బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: వ్యాపారవేత్తను సినిమా స్టైల్లో చంపేసిన భార్య, కొడుకులు, కారులో బూడిద, థ్రిల్లర్ !

|
Google Oneindia TeluguNews

శివమొగ్గ/ బెంగళూరు: భార్యతో కాపురం చేస్తున్న వ్యాపారవేత్త ఇద్దరు కుమారులకు తండ్రి అయ్యాడు. ఇద్దరు కుమారులు కాలేజ్ లో చదువుతున్నారు. సొంతంగా ఫ్యాక్టరీ నడుపుతున్న భర్త బాగానే డబ్బులు సంపాధిస్తున్నాడు. ఫ్యాక్టరీ యజమాని ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్తను వదిలేసిన ఆమె వ్యాపారవేత్తను తగులుకుంది. చాలా సంవత్సరాల తరువాత వ్యాపారవేత్త, ఆంటీ అక్రమ సంబంధం విషయం అతని కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. భార్య, కుమారులను నిర్లక్షం చేస్తున్న వ్యాపారవేత్త, ఫ్యాక్టరీ యజమాని అతని ప్రియురాలి వ్యామోహంలో పడిపోయాడు. వ్యాపారవేత్త ఆస్తుల్లో తనకు వాటా కావాలని, తనకు ఆస్తుల్లో భాగం పెట్టాలని ఆంటీ ఎదురుతిరిగింది. ఆస్తుల్లో ప్రియురాలికి భాగం ఇవ్వడానికి వ్యాపారవేత్త సిద్దం అయ్యాడు. ఈ విషయం జీర్ణించుకోలేని వ్యాపారవేత్త భార్య, అతని ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు బంధువు కలిసి అతన్ని సినిమా టెక్నీక్స్ దారుణంగా చంపేసి శవం గుర్తులు కూడా చిక్కకుండా చేశారు. థ్రిల్లర్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా కుటుంబ సభ్యులే ఆ వ్యాపారవేత్తను హత్య చేశారని వెలుగు చూడటంతో మాజీ సీఎం సొంత జిల్లాలో కలకలం రేపింది.

Illegal affair: బస్సులో భార్యతో షికారుకు వెలుతున్న ప్రియుడు, నిలబెట్టి నరికేసిన మొగుడు !Illegal affair: బస్సులో భార్యతో షికారుకు వెలుతున్న ప్రియుడు, నిలబెట్టి నరికేసిన మొగుడు !

వ్యాపారవేత్త ఫ్యామిలీ

వ్యాపారవేత్త ఫ్యామిలీ

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా, సాగరతాలుకా, ఆచాపురలోని ముస్లీంపేట్ లో వినోద్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వినోద్ వినూత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వినోద్, వినూత దంపతులకు వివేక్, వినోద్ కుమార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి వినోద్ చాలా సంవత్సరాలు సంతోషంగా ఉండేవాడు.

ఆంటీతో వ్యాపారవేత్త అక్రమ సంబంధం

ఆంటీతో వ్యాపారవేత్త అక్రమ సంబంధం

వినోద్ ఇద్దరు కుమారులు కాలేజ్ లో చదువుతున్నారు. సొంతంగా ఫ్యాక్టరీ నడుపుతున్న వినోద్ బాగానే డబ్బులు సంపాధిస్తున్నాడు. వ్యాపారవేత్త వినోద్ ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్తను వదిలేసిన ఆమె వ్యాపారవేత్త వినోద్ తో ఫైల్ టైమ్ గా తగులుకుని అతన్ని పూర్తిగా దాసోహం చేసుకుందని సమాచారం.

ప్రియురాలి మీద వ్యామోహం

ప్రియురాలి మీద వ్యామోహం

చాలా సంవత్సరాల తరువాత వ్యాపారవేత్త వినోద్, ఆంటీ అక్రమ సంబంధం విషయం అతని భార్య వినూతతో పాటు అతని కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. భార్య వినూత, కుమారులను నిర్లక్షం చేస్తున్న వ్యాపారవేత్త వినోద్ అతని ప్రియురాలి వ్యామోహంలో పడిపోయాడు. కొంతకాలం వినోద్ ఇంటికి కూడా సక్రమంగా వెళ్లకుండా ఆంటీ ఇంటిలోనే ఉండిపోతున్నాడని తెలిసింది.

 ఆస్తుల్లో వాటా కావాలని డిమాండ్ చేసిన ఆంటీ

ఆస్తుల్లో వాటా కావాలని డిమాండ్ చేసిన ఆంటీ

వ్యాపారవేత్త వినోద్ ఆస్తుల్లో తనకు వాటా కావాలని, తనకు ఆస్తుల్లో భాగం పెట్టాలని ఆంటీ ఎదురుతిరిగింది. ఆస్తుల్లో ప్రియురాలికి భాగం ఇవ్వడానికి వ్యాపారవేత్త వినోద్ కూడా సిద్దం అయ్యాడు. ఈ విషయం జీర్ణించుకోలేని వ్యాపారవేత్త వినోద్ భార్య వినూత, అతని ఇద్దరు కుమారులు వివేక్, వినోద్ కుమార్ తదితరులు రగిలిపోయారు.

 పక్కాప్లాన్ తో ఫినిష్

పక్కాప్లాన్ తో ఫినిష్

వారం రోజుల క్రితం రాత్రి ఇంటికి వెళ్లిన వినోద్ భోజనం చేసి నిద్రపోయాడు. తరువాత వినోద్ ను చంపేయాలని అతని భార్య వినూతతో పాటు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. నిద్రపోతున్న వినోద్ ను కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. ఫినాయి, కెమికల్స్ ఉపయోగించి ఇంటిలో కింద టైల్స్ మీద పడిన రక్తం మొత్తం శుభ్రం చేశారు.

కారు నెంబర్ ష్లేట్ మార్చేశారు

కారు నెంబర్ ష్లేట్ మార్చేశారు

వినోద్ ఉపయోగించే కారును ఓ మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లి నకిలి నెంబర్ ఫ్లేట్ తగిలించారు. ఊరిబయట శివార్లలో ఉన్న పెట్రోల్ బంకులో రెండు క్యాన్లలో 10 లీటర్ల పెట్రల్ తీసుకున్నారు. రెండు రోజుల పాటు వినోద్ శవాన్ని ఇంటిలోనే పెట్టారు. రాత్రి 11 గంటల సమయంలో నకిలి నెంబర్ ప్లేట్ ఉన్న కారులో వినోద్ శవాన్ని వేసుకున్నారు.

డ్రైవర్ సీట్లో శవం పెట్టి కాల్చి బూడిద చేశారు

డ్రైవర్ సీట్లో శవం పెట్టి కాల్చి బూడిద చేశారు

కారును శివమొగ్గ జిల్లా తీర్థహళ్ళి తాలుకాలోని మిట్టగూడు అటవి ప్రాంతంలోకి కారు తీసుకెళ్లారు. డ్రైవర్ సీటులో విదోన్ శవాన్ని పెట్టి కారు మీద 10 లీటర్ల పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి బూడిద చేశారు. వినోద్ మొబైల్ ఫోన్ నదిలో విసిరేశారు. వినోద్ శవం పూర్తిగా కాలిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. మరుసటి రోజు ఆ ప్రాంతం గ్రామ పంచాయితీ అధ్యక్షుడు కారు పూర్తిగా కాలిపోయిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

 కారు నెంబర్ ప్లేట్ మాయం.... నకిలీ నెంబర్ ప్లేట్ తగిలించి

కారు నెంబర్ ప్లేట్ మాయం.... నకిలీ నెంబర్ ప్లేట్ తగిలించి

మొదట ఎవరో కారుకు మంటలు వ్యాపించి డ్రైవర్ సజీవదహనం అయ్యాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కారు నెంబర్ ఫ్లేట్ నకిలీ అని పోలీసులు గుర్తించారు. చివరికి కారు ఛాసీ నెంబర్ ఆధారంగా కారులో చనిపోయింది వినోద్ అని గుర్తించారు. ఇంత వరకు వినోద్ కనపడటం లేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వినోద్ ఇంటి అడ్రస్ తెలుసుకున్న తీర్థహళ్ళి పోలీసులు నేరుగా అతని ఇంటికి వెళ్లారు.

డ్రామాలు ఆడిన భార్య, కొడుకులు

డ్రామాలు ఆడిన భార్య, కొడుకులు

వ్యాపారవేత్త వినోద్ ఎక్కడ ? అని పోలీసులు ప్రశ్నించారు. వ్యాపారం పనిమీద వారం రోజుల క్రితం బయటకు వెళ్లాడని, తరువాత ఫోన్ కూడా చెయ్యలేదని వినోద్ భార్య వినూత పోలీసులకు చెప్పింది. తన తండ్రి వినోద్ బంధువుల ఆంటికి వెళ్లాడని అతని కొడుకులు పోలీసులకు చెప్పారు. తల్లీ కొడుకులు పొంతనలేకుండా సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది. వినోద్ భార్య వినూత, అతని కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

క్రిమినల్స్ కంటే తెలివిగా ఆలోచించిన భార్య, కొడుకులు

క్రిమినల్స్ కంటే తెలివిగా ఆలోచించిన భార్య, కొడుకులు

వినోద్ ను దారుణంగా చంపేసిన తరువాత అతని భార్య వినూత, ఇద్దరు కొడుకులు, మరో ఇద్దరు బంధువులు వారిని మొబైల్ ఫోన్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేశారు. వినోద్ కారుకు నకిలి నెంబర్ ప్లేట్ తగిలించిన తరువాత అటవి ప్రాంతానికి తీసుకెళ్లి కారు మీద పెట్రోల్ పోసి నిప్పంటించి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. శవం కాల్చి బూడిద చేసిన తరువాత వేరే కారులో ఇంటికి చేరుకున్న ఐదు మంది మూడు నాలుగు గంటల తరువాత వారి మొబైల్ ఫోన్లు ఆన్ చేశారని పోలీసులు అన్నారు.

మాజీ సీఎం సొంత జిల్లాలో హాట్ టాపిక్

మాజీ సీఎం సొంత జిల్లాలో హాట్ టాపిక్

పోలీసుల విచారణలో ఎలాంటి సాక్షాలు చిక్కకుండా, ఒకే టవర్ కింద మొబైల్ ఫోన్లు నెట్ వర్క్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు అడ్డంగా బుక్కైపోయారని శివమొగ్గ జిల్లా పోలీసులు అన్నారు. వినోద్ హత్య కేసులో అతని భార్య వినూతతో పాటు ఇద్దరు కొడుకులు, మరో ఇద్దరు బంధువులను పోలీసులు అరెస్టు చెయ్యడం మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సొంత జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Illegal affair: Businessman burn car with body in Karnataka, Victim wife and sons arrested in Shimoga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X