భారీగా లేఆఫ్స్ ప్రకటించిన IBM?

IBM Layoffs: టెక్ దిగ్గజం ఐబీఎం మాస్ లేఆఫ్స్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఇందులో అత్యధిక శాతం కంపెనీ మానవ వనరుల (HR) విభాగం నుంచే ఉండొచ్చు. ఈ విభాగంలో 200 ఉద్యోగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భర్తీ చేయడమే దీనికి కారణం.

ఏఐ- ఆధారిత ఆటోమేషన్ కారణంగా టెక్ కంపెనీల్లో పలు ఉద్యోగాలు క్రమంగా కనుమరుగవుతాయనడానికి ఇది తాజా ఉదాహరణగా చెబుతున్నారు. ఈ నెల ఆరంభంలో దాదాపుగా 200 హెచ్ ఆర్ పోస్టులను ఏఐ ఏజెంట్లతో భర్తీ చేసినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం హెచ్ ఆర్ విభాగం చేసే పనులను ఏఐ- బేస్డ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లు నిర్వహించగలవు.

IBM has layoffs around 8000 jobs Reports

వీటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత హెచ్ఆర్ విభాగంలో 8,000 మంది ఉద్యోగులను తొలగించడానికి ఐబీఎం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. తమ సంస్థలో కొన్ని ఎంటర్‌ప్రైజ్ ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, టీమ్ లను సమర్థవంతంగా లీడ్ చేయడానికి ఏఐ, ఆటోమేషన్‌లను అడాప్ట్ చేసుకోనున్నట్లు ఇటీవలే ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.

ఏఐ, ఆటోమేషన్‌లను అడాప్ట్ చేసుకోవడం వల్ల సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, సేల్స్ వంటి ఇతర విభాగాల్లో మానవ వనరులను ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం లభించినట్టయిందని అరవింద్ కృష్ణ వెల్లడించారు. పలితంగా ఐబీఎం మొత్తం ఉద్యోగుల సంఖ్య పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఐబీఎంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కడా తగ్గలేదని ఆ సంస్థ యాజమాన్యం పేర్కొంది. క్రియేటివిటీ, స్ట్రాటజిక్ థింకింగ్ అవసరం అయ్యే రంగాల్లో మానవ వనరులు తప్పనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. మార్కెటింగ్/ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటివి ఇప్పటికీ డిమాండ్‌లో ఉన్నాయని వివరించారు.

ఏఐ వల్ల బ్యాక్ ఆఫీస్ ఫంక్షనింగ్ లో కొనసాగుతున్న ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని లేఆఫ్స్ ట్రాకింగ్ వెబ్ సైట్ వెల్లడించింది. ఏఐ వినియోగం వల్ల ఉద్యోగులందరినీ తొలగించదలచుకోలేదని ఐబీఎం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ నికిల్ లామోరెక్స్ పేర్కొన్నారు. ఈ విభాగంలో ఉద్యోగాల పూర్తిగా ఎప్పట్లాగే కొనసాగుతుందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+