదరాబాదులోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిర్వాహకులను పోలీసులు అఱెస్టు చేశారు.












Click it and Unblock the Notifications