వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లు... ఫోన్ నెంబర్ ఇప్పటికీ గుర్తుంది: బాన్ కీ మూన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి చీఫ్ బాన్ కీ మూన్ భారత్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన దౌత్య ప్రస్ధానం 1972లో భారత్‌లో లోనే మొదలైందని అన్నారు. భారత్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుందని అన్నారు.

గతంలో భారత్‌లో ఉన్నప్పుడు తనకు కేటాయించిన ఫోన్ నెంబర్ ఇప్పటికీ గుర్తుందని తెలిపారు. భారత్‌లో తనకు మధుర స్మృతులు ఉన్నాయని చెప్పారు. గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు మహాత్మా గాంధీ లేఖలను చూడడాన్ని తనకు దక్కిన అత్యంత గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతిని నెలకొల్పడంలో మహాత్మా గాంధీ ఛాంపియన్‌ని అన్నారు.

I feel at home in India: Ban Ki-moon

ఇది ఇలా ఉంటే 43 ఏళ్ల క్రితం భారత్‌లో దక్షిణ కొరియా వైస్ కాన్సుల్‌గా బాన్ కీ మూన్ విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన భారత్‌ను అనేకసార్లు సందర్శించారు. ఐక్యరాజ్య సమితి చీఫ్ హోదాలో నాలుగు సార్లు భారత్‌కు వచ్చారు.

గత నెలలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ ఎఫైర్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు ఢిల్లీని వదిలి వెళుతున్నప్పుడు గుండెలో సగభాగం ఇక్కడే వదిలివెళుతున్నానని అన్నారు. ఢిల్లీ వస్తే తాను సంపూర్ణ మనిషిగా మారిపోతానని, ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

రెండు వారాల్లో భారత్ పర్యటనకు సింగపూర్ దేశాధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడి భారత్ పర్యటన మంగళవారంతో ముగిసింది. మరో రెండు వారాల్లో మరో దేశాధ్యక్షుడు భారత్‌కు రానున్నారు. సింగపూర్ దేశాధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్ యామ్ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించేందుకు ఢిల్లీకి రానున్నారు. ఈ విషయాన్ని సింగపూర్ దేశ రవాణాశాఖ మంత్రి వెల్లడించారు.

English summary
Fondly recalling his "wonderful" memories of India, UN chief Ban Ki-moon has said he feels at home in the country and still remembers the phone number of his old house in New Delhi where he started his diplomatic career in 1972.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X