Illegal affair: పూజారి భజన బాలే చేశాడు, ప్రియుడిని చంపేసి గుడిలో పాతిపెట్టారు, మస్త్ మంజుల !

చెన్నై/ మదురై/ కడలూరు: భార్యను వదిలేసిన భర్త అద్దె ఇంటిలో వేరుగా కాపురం పెట్టాడు. ఇదే సమయంలో భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్న మహిళ అతనికి పరిచయం అయ్యింది. ఇద్దరు కలిసి కాపురం పెట్టారు. అదే సమయంలో ఆమె గుడిలో పూజారి బయట భజన బాగా చేస్తున్నాడని అతనితో లింక్ పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె ప్రియుడు మండిపడ్డారు. రోజు నిద్రలేసినప్పటి నుంచి ఇదే రామయణంతో ప్రియురాలు విసిగిపోయింది. పూజారితో కలిసి ప్రియుడిని హత్య చేసి గుడిలోని ఆవరణంలో మృతదేహాన్ని పాతిపెట్టేశారు. అయితే చేసిన పాపం ఊరికేపోదని పెద్దలు చెప్పిన సామెతలాగా ప్రియురాలు, ఆమె పూజారి ప్రియుడు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

 కన్నాదాసన్ కథ మామూలే

కన్నాదాసన్ కథ మామూలే

తమిళనాడులోని కడలూరు జిల్లా తిరువళ్లవర్ నగర్ లో నివాసం ఉంటున్న కన్నదాసన్ (35) అనే వ్యక్తికి గతంలో వివాహం అయ్యింది. అయితే నిత్యం భార్యతో కన్నదాసన్ కు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోయింది. భార్యను వదిలేసిన కన్నాదాసక్ వేరుగా అద్దె ఇంటిని తీసుకుని నివాసం ఉంటున్నాడు.

 మస్త్ మసాలా మంజుల

మస్త్ మసాలా మంజుల

కడలూరు జిల్లాలోని మణినగర్ ప్రాంతానికి చెందిన మంజుల (35) అనే మహిళకు గతంలో వివాహం అయ్యింది. అయితే మస్త్ మస్త్ జోరుమీద ఉన్న మంజుల భర్తను లెక్కచెయ్యకుండా ఆమె జోరుగా తనపని తాను చేసుకుంటూ వెళ్లేది. మంజుల రామాయణం, ఆమె చేష్టలు చూసి తట్టుకోలేక ఆమె భర్త ఇల్లు వాకిలితో పాటు ఏకంగా ఊరు వదిలి వెళ్లిపోయాడు.

 ఒకే ఇంట్లో కాపురం

ఒకే ఇంట్లో కాపురం

ఇలా భర్త వదిలేసిన మంజుల, భార్యను వదిలేసిన కన్నదాసన్ కు పరిచయం అయ్యింది. మంజుల, కన్నదాసన్ అక్రమ సంబంధం పెట్టుకుని లింగారెడ్డిపాళ్యంలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. అయితే ఇంత వరకు మంజుల, కన్నదాసన్ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇద్దరు కలిసి కాపురం మాత్రం చేస్తున్నారు. కన్నదాసన్ రేషన్ షాప్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

 భజన బాగా చేస్తున్న పూజారి

భజన బాగా చేస్తున్న పూజారి

లింగారెడ్డిపాళ్యలంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గోపినాథ్ పూజారిగా పని చేస్తున్నాడు. గుడిలో పూజలు చేస్తున్న గోపినాథ్ ఇంటిలో జోతిష్యం కూడా చెబుతున్నాడు. గుడిలో పూజారిగా పని చేస్తున్న జోతిష్యుడు గోపినాథ్ ఇంటిలో మంజుల ఇంటి పని చేస్తున్నది. ఇదే సమయంలో పూజారి గోపినాథ్, మంజులకు అక్రమ సంబంధం కలిగింది. మంజుల, పూజారి గోపీనాథ్ అక్రమ సంబంధం గురించి కన్నదాసన్ కు తెలియడంతో రోజు ఇంటిలో గొడవలు జరుగుతున్నాయి.

 సింపుల్ స్కెచ్ వేసిన పూజారి

సింపుల్ స్కెచ్ వేసిన పూజారి

ఇదే సమయంలో కన్నదాసన్ రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లి మంజులను చితకబాదుతున్నాడు. ప్రతిరోజు నా ప్రియుడు మద్యం సేవించి వచ్చి గొడవ చేస్తున్నాడని, అతనికి తగిని బుద్ది చెప్పాలని మంజుల పూజారి గోపినాథ్ కు చెప్పింది. ఇలాంటి వాళ్లకు మంచిమాటతో చెబితే వినరని, సింపుల్ గా చంపేద్దామని, తరువాత జీవితాంతం తనతో నువ్వు ఉండటానికి అవకాశం ఉంటుందని పూజారి గోపినాథ్ మంజులకు చెప్పాడు. ప్రియుడు కన్నదాసన్ ను చంపేయడానికి మంజుల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 మాయలాడి మంజుల సెల్ఫ్ గోల్

మాయలాడి మంజుల సెల్ఫ్ గోల్

ఈనెల 12వ తేదీన మంజుల పూజారి గోపినాథ్ ఇంటిలో ఉన్నదని తెలుసుకున్న ఆమె ప్రియుడు కన్నదాసన్ అక్కడికి వెళ్లాడు. తాను పనిపై బయటకు వెలుతున్నానని చెప్పి కన్నదాసన్ వెళ్లిపోయాడు. తరువాత కన్నదాసన్ ఎవ్వరికీ కనపడలేదు. మూడురోజు తరువాత మంజుల బన్రూట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన ప్రియుడు కన్నదాసన్ కనపడటం లేదని నాటకమాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చి ఆరా తీశారు. కన్నదాసన్ రెండు రోజుల నుంచి కనపడటంలేదని ఆమె ప్రియురాలు మంజుల ఎందుకు ఫిర్యాదు చేసింది ? అంటూ కూపీలాగారు.

గుడిలోనే శవం పాతిపెట్టేశారు

గుడిలోనే శవం పాతిపెట్టేశారు

కన్నదాసన్ ను హత్య చేసిన పూజారి గోపినాథ్, మంజుల శవాన్ని తీసుకెళ్లి శ్రీవేణుగోపాలస్వామి ఆలయం ప్రాంగణంలోనే పాతిపెట్టారని పోలీసులు గుర్తించారు. కన్నదాసన్ హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని మొదట పూజారి గోపీనాథ్, మంజుల పోలీసుల ముందు మాయమాటలు చెప్పారు. అయితే పోలీసులు బెండ్ తియ్యడంతో పూజారి గోపినాథ్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. కన్నదాసన్ శవాన్ని దేవాలయం ఆవరణంలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పూజారి గోపినాథ్, ప్రియురాలు మంజులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+