వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్పీ తీసుకొంటే అక్కడ ఫైన్ కట్టాల్సిందే

By Narsimha
|
Google Oneindia TeluguNews

తమిళనాడు :టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రజలకు సేవలు కూడ మరింత అందుబాటులోకి వచ్చాయి. సెల్ పోన్లలో రోజుకో రకమైన మార్పులు చేర్పులు వస్తున్నాయి. సెల్ ఫోన్లలో కెమెరాల ఆఫ్షన్ రావడం. వాటి నాణ్యత కూడ బాగా ఉండడంతో సెల్ ఫోన్ లోనే ఫోటోలు దిగే వారి సంఖ్య పెరిగిపోయింది. దానికి తోడు ఇటీవల సెల్పీల మోజు మరింత పెరిగింది. ఈ మోజు ఎంతవరకు వెళ్ళిదంటే సెల్పీల మోజులో పడి అనేకమంది తమ ప్రాణాలను కూడ పోగొట్టుకొన్నారు.

ఈ మద్య కాలంలో సెల్పీలను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేస్తున్నారు.అయితే ఈ సెల్పీ ల కారణంగా ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే భావనతో తమిళనాడులోని ఊటీ సరస్సులో సెల్పీ దిగితే జరిమానాను విధిస్తున్నారు. ఈ జరిమానా భయంతో సెల్పీలు దిగే సంఖ్య పడిపోయింది.

తమిళనాడులోని నీలగిరి జిల్లా ఊటీకి ప్రతి రోజూ వందలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ ఉన్న బొటానికల్ గార్డెన్, దొడబెట్ట, ముదుమలై ఊటీ బోట్ క్లబ్ లలో అధికంగా పర్యాటకులు సందర్శిస్తుంటారు.

If take a selfie pay fine

బోట్ క్లబ్ లో సందర్శించే సమయంలో ప్రతి ఒక్కరూ సెల్పీ తీసుకొనేందుకు ఇష్టపడుతుంటారు. సెల్పీల కోసం పడవలో అటూ ఇటూ తిరగడం వల్ల పడవలు మునిగిపోయే ప్రమాదం నెలకొంది. సెల్పీల కోసం ఆరాటపడుతూ సరస్సులో పడిన సందర్భాలు నెలకొన్నాయి.దీంతో పర్యాటకశాఖాధికారులు కొత్త నిబంధనను తీసుకు వచ్చారు. బోటింగ్ సమయంలో సెల్పీ దిగితే జరిమానా విధించాలని నిర్ణయించారు. దీన్ని అమలు చేస్తున్నారు.

మరో వైపు నీలగిరి అటవీ ప్రాంతంలో జంతువులను ఫోటో తీసిన ఏడుగురు పర్యాటకులను జరిమానా విధించారు అధికారులు.అడవి జంతువుల వద్ద కూడ సెల్పీలు దిగడాన్ని నిషెదించారు. గతంలో ఓ అడవి దున్న తో సెల్పీ దిగే సమయంలో ఓ మహిళపై దున్నదాడి చేసింది. దీంతో ఆమె మరణించింది.

English summary
If take a selfi pay fine at ooty, in tamilnadu state.every day hundreds of people come to site seeing .when travel a boat if take a selfie par fine implement government.taking selfies boat sink into water. and also banned selfies in neelagiri forest area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X