రాజకీయాల్లోకి సుమలత: కన్నడ VS తెలుగు, సీఎం కుమారస్వామి భార్య ఎవరు? ఫ్యాన్స్ ఫైర్!
బెంగళూరు: కన్నడ రెబల్ స్టార్, దివంగత అంబరీష్ భార్య, తెలుగింటి ఆడపడుచు సుమలత లోక్ సభ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో కన్నడ vs తెలుగు బాషల వివాదం తెరమీదకు వచ్చింది. ఆంధ్రపద్రేశ్ కు చెందిన సుమలత మండ్యలో ఎలా పోటీ చేస్తారు అని జేడీఎస్ నాయకుడు ప్రశ్రించారు. అయితే ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య, ఎమ్మెల్యే అనితా కుమారస్వామి తెలుగు వారు కాదా అంటూ అంబరీష్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

జేడీఎస్ ఎమ్మెల్సీ ఫైర్
రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత మండ్య ఆడబిడ్డ కాదని, ఆమె ఎలా అక్కడి నుంచి పోటీ చేస్తారని జేడీఎస్ ఎమ్మెల్సీ కేటీ. శ్రీకంఠేగౌడ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన సుమలత కర్ణాటకలో ఎలా పోటీ చేస్తారు, ఆమె కన్నడిగ కాదని జేడీఎస్ ఎమ్మెల్సీ కేటీ. శ్రీకంఠేగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రెబల్ స్టార్ ఫ్యాన్స్ వార్నింగ్
రెబల్ స్టార్ అంబరీష్ కోసం తాము ఎంతో సేవ చేశామని జేడీఎస్ ఎమ్మెల్సీ కేటీ. శ్రీకంఠేగౌడ అన్నారు. తన కుటుంబంలో తనతోనే రాజకీయ జీవితం ముగిసిపోతుందని అంబరీష్ చాలాసార్లు అన్నారని జేడీఎస్ ఎమ్మెల్సీ శ్రీకంఠే గౌడ అన్నారు. ఇలాంటి సమయంలో మండ్యతో ఎలాంటి సంబంధం లేని సుమలత ఎలా పోటీ చేస్తారు అని జేడీఎస్ ఎమ్మెల్సీ కేటీ. శ్రీకంఠేగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో అంబరీష్ అభిమానులు మండిపడుతున్నారు.

సీఎం భార్య ఎవరు ?
కర్ణాటక ముఖ్యంత్రి హెచ్.డి. కుమారస్వామి భార్య, రామనగర ఎమ్మెల్యే అనితా కుమారస్వామి ఎవరు అని అంబరీష్ అభిమానులు ప్రశ్నించారు. కొంత కాలం క్రితం తెలుగు టీవీ చానల్ ఇంటర్వూలో ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన కుమారుడు, హీరో నిఖిల్ గౌడ మాట్లాడిన వీడియోలను అంబరీష్ అభిమానులు తెర మీదకు తీసుకువచ్చారు.

తెలుగు సినిమా ఎందుకు ?
తెలుగు టీవీ చానల్ ఇంటర్వూలో మీ కుమారుడిని హిందీ సినిమాల్లో పరిచయం చెయ్యకుండా ఎందుకు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు అని టీవీ చానల్ ప్రతినిధి ప్రశించారు. (హీరో నిఖిల్ నటించిన జాగ్వార్ సినిమా విడుదల సమయంలో) కుమారస్వామి మాట్లాడుతూ కర్ణాటకకు తెలుగు బాషకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని అన్నారు. కర్ణాటకలోని అనేక జిల్లాల్తో తెలుగు బాష మాట్లాడుతారని అన్నారు.

సీఎం భార్య మాతృబాష తెలుగు
సుమలత విషయంలో జేడీఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం కుమారస్వామి స్పంధించారు. తన భార్య అనితా కుమారస్వామి మాతృ బాష తెలుగు అని అన్నారు. తమ కుటుంభానికి తెలుగు బాషకు చాల సంబంధం ఉందని సీఎం కుమారస్వామి చెప్పారు. మీ భార్య అనితా కుమారస్వామి తెలుగు వారు, ఆమె ఎమ్మెల్యే అయ్యారు, సుమలత మాత్రం ఎందుకు మండ్య నుంచి ఎన్నికల్లో పోటీ చెయ్యరాదు అని క్లారిటీ ఇవ్వాలని అంబరీష్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం కుమారస్వామిని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications