Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Reddy: గాలి జనార్దన్ రెడ్డి మీద పోటీకి సిద్దం అయిన సొంత తమ్ముడు ?, మా అన్న చాలా పెద్ద తప్పు చేశాడు !

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థులను పోటీలోకి దింపి వారిని గెలిపించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి ఆయన అనుచరులు, మద్దతుదారులు, అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో వైపు గాలి జనార్దన్ రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ , ఆయన కూతురు బ్రహ్మిణి బళ్లారిలో కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ తరపున ప్రచారం మొదలుపెట్టారు. అయితే గాలి జనార్ద్ రెడ్డి సొంత తమ్ముడు, బీజేపీ నాయకుడు గాలి సోమశేఖర్ రెడ్డి ఆయన అన్న గాలి జనార్దన్ రెడ్డి స్థాపించిన కొత్త పార్టీ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో నుంచి మా అన్న బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టి చాలా పెద్ద తప్పు చేశారని మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది. మా అన్న మీద పోటీ చెయ్యడానికి నేను సిద్దం అని గాలి సోమశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత తమ్ముడే ఇలా అంటే ఇక మిగిలిన వాళ్లు గాలి వెంట ఉంటారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.

రంగంలోకి భార్య, కూతురు

రంగంలోకి భార్య, కూతురు

అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో అడుగు పెట్టకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి జిల్లాకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ స్థాపించారు. కొత్త రాజకీయ పార్టీ తరపున గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి సిటీతో పాటు ఆ జిల్లాలో ప్రచారం చెయ్యడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది.

ప్రచారంలో రెడ్డి కూతురు బ్రహ్మణి

ప్రచారంలో రెడ్డి కూతురు బ్రహ్మణి

కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి తిరిగి బళ్లారికి రావాలని కోరుకుంటున్నట్లు తాజాగా గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి రాజీవ్ రెడ్డి అలియాస్ బ్రహ్మిణి బహిరంగ సభలో చెప్పారు. కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ వ్యవస్థాపకుడు గాలి జానార్దన్ తరపున పార్టీ కార్యకర్తలు నిర్వహించిన బహిరంగ సభలో బ్రహ్మిణి, గాలి జనార్దన్ రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ మాట్లాడారు.

బళ్లారికి ఎంతో చేశారు

బళ్లారికి ఎంతో చేశారు

బళ్లారి నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో రింగ్ రోడ్డు అభివృద్ధి చెందడానికి గాలి జనార్దన్ రెడ్డి కారణం అని బ్రహ్మిి అన్నారు. వాల్మీకి సర్కిల్‌, ఎస్‌ఎన్‌పేట ఫ్లైఓవర్‌, రేడియో పార్క్‌ ఫ్లైఓవర్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు గాలి జనార్దన్ రెడ్డి చేపట్టారని బ్రహ్మిణి గుర్తు చేశారు. గాలి జనార్దన్ రెడ్డిని, ఆయన పార్టీ నాయకులను మీరు ఆశీర్వధించాలని గాలి జనార్దన్ రెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణ ప్రజలకు మనవి చేశారు.

గాలి సోమశేఖర్ రెడ్డి రివర్స్ గేర్ ?

గాలి సోమశేఖర్ రెడ్డి రివర్స్ గేర్ ?

బళ్లారి నగరంలో నా సోదరుడు గాలి జనార్దన్ రెడ్డి ఆయన సొంత పార్టీ జెండా మీద పోటీ చేసినా నేనే ఆయన మీద పోటీ చేస్తానని, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని వీడనని, బీజేపీలోనే ఉంటానని, వెనక్కి తగ్గడం నా చరిత్రలో లేదని గాలి జనార్దన్ రెడ్డి తమ్ముడు, బీజేపీ నాయకుడు గాలి సోమశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టి చాల పెద్ద తప్పు చేశారని ఆయన సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లో ఓపిక లేకపోతే ఎలా ?

రాజకీయాల్లో ఓపిక లేకపోతే ఎలా ?

గాలి జనార్దన్ రెడ్డి మరో పార్టీ పెట్టటాన్ని తాను తప్పుపడుతున్నానని ఇటీవల గాలి సోమేఖర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తన సోదరుడు గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారు అని కొన్ని సంవత్సరాల నుంచి ఆయన అభిమనులు నన్ను కూడా అడిగారు. మరో పార్టీ పెట్టమని మేము గాలి జనార్దన్ రెడ్డిని అడగలేదు, మామాట వినకుండా కొత్త రాజకీయ పార్టీని ఆయన స్థాపించారని, రాజకీయాల్లో మనిషికి ఓపిక ఉండాలని, గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టి వందకు వంద శాతం తప్పు చేశారని, ఆయన కొత్త రాజకీయ పార్టీ విషయంలో ప్రజలే ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని గాలి సోమశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి శ్రీరాములు అన్నకు టచ్ లో ఉన్నారు

మంత్రి శ్రీరాములు అన్నకు టచ్ లో ఉన్నారు

గాలి జనార్దన్ రెడ్డిని ఒప్పించి మళ్లీ బీజేపీలోకి తీసుకురావడానికి మంత్రి శ్రీరాములు ప్రయత్నిస్తున్నారని. అయితే ఎన్నికలకు ముందే ఆయనను బీజేపీలోకి తీసుకురాలేరని గాలి సోమశేఖర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలోకి తీసుకురావాలని తాను ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అలాంటి ప్రయత్నాలు చెయ్యలేదని, మంత్రి శ్రీరాములు అన్ని చూసుకుంటారని గాలి సోమశేఖర్ రెడ్డి బాంబు పేల్చారు.

ఆరోజు ఆ పరిస్థితుల కారణంగా పోటీ చెయ్యలేదు

ఆరోజు ఆ పరిస్థితుల కారణంగా పోటీ చెయ్యలేదు

2013లో నేను నా సోదరుడు గాలి జనార్దన్ రెడ్డి కోసం బళ్లారిలో బీజేపీ టిక్కెట్ అడిగి పోటీ చేయలేదు. నా సోదరుడు జైలులో ఉన్నాడు కాబట్టి నేను బెంగళూరు, హైదరాబాద్ లో కోర్టుల చుట్టు తిరగడానికి, వేరే ప్రాంతాలకు తిరగడం వల అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదని గాలి సోమశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చారు. నేను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ మీద బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయం. బళ్లారిలో అయినా ఎక్కడైనా తాను పోటీ చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని, బళ్లారి సిటీలో గాలి జనార్దన్ రెడ్డి పోటీ చేసినా ఆయన మీద తాను పోటీ చేస్తానని గాలి సోమశేఖర్ రెడ్డి బాంబు పేల్చడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+