రజినీ అద్భుతం, పట్టలేని ఆనందం, బాడీగార్డునే: లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళ సూపర్ రాజకీయ ప్రవేశం చేయడంతో ఆయనకు సినీ ప్రముఖుల నుంచి మద్దతు కొనసాగుతోంది. ఇప్పటికే తాను రజినీ వెంటే ఉంటానని చెప్పిన ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు.

రజినీ! గుడ్ లీడర్: అక్షయ్, మద్దతుగా 234స్థానాల్లో విశాల్ ప్రచారం, రెహమాన్ సపోర్ట్

తనకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వద్దని లారెన్స్‌ అన్నారు. సొంతంగా రాజకీయ పార్టీని స్థాపిస్తానని రజనీకాంత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మధురైలో ఏర్పాటు చేసిన రజనీ ఫ్యాన్స్‌ మీట్‌లో లారెన్స్‌ పాల్గొన్నారు. రాజకీయాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

 రజినీ కోసం ఏదైనా చేస్తా

రజినీ కోసం ఏదైనా చేస్తా

‘ఈ వేడుకకు నన్ను ఆహ్వానించినప్పుడు.. నా తలైవా కోసం ఏదైనా చేస్తానని చెప్పాను. ఇదంతా రజనీ తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించకముందు జరిగింది' అని రాఘవ లారెన్స్ చెప్పారు.

 ఎంత అద్భుతంగా మాట్లాడారో..

ఎంత అద్భుతంగా మాట్లాడారో..

‘ఇటీవల నేను రజనీ కోసం ‘వా తలైవా..' అనే పాటను విడుదల చేశా. మీ అందరిలాగే నేనూ టీవీ ముందు కూర్చొని తలైవా ఏం చెప్పబోతున్నారు? అని ఆతృతగా విన్నాను. ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడారు' అంటూ లారెన్స్ ప్రశంసించారు.

 రజినీ మాటల్లో వయసు కనిపించిందా?

రజినీ మాటల్లో వయసు కనిపించిందా?

‘రాజకీయాల్లోకి వచ్చే వయసు రజినీది కాదని కొందరు అంటున్నారు. మరి ఆ వయసు ఆయన మాటల్లో కనిపించిందా? రజనీ చెప్పిన ప్రతి మాట ఆయన హృదయం నుంచి వచ్చింది. మిగిలిన నాయకులు పేపర్‌ ముందు పెట్టుకుని మాట్లాడుతుంటారు' అని లారెన్స్ అన్నారు.

 డ్యాన్స్ చేశా..

డ్యాన్స్ చేశా..

‘రజినీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తర్వాత నేను నా కుటుంబం మొత్తం కలిసి డ్యాన్స్‌ చేశాం. అదే నేను నటుడ్ని కాకపోయి ఉంటే.. ఈ వేడుకను వీధిలోకి వెళ్లి సెలబ్రేట్‌ చేసుకునేవాడ్ని. నేను మీకు గార్డ్‌గా ఉంటానని తలైవాతో అన్నాను. ఆయన సరే అన్నారు. ఇదంతా నేను నా స్వలాభం కోసం చేస్తున్నానని కొందరు అనుకుంటున్నారు. నాకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వద్దు.. ఎందుకంటే తలైవాకు గార్డ్‌గా ఉండటానికి మించిన పని మరొకటి లేదు' అంటూ రజినీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు రాఘవ లారెన్స్. కాగా, ఇప్పటికే ప్రముఖ నటుడు విశాల్.. రజినీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cine Actor and Director Raghava Lawrence said that he is Superstar Rajinikanth's Bodyguard.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి