వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నన్ను రేప్ చేసిన వ్యక్తి మాటలను నేను సీక్రెట్‌గా రికార్డ్ చేశాను'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అత్యాచారం

రేపిస్టు నేరాంగీకారాన్ని ఆడియో రికార్డింగ్ చేసిన ఒక మహిళ, నిందితులు సాక్ష్యాలను ఎలా తారుమారు చేయగలరో రుజువు చేసేందుకు ఆ ఆడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.

ఎల్లీ విల్సన్ అనే 25 ఏళ్ల మహిళ తన బ్యాగ్‌లో ఫోన్‌ను పెట్టుకుని, డేనియల్ మెక్‌ఫార్లాన్ అనే వ్యక్తి తాను చేసిన నేరాలను ఒప్పుకోవడాన్ని రహస్యంగా రికార్డు చేశారు.

మెక్‌ఫార్లాన్ రెండు సార్లు అత్యాచారం చేసినట్టు తేలడంతో, గత ఏడాది జూలైలో యూకేలో అతనికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది.

కోర్టులో ఆడియో, రాతపూర్వక నేరాంగీకారాలున్నప్పటికీ, తీర్పు ఏకగ్రీవంగా రాలేదని ఎల్లీ విల్సన్ అన్నారు.

డిసెంబర్ 2017 నుంచి ఫిబ్రవరి 2018 మధ్య కాలంలో మెక్‌ఫార్లాన్ ఈ నేరాలు చేశాడు. ఆ సమయంలో మెక్‌ఫార్లాన్ గ్లాస్గో యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తుండగా, ఎల్లీ విల్సన్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్‌గా ఉండేవారు.

మెక్‌ఫార్లాన్ కేసు గెలిచినప్పటి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ సంఘటన జరిగిన తర్వాత ఏడాదికి మెక్‌ఫార్లాన్‌తో జరిపిన సంభాషణ ఆడియోను ఎల్లీ విల్సన్ ట్విటర్‌లో పోస్టు చేశారు.

''నువ్వు అత్యాచారం చేసి కూడా రేప్ చేయలేదని చెప్పినప్పుడు నేను ఎంతో వేదనకు గురయ్యానో నీకు అర్థం కావడం లేదా?’’ అని ఎల్లీ విల్సన్ అతన్ని అడిగినట్టు ఆడియో రికార్డింగ్‌లో ఉంది.

''ఎల్లీ, నన్ను నమ్మాల్సిన వ్యక్తులు నమ్ముతారు. ఏదో ఒక రోజు నేను నిజం బయటికి చెబుతాను. కానీ, ఈ రోజు కాదు’’ అని మెక్‌ఫార్లాన్ అన్నారు.

చేసిన పనికి ఎలా ఫీలవుతున్నావని అడిగినప్పుడు, ''నేను జైలులో లేనందుకు చాలా సంతోషంగా భావిస్తున్నా’’ అని సమాధానమిచ్చాడు.

ఎల్లీ విల్సన్ చేసిన ఆ ట్వీట్‌ను 2 లక్షల మందికి పైగా వీక్షించారు.

అత్యాచారం

అత్యాచారం జరిగినట్టు రుజువు చేసేందుకు తన దగ్గర ఎలాంటి సాక్ష్యం ఉందో ప్రజలకు తెలియజేసేందుకే తాను ఈ ఆడియో క్లిప్‌ను విడుదల చేసినట్టు ఎల్లీ విల్సన్, బీబీసీకి తెలిపారు.

ఈ ఆడియో క్లిప్‌కు అనూహ్యంగా సానుకూలమైన స్పందన వస్తుందని, తక్కువ మంది మాత్రమే నిర్దయగా వ్యవహరిస్తున్నట్టు ఎల్లీ విల్సన్ చెప్పారు.

ఆన్‌లైన్‌లో అతని నేరాంగీకారానికి చెందిన ఆడియోను పోస్టు చేసినప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఇంకా మెక్‌ఫార్లాన్ ఎలాంటి తప్పు చేసి ఉండడని అంటున్నారని విల్సన్ అన్నారు.

నేరాంగీకారానికి చెందిన ఆడియోతో పాటు మెక్‌ఫార్లాన్ తప్పు చేసినట్టు విల్సన్ వద్ద టెక్ట్స్ మెసేజ్‌లు కూడా ఉన్నాయి. ఈ నేరాంగీకారాన్ని నిరూపించడానికి ఇవి కూడా సరిపోవేమోనని తను చాలా ఆందోళన చెందినట్టు విల్సన్ చెప్పారు.

తీర్పు కూడా ఏకగ్రీవంగా రాలేదన్నారు.

''నేరాంగీకారానికి సంబంధించి మీ వద్ద రాత పూర్వకమైన ఆధారాలు, ఆడియో రికార్డింగ్ సాక్ష్యాలున్నా, జ్యూరీలో ఉన్న అందరూ నిన్ను నమ్మాలని లేదు. ఇది సమాజం గురించి మనకు చాలా చెబుతుందని నేను అనుకుంటున్నా’’ అని విల్సన్ అన్నారు.

కోర్టులో తనకు ఎదురైన అనుభవం చాలా భయానకంగా అనిపించిందని విల్సన్ చెప్పారు.

కోర్టులో ప్రతివాది తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని, వేధింపులకు గురిచేస్తూ కూడా తననే నిందించినట్టు అనిపించిందన్నారు.

క్రాస్-ఎగ్జామినేషన్‌లో భాగంగా తనను చాలా అమానవీయంగా, చులకనగా, వేధింపులకు గురిచేసినట్టు అనిపించిందని విల్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కోర్టు కేసుకి చెందిన కాపీని తాను ఇటీవలే చదివానని విల్సన్ బీబీసీకి చెప్పారు. దానిలో పేర్కొన్న కొన్ని అంశాలు తనను చాలా బాధపెట్టినట్టు చెప్పారు.

మెక్‌ఫార్లాన్ తనకు తానుగా మంచి విద్యార్థినని, బంగారు భవిష్యత్ ఉన్న క్రీడాకారుడినని చిత్రీకరించుకున్నాడని, ఇలాంటి నేరాలు తాను చేయననే భావనను కలిగించాడని విల్సన్ అన్నారు.

ఎల్లీ విల్సన్

''దీనిలో నిజమెంతుందో నేను ప్రజలకు చూపించాలనుకున్నాను. ముఖ్యంగా అతనికి సపోర్టు చేస్తున్న వారికి నిజనిజాలు తెలియజేయాలనుకున్నా’’ అని చెబుతూ ట్విటర్‌లో ఆమె ఈ ఆడియోను పోస్టు చేశారు.

నేరం చేసిన వారు ఉద్దేశ్యపూర్వకంగా ప్రజల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో తాను చూపించాలనుకున్నానని చెప్పారు.

''మూసివేసిన తలుపులు వెనకాల మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో నేను చూపించాలనుకున్నా’’ అని ఆమె అన్నారు.

2020లో మెక్‌ఫార్లాన్ తనను అత్యాచారం చేసినట్లు విల్సన్ పోలీసులకు ఫిర్యాదు చేయగానే గ్లాస్గో యూనివర్సిటీ నుంచి అతన్ని బయటకు పంపించింది. ఆ సమయంలో ఆ యూనివర్సిటీలో విల్సన్, మెక్‌ఫార్లాన్ చదువుకునే వారు.

పోలీసు విచారణ జరుగుతున్నప్పటికి కూడా ఎడిన్‌బరా యూనివర్సిటీలో అతను అడ్మిషన్ పొందేందుకు ప్రయత్నించాడని విల్సన్ గుర్తించారు.

'' అది నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఎడిన్‌బరాలో మహిళా విద్యార్థుల గురించి నేను ఆలోచించాను. వారు కూడా మెక్‌ఫార్లాన్ బాధితులు కావొచ్చు’’ అని విల్సన్ అన్నారు.

ప్రజల రక్షణ కోసం యూనివర్సిటీలు సరిగ్గా వ్యవహరించడం లేదనే విషయాన్ని తెలుసుకుని తాను చాలా ఆందోళన చెందినట్టు ఆమె వెల్లడించారు.

ఎల్లీ విల్సన్

ఎల్లకాలం నాతోనే ఉంటుంది

''నాకు జరిగిన దాన్ని నేను మార్చలేను. అది ఎల్లకాలం నాతోనే ఉంటుంది. నా బాధకు నేను ఉపశమనాన్ని వెతుక్కోవాల్సి ఉంది’’ అని విల్సన్ చెప్పారు.

''సమాజంలో సానుకూల దిశగా మార్పును తీసుకురావాలని నేను ఆలోచిస్తున్నాను. దీని వల్ల ఇతరులకు కూడా కాస్త తేలికవుతుంది. అదే నాకు ప్రేరణనిస్తుంది. నేనిక దీన్ని చేయలేనని భావించినప్పుడు అదే నన్ను తట్టి లేపుతుంది’’ అని అన్నారు.

విద్యార్థుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని, విద్యార్థి తప్పు చేసినట్టు నిరూపితమైతే వెంటనే చర్యలు తీసుకుంటామని ఎడిన్‌బరా యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

తమ అడ్మిషన్ విధానాలను మరింత పటిష్టంగా మార్చేందుకు అవసరమైన అన్ని మార్పులను చేపట్టేందుకు ప్రజలు చెప్పే అభిప్రాయాలను వింటామని, విద్యార్థులందరూ సురక్షితంగా, భద్రంగా ఉంచేలా చేస్తామని తెలిపింది.

విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము తదుపరి చర్యలు తీసుకునేందుకు స్కాటిష్ ప్రభుత్వం, ఎల్లీతో కలిసి తాము పనిచేస్తున్నట్టు స్కాట్లాండ్ యూనివర్సిటీల అధికార ప్రతినిధి చెప్పారు.

కరోనాకు ముందు తీసుకొచ్చిన డేటా భద్రతా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి, పరిస్థితులు మరింత మెరుగ్గా మారేలా ప్రయత్నించగలమన్నారు.

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
'I Secretly Recorded a accuser dialogues who Raped me'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X