విక్రమ్ ల్యాండింగ్‌కు ఒక్కరోజు ముందు.. ఇస్రో ఛైర్మన్‌తో మాట్లాడా: శ్రీశ్రీ రవిశంకర్

వాషింగ్టన్/బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.

ఇక రోవర్‌ ద్వార చంద్రుడి మీదికి పంపించిన పేలోడ్స్ అన్నీ కూడా సక్రమంగా పని చేస్తోన్నాయి. పేలోడ్స్ అన్నీ స్విచ్ ఆన్ అయ్యాయి. వాటి ద్వారా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలానికి సంబంధించిన పూర్తి సమాచారం, డేటా బెంగళూరులోని ఇస్రో కమాండ్ కంట్రోల్ స్టేషన్‌కు అందడం ఆరంభమైంది.

I spoke to ISRO Chief a day before Chandrayaan 3, says Sri Sri Ravishankar

ఇదే ఊపులో సూర్యుడిపై ప్రయోగాలకు పూనుకుంది ఇస్రో. దీనికోసం ఆదిత్య ఎల్1ను ప్రయోగించడానికి రంగం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11:55 నిమిషాలకు తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ శాటిలైట్‌ను ప్రయోగించబోతోంది.

ఆదిత్యునిపై ప్రయోగాలకు పూనుకున్న నేపథ్యంలో- ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పండిత్ శ్రీశ్రీ రవిశంకర్ స్పందించారు. చంద్రయాన్ 3 తరహాలోనే ఈ ప్రయోగం కూడా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అత్యంత క్లిష్టతరమైన చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం గొప్ప విషయమని అన్నారు.

వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచ సాంస్కృతిక వేడుకల సందర్భంగా రవిశంకర్ విలేకరులతో మాట్లాడారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడం భారత్‌కు మాత్రమే కాదని, మానవాళి మొత్తానికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్ట్‌లో మహిళల పాత్రను ఏ మాత్రం విస్మరించలేమని, మహిళా శక్తికి ఇది నిదర్శనంగా నిలిచిందని చెప్పారు.

చంద్రయాన్ 3 ల్యాండింగ్‌కు ఒక్కరోజు ముందు తాను ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్‌తో మాట్లాడినని అన్నారు రవిశంకర్. అన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయని, దేశ ప్రజల ప్రార్థనలన్నీ ఇస్రో వెంటే ఉంటాయని ఆయనకు సూచించానని పేర్కొన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను నిర్మించడానికి అయ్యే బడ్జెట్‌ కంటే తక్కువ ఖర్చుకే ఇస్రో.. చంద్రయాన్‌ ప్రాజెక్టును చేపట్టిందని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+