Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐసీఐసీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్: కష్టమర్లకు ఏటీఎం నుంచే రుణాలు!

దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ తన కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ముంబై: దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ తన కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక నుంచి ఏటీఎంలలో ఇన్‌స్టాంట్‌గా డబ్బులు తీసుకుంటున్నట్లుగానే.. తక్షణ లోన్లు కూడా ఇవ్వనుంది. ఏటీఎం ద్వారా రూ. 15లక్షల వరకు వ్యక్తిగత లోన్లు అందించేందుకు ఐసీఐసీఐ సిద్ధమైంది. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తించనుంది.

ఇందుకోసం కంపెనీల నుంచి ఉద్యోగుల సమాచారం తీసుకుని.. అందులో నుంచి వ్యక్తిగత లోన్ల కోసం కొందరు కస్టమర్లను ఎంపిక చేస్తుంది. ఈ వినియోగదారులు ఏటీఎం ద్వారా నగదు ట్రాన్సాక్షన్‌ చేసుకున్నప్పుడు స్క్రీన్‌పై లోన్‌ గురించి మెసేజ్‌ వస్తుంది. అప్పుడు కస్టమర్‌ దాన్ని సెలెక్ట్‌ చేసుకుంటే.. రూ. 15లక్షల వరకు లోన్‌ ఇవ్వనున్నట్లు ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ICICI Bank offers up to Rs 15 lakh instant personal loan via ATMs

ఐదేళ్ల గడువుతో ఈ లోన్‌ ఇస్తున్నట్లు పేర్కొంది. లోన్‌ ఎంత కావాలో సెలెక్ట్‌ చేసుకుంటే వెంటనే ఆ నగదు వినియోగదారుడి ఖాతాలోకి బదిలీ అవుతుంది. లోన్‌ ఎంత కావాలో ఏటీఎం స్క్రీన్‌పైనే సెలెక్ట్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజు, నెలవారీ వాయిదాలు తదితర వివరాలను కూడా స్క్రీన్‌పై కష్టమర్లు చూడవచ్చు.

60నెలల ఫిక్స్‌డ్ కాలవ్యవధిలో కష్టమర్లు రూ.15లక్షల వరకు వ్యక్తిగత రుణాలు పొందవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు స్పష్టం చేసింది. అవన్నీ నచ్చితే.. ఏటీఎంలలోనే లోన్‌ తీసుకోవచ్చు. ఐసీఐసీఐ నుంచి ఒక్కసారి కూడా లోన్‌ తీసుకోని వారికి సైతం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది. కస్టమర్లకు సులభంగా లోన్లు అందించేందుకే ఈ ఆఫర్‌ను తీసుకొస్తున్నట్లు బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనూప్‌ బాగ్చీ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+