Ranbir weds Alia:ఫ్యాన్స్‌కు ఆలియా షాక్...పెళ్లి విషయం బయటపెట్టి..ఎప్పుడు ఎలా జరిగింది..?

ముంబై: రణబీర్ కపూర్ - ఆలియా భట్ పెళ్లి జరిగిపోయిందా... పెళ్లి చాలా సీక్రెట్‌గా జరిగిందా అంటే ఔననే చెబుతోంది ఆలియా భట్. ప్రస్తుతం ఇదే ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ జంట కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రహస్యంగా పెళ్లి ఎందుకు చేసుకున్నారు.. ఈ సెలబ్రిటీ కపుల్ మ్యారేజ్ పై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. దీని వెనక కారణం ఆలియా భట్ క్లారిటీ ఇవ్వడంతోనే చర్చ ప్రారంభమైంది. ఇంతకీ ఆలియా భట్ ఏం చెప్పింది..?

 ఫ్యాన్స్‌ను పరేషాన్ చేసిన ఆలియా భట్

ఫ్యాన్స్‌ను పరేషాన్ చేసిన ఆలియా భట్

రణబీర్ కపూర్ - ఆలియా భట్ ది మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. ఈ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉంటారు. తాజాగా ఆలియా భట్ వీరి మ్యారేజ్‌ పై ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకాలం ప్రేమలో ఉన్న తాము ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోయామంటూ ఆలియా భట్ సడన్ బాంబ్ పేల్చింది. దీంతో ఇటు రణబీర్ కపూర్ అటు ఆలియా భట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే పెట్టారు. ఒక వేళ పెళ్లి జరిగుంటే కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదే అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

 ఆ చిత్రం షూటింగ్‌లో ప్రేమలో..

ఆ చిత్రం షూటింగ్‌లో ప్రేమలో..

రణబీర్ కపూర్ - ఆలియాభట్‌లు బ్రహ్మాస్త్రా అనే చిత్రం షూటింగ్‌లో ఉండగా ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తొలినాళ్లలో ఇద్దరూ చాలా సీక్రెట్‌గా ఉంచారు. ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. ఇక అంతా బహిర్గతం కావడంతో ఇద్దరూ కలిసి పలు ఫంక్షన్లకు, ఇతర ఈవెంట్లకు పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చేవారు. ఇక వీరిద్దరూ ఎప్పుడైతే వీరి రిలేషన్ గురించి బయటపెట్టారో అప్పుడే ఫ్యాన్స్ ఇద్దరూ త్వరగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైతే బాగుండు కదా అని భావించారు. కానీ ఇంతలోనే ఆలియా భట్ అంత షాక్ ఇస్తుందని ఊహించలేదు.

 మా పెళ్లికి కరోనా అడ్డు

మా పెళ్లికి కరోనా అడ్డు

ఇక ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూబాయ్ యాక్ట్రెస్ రణబీర్‌తో పెళ్లి అయ్యిందంటే మైండ్ బ్లోయింగ్ విషయం వెల్లడించింది. అంతకు ముందు రణబీర్ కపూర్ కూడా ఓ ఇంటర్వ్యూలో తమ పెళ్లి ప్రస్తావన గురించి చెప్పాడు. తన పెళ్లి వేడుకపై తాను ఎన్నో కలలు కన్నానని అయితే ఆ కలలన్నిటినీ కరోనా తుడిచేసిందని చెప్పుకొచ్చారు. పరిస్థితులు బాగుండి ఉంటే తమ పెళ్లి అత్యంత వైభవంగా జరిగేలా ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించాడు. ఇక అప్పటి నుంచి ఆలియాపై తనకున్న ప్రేమను పలు సందర్భాల్లో వెరైటీగా వ్యక్త పరుస్తూ వచ్చాడు రణబీర్. అంతేకాదు కొన్ని ఈవెంట్స్‌లో ఏకంగా ఆలియా ముందు మోకాళ్ల మీద ఉండి తనను ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో కూడా అడిగేవాడు.

 అలా మా పెళ్లి జరిగిందన్న ఆలియా..

అలా మా పెళ్లి జరిగిందన్న ఆలియా..

ఇక సడెన్‌గా వీరిద్దరూ ఒక్కటయ్యారనే వార్తతో కొందరు షాక్ అయ్యారు. అలా అని రణబీర్-ఆలియాలు పారిపోయి పెళ్లిచేసుకోలేదు. లేదా ఎవరి కంటాపడకుండా రహస్య పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆలియా భట్ రణబీర్‌ను పెళ్లి చేసుకున్నట్లు పేర్కొంది. కొన్నేళ్ల క్రితమే ఆయనతో తన మనసులో పెళ్లి జరిగిపోయిందంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్‌కు స్పష్టత వచ్చేసింది. ఇలా చెప్పి ఆలియా భట్ షాక్ ఇచ్చినప్పటికీ... వీరిద్దరి వివాహం త్వరలో జరగనున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. రెండు కుటుంబాలు వీరి ప్రేమకు అంగీకారం తెలిపారు కూడా. త్వరలోనే కపూర్-భట్ కుటుంబం నుంచి ఓ గ్రాండ్ మ్యారేజ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే రణబీర్ కపూర్ నటించిన షమ్షేరా 22 జూలై 2022న విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆలియా భట్ నటించిన గంగుబాయ్ కతియావాడి ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+