నరేంద్ర మోడీ లాంటి ప్రధానిని నా జీవితంలో చూడలేదు, నోరు తెరిస్తే, సీఎం సిద్దూ!

బెంగళూరు: నరేంద్ర మోడీలాంటి కళ్లు రాజకీయాలు చేసే ప్రధానమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. చెక్ రూపంలో లంచం తీసుకునే బీజేపీ నాయకులను పక్కన పెట్టుకుని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కమీషన్ల ప్రభుత్వం అని ఎలా విమర్శిస్తారో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎం సిద్దరామయ్య డిమాండ్ చేశారు. నోరు తెరిస్తే అన్నీ అపద్దాలు చెబుతున్నారని సిద్దరామయ్య ఆరోపించారు.

అర్దరూపాయి విలువలేదు

అర్దరూపాయి విలువలేదు

కోప్పలలో బుధవారం మీడియాతో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోడీ మీద విరుచుకుపడ్డారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సందర్బంలో ప్రతిసారి కాంగ్రెస్ ది కమీషన్ల ప్రభుత్వం అని ప్రధాని మోడీ ఎలా విమర్శిస్తారని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణల్లో అర్దరూపాయి విలువలేదని సీఎం సిద్దరామయ్య ఎద్దేవ చేశారు.

చెక్ రూపంలో లంచం

చెక్ రూపంలో లంచం

ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో చెక్ రూంలో లంచం తీసుకుని అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన వారిని పక్కన పెట్టుకుని అవినీతి గురించి ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తున్నారని సిద్దరామయ్య ఆరోపించారు.

కేంద్రం, గుజరాత్ లో !

కేంద్రం, గుజరాత్ లో !

నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో లోకాయుక్తను నియమించకుండా అవినీతి మయం చేశారని, ప్రధాని అయిన తరువాత ఆయన లోక్ పాల్ బిల్లును అడ్డుకున్నారని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.

రైతులను చంపితే రైతుబంధు

రైతులను చంపితే రైతుబంధు

బీఎస్. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హావేరీలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేశారని, ఆ సమయంలో సీఎం హోదాలో పోలీసులతో కాల్పులు జరిపించి రైతులను పొట్టనపెట్టుకున్నారని సిద్దరామయ్య ఆరోపించారు. రైతులు చంపించిన యడ్యూరప్పకు ప్రధాని నరేంద్ర మోడీ రైతుబంధు అంటూ బిరుదు ఇవ్వడం విచారకరం అని సీఎం సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేశారు.

దేశం దాటించారు ఇక చాలు

దేశం దాటించారు ఇక చాలు

లలిత్ మోడీ, విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బ్యాంకులకు రూ. వేల కోట్లు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయారని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఈ ముగ్గురు దేశం విడిచి పారిపోయింది ఎవరి అధికారంలో అని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+