Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: పగలు ప్రియుడు, రాత్రి మొగుడు, రాత్రి భర్త కిడ్నాప్, అర్దరాత్రి ఏం చేశారంటే ?. భార్య డ్రామా !

బెంగళూరు/ జయనగర్: స్కూల్ లో చదువుకునే సమయంలో అమ్మాయికి, అబ్బాయికి పరిచయం అయ్యింది. 10వ తరగతి పూర్తి అయిన తరువాత ఇద్దరూ వేర్వేరు కాలేజ్ ల్లో చేరారు. చదువు మద్యలో నిలిపివేసిన యువకుడు వ్యాపారం చేస్తున్నాడు. యువతి చదువు కూడా అటకెక్కడంతో ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. భర్తతో కాపురం చేస్తున్న యువతి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత స్కూల్ ఫ్రెండ్ మళ్లీ ఆమెకు టచ్ లోకి వచ్చాడు. భర్తతో రాత్రి కాపురం చేస్తున్న భార్య పగలు ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసింది. సంవత్సరం పాటు భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్త కనిపెట్టలేకపోయాడు.

చివరికి భర్తకు అతని భార్య అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది. భార్య దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లాక్కొన్న భర్త ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేశాడు. పెళ్లి కాకుండా విరహంతో ఉన్న ప్రియుడు తన ప్రియురాలితో మాట్లాడకుండా ఆమె భర్త అడ్డుకుంటున్నాడని, ఆమెను కలుసుకోకుండా చేశాడని రగిలిపోయాడు. అంతే ప్రియురాలి భర్తను కిడ్నాప్ చేసిన ప్రియుడు అతని స్నేహితులు అతన్ని చంపేశారు. పిల్లలకు పాలు తీసుకురావడానికి బయటకు వెళ్లిన తన భర్త రోడ్డు పక్కన పడి చనిపోయాడని భార్య నాటకాలు ఆడింది.

 పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లి

పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లి

బెంగళూరు నగరంలోని చంద్రాలేఔట్ లోని బీసీసీ లేఔట్ లో జుహేబ్ అబ్బార్ అలియాస్ జుహేబ్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం షబ్రీన్ ఖనం అనే యువతిని జుహేబ్ వివాహం చేసుకున్నాడు. భర్త జుహేబ్ తో సంతోషంగా కాపురం చేస్తున్న షబ్రీన్ ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది.

 స్కూల్ ఫ్రెండ్ ఎంట్రీ

స్కూల్ ఫ్రెండ్ ఎంట్రీ

స్కూల్ లో చదువుకునే సమయంలో షబ్రీన్, నదీమ్ అహమ్మద్ అలియాస్ నదీమ్ (22) కు పరిచయం అయ్యింది. 10వ తరగతి పూర్తి అయిన తరువాత షబ్రీన్, నదీమ్ ఇద్దరూ వేర్వేరు కాలేజ్ ల్లో చేరారు. చదువు మద్యలో నిలిపివేసిన నదీమ్ ప్రస్తుతం ఇనుము వ్యాపారం చేస్తున్నాడు. షబ్రీన్ కూడా కాలేజ్ మద్యలో నిలిపివేసిన తరువాతే జుహేబ్ తో వివాహం అయ్యింది.

పగలు ప్రియుడు...... రాత్రి మొగుడు

పగలు ప్రియుడు...... రాత్రి మొగుడు

జుహేబ్ ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత షబ్రీన్ జీవితంలోకి స్కూల్ ఫ్రెండ్ నదీమ్ మళ్లీ టచ్ లోకి వచ్చాడు. కొంతకాలం ఇద్దరూ టచ్ లో ఉన్నారు. రానురాను నదీమ్, షబ్రీన్ చనువు పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నారు. భర్త జుహేబ్ తో రాత్రి కాపురం చేస్తున్న అతని భార్య షబ్రీన్ పగలు ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసింది.

 భర్తకు మ్యాటర్ తెలిసిపోయి ?

భర్తకు మ్యాటర్ తెలిసిపోయి ?

సంవత్సరం పాటు జుహేబ్ భార్య షబ్రీన్ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త కనిపెట్టలేకపోయాడు. చివరికి జుహేబ్ కు అతని భార్య షబ్రీన్, నదీమ్ ల అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది. భార్య షబ్రీన్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లాక్కొన్న ఆమె భర్త జుహేబ్ ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా, నదీమ్ ను కలవకుండా కట్టడి చేశాడు.

 పెళ్లి కాని ప్రియుడు విరహంతో రగిలిపోయాడు

పెళ్లి కాని ప్రియుడు విరహంతో రగిలిపోయాడు

పెళ్లి కాకుండా విరహంతో ఉన్న ప్రియుడు నదీమ్ తన ప్రియురాలు షబ్రీన్ తో మాట్లాడకుండా ఆమె భర్త జుహేబ్ అడ్డుకుంటున్నాడని, ఆమెను కలుసుకోకుండా చేశాడని రగిలిపోయాడు. అంతే స్నేహితులు తన్వీర్, మోహమ్మద్ ముబారక్, షబ్బీర్ హుస్సేన్, మొహమ్మద్ షఫీ, హనాన్ పాషా, తబ్రేజ్ పాషా తదితరులతో కలిసి ప్రియురాలు భర్త జుహేబ్ చంపేయాలని స్కెచ్ వేశారు.

 ప్రియురాలి భర్తను కిడ్నాప్ చేసి చంపేశారు

ప్రియురాలి భర్తను కిడ్నాప్ చేసి చంపేశారు

ఏప్రిల్ 30వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో జుహేబ్ ఇంటికి వెళ్లాడు. పిల్లలకు పాలు కావాలని అతని భార్య షబ్రీన్ చెప్పింది. బైక్ లో పిల్లలకు పాలు తీసుకురావడానికి వెళ్లిన జుహేబ్ ను నదీప్ అతని స్నేహితులు కలిసి అడ్డుకుని అతని మీద దాడి చేసి టాటా ఏస్ వాహనంలో కిడ్నాప్ చేసి అతని ముఖానికి, ముక్కుకు ప్లాస్టర్ వేసి చితకబాదేశారు.

 ప్రియురాలి భర్త శవాన్ని రోడ్డు పక్కన పడుకోబెట్టి ఎస్కేప్

ప్రియురాలి భర్త శవాన్ని రోడ్డు పక్కన పడుకోబెట్టి ఎస్కేప్

అర్దరాత్రి వరకు టాటా ఏస్ వాహనంలో పలు ప్రాంతాల్లో తిప్పారు. అప్పటికే జుహ్రేబ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. జుహేబ్ శవాన్ని గంగోడనహళ్లిలోని రోడ్డు పక్కన ఫుట్ ఫాత్ మీద పడుకోబెట్టి అక్కడి నుంచి జారుకున్నారు. పాలు తీసుకురావడానికి బయటకు వెళ్లిన తన భర్త జుహేబ్ మద్యం మత్తులో రోడ్డు పక్కన పడి చనిపోయాడని అతని భార్య షబ్రీన్ నాటకాలు ఆడింది. అయితే పోస్టుమార్టం నివేదికలో జుహేబ్ ను హత్య చేశారని వెలుగు చూసింది. కేసు విచారణ చేసిన పోలీసులు జుహేబ్ హత్య కేసులో అతని భార్య షబ్రీన్, ఆమె ప్రియుడు నదీమ్ తో పాటు 7 మందిని అరెస్టు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+