ప్రయాగ్‌రాజ్‌లో కుప్పకూలిన వాయుసేన విమానం! ( వీడియో)
Aircraft Crash: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలో బుధవారం పెను ప్రమాదం తప్పింది. భారత వాయుసేన(ఇండియన్ ఎయిర్‌ఫోర్స్)కు చెందిన ఓ శిక్షణ విమానం(ట్రైనీ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్) సాంకేతిక లోపంతో నగరం నడిబొడ్డున ఉన్న ఓ చెరువులో కుప్పకూలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే?
బుధవారం మధ్యాహ్నం వాయుసేన శిక్షణ విమానం తన సాధారణ శిక్షణలో భాగంగా ప్రయాగ్‌రాజ్ గగనతలంపై ఎగురుతోంది. కేపీ కాలేజీ వెనుక భాగంలో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా విమానం అదుపు తప్పి కింద ఉన్న చెరువులో పడిపోయింది. విమానం పడే సమయంలో పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు, కళాశాల విద్యార్థులు భయాందోళనతో అటువైపు పరుగులు తీశారు.

సాహసం చేసిన విద్యార్థులు: పైలట్ల రక్షణ
విమానం చెరువులోని బురదలో కూరుకుపోవడాన్ని గమనించిన స్థానిక విద్యార్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెరువులోకి దూకారు. చెరువులో చిక్కుకున్న ఇద్దరు పైలట్లను విద్యార్థులు, స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. "మేము కాలేజీ క్యాంపస్‌లో ఉన్నప్పుడు రాకెట్ లాంటి శబ్దం వినిపించింది. పరుగెత్తుకుంటూ వెళ్లి చూస్తే విమానం బురదలో పడి ఉంది. వెంటనే నీళ్లలోకి దూకి పైలట్లను రక్షించాం" అని ప్రత్యక్ష సాక్షి పదం సింగ్ తెలిపారు.
#WATCH | A trainee aircraft of the Indian Air Force crashes into a pond in Prayagraj, Uttar Pradesh
— ANI (@ANI) January 21, 2026
Details awaited. pic.twitter.com/jq5KyFW8Gc
సురక్షితంగా పైలట్లు.. ఊపిరి పీల్చుకున్న అధికారులు
ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరు పైలట్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వాయుసేన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చెరువులో పడిపోయిన విమానాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్‌లు ప్రయత్నిస్తున్నాయి.
దర్యాప్తుకు ఆదేశం
ఈ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గల కారణాలపై వాయుసేన విచారణకు ఆదేశించింది. ప్రాథమికంగా సాంకేతిక లోపం వల్లే విమానం అదుపు తప్పి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. జనసాంద్రత ఉన్న ప్రాంతంలో విమానం పడకుండా, చెరువులో పడటంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications