ఇడా తుపాను బీభత్సం, నీట మునిగిన న్యూయార్క్, న్యూజెర్సీ

న్యూయార్క్‌లో వర్షం

అమెరికాలో ఆకస్మిక వరదలు, టోర్నడోల కారణంగా తొమ్మిది మంది మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇళ్లలోకి చేరిన వరద నీటిలో కొంతమంది చిక్కుకున్నారు. కొట్టుకుపోయిన వాహనంలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు.

న్యూయార్క్, న్యూజెర్సీ గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఇదొక వాతావరణ విపత్తు అని న్యూయార్క్ నగర మేయర్ బిల్ డే బ్లాసియో అన్నారు.


అమెరికాలో వరద

గంటలో 8 సెంటీమీటర్ల వర్షపాతం

న్యూయార్క్ సెంట్రల్ పార్కులో కేవలం ఒక గంట వ్యవధిలోనే 8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

న్యూయార్క్ సిటీ సబ్‌వే లైన్లన్నీ మూసివేశారు.

రహదారులపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

న్యూయార్క్, న్యూజెర్సీల్లో అనేక విమాన సర్వీసులను, రైళ్లను నిలిపివేశారు.

వరదల్లో కొట్టుకుపోయిన వాహనం నుంచి 70 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు న్యూజెర్సీలోని పాసైక్ నగర మేయర్ హెక్టర్ లోరా సీఎన్ఎన్‌కి చెప్పారు.

న్యూజెర్సీలో మరో వ్యక్తి మరణించినట్లు ఎన్‌బీసీ న్యూయార్క్ నివేదించింది. న్యూయార్క్ నగరంలో ఏడుగురు మరణించారని ఎన్‌బీసీ, ఏఎఫ్‌పీ పేర్కొన్నాయి. వీరిలో కొందరు ఇళ్ల బేస్‌మెంట్లలో చిక్కుకొని మృతిచెందినట్టు తెలిపాయి. మృతుల్లో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.

వరద నీటిలో చిక్కుకున్న సబ్ వే స్టేషన్లు, ఇళ్లు, నీట మునిగిన రహదారుల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి.

ఇడా తుపాను

రాత్రి భోజనం చేసే సమయంలో భారీ శబ్ధం విన్నాను. మా బాత్రూమ్‌లోని షవర్ డ్రెయిన్ నుంచి నీరు బయటకు వచ్చింది. నేను యుటిలిటీ రూమ్‌లోని ప్రధాన వాటర్ లైన్‌ని తనిఖీ చేయడానికి వెళ్లాను. తిరిగి గదిలోకి వచ్చే సమయానికి దాదాపు అడుగు మేర నీరు వచ్చి చేరింది. ఇది అంత వేగంగా ఎలా వచ్చిందో నమ్మశక్యం కాలేదు అని న్యూయార్క్ నివాసి జార్జ్ బెయిలీ బీబీసీతో చెప్పారు.

న్యూయార్క్ నగరం, బ్రూక్లిన్, క్వీన్స్, లాంగ్ ఐలాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోఅత్యవసర పరిస్థితిని ప్రకటించింది యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్. మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్‌లోని కొన్ని ప్రాంతాలకు టోర్నడో హెచ్చరికలు జారీ చేసింది.

ఇడా తుపాను

ఈ వారం ప్రారంభంలో దక్షిణ లూసియానాలో ఇడా తుపాను విధ్వంసం సృష్టించింది.

విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. లూసియానాలోని లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూఓర్లీన్స్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

ఇడా తుపాను ప్రభావం దేశానికి తూర్పు నుంచి ఉత్తరం వైపుకు కొనసాగుతోంది.

ఇడా తుపాను

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+