Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: హోటల్ రూమ్ లో భార్య, ప్రియుడిని చూసిన భర్త, రివాల్వర్ తో కాల్పులు, కట్ చేస్తే శవాలు!

కులు మనాలి/సిమ్లా7 న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న యువకుడు అతని భార్యతో జీవితాంతం సుఖంగా జీవించాలని అనుకున్నాడు. చిన్న వయసులోనే భర్త కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు. భార్యతో పాటు అతని చెల్లితో కూడా అతను వ్యాపారం చేయిస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా భర్త ఒకచోట, భార్య మరోచోట ఉంటున్నారు. కొంతకాలం క్రితం భార్య అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోందని భర్తకు తెలిసింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరిగాయి. వ్యాపారాలు చేస్తున్న దంపతులు మాత్రం వేర్వేరు ప్రాంతాల్లోనే ఉంటున్నారు.

వేకువ జామున భార్య, ఆమె ప్రియుడు ఉంటున్న హోటల్ లోకి భర్త వెళ్లాడు. హోటల్ రూమ్ లో భార్య, ఆమె ప్రియుడు ఉన్న తీరు చూసి రగిలిపోయిన భర్త రివాల్వర్ తీసుకుని ఇద్దరి మీద కాల్పులు జరిపాడు. భార్య ప్రియుడు స్పాట్ లో చనిపోయాడు. భార్య ప్రియుడిని చంపేసిన భర్త అదే రివాల్వర్ తో హోటల్ రూమ్ లోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త, ప్రియుడు ఒకేసారి చనిపోయినా కిలాడీ లేడీ మాత్రం ప్రాణాలతో బయటపడింది.

భార్యతో సంతోషంగా ఉండాలని అనుకున్న భర్త

భార్యతో సంతోషంగా ఉండాలని అనుకున్న భర్త

దేశ రాజధాని ఢిల్లీలో రిషబ్ సక్సేనా (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం రిషబ్ సక్సెనా రవ్లీన్ కౌర్ చావ్లా (30) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కౌర్ చావ్లాను వివాహం చేసుకున్న రిషబ్ అతని భార్యతో జీవితాంతం సుఖంగా జీవించాలని అనుకున్నాడు.

 వ్యాపారం చేస్తున్న దంపతులు

వ్యాపారం చేస్తున్న దంపతులు

చిన్న వయసులోనే రిషబ్ రూ. కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు. భార్య కౌర్ చావ్లాతో పాటు అతని చెల్లెలు అష్నీత్ కౌర్ (24)తో కలిసి కులు సమీపంలోని హిమాలయా హోటల్ ను లీజ్ కు తీసుకుని వారితో రిషబ్ వ్యాపారం చేయిస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా భర్త రిషబ్ ఢిల్లీలో, అతని భార్య కౌర్ చావ్లా కులులో ఉంటున్నారు.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

గత ఏడాది రిషబ్ భార్య కౌర్ చావ్లా సన్నీ షెరావత్ (31) అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. రెండు నెలల క్రితం కౌర్ చావ్లా, సన్నీల అక్రమ సంబంధం విషయం ఆమె భర్త రిషబ్ కు తెలిసింది. ఇదే విషయంలో రిషబ్, కౌర్ చావ్లా దంపతుల మద్య గొడవలు జరిగాయి. వ్యాపారాలు చేస్తున్న రిషబ్ ఒకచోట, అతని భార్య కౌర్ చావ్లా కులులో ఉంటున్నారు.

హోటల్ లోకి భర్త ఎంట్రీ

హోటల్ లోకి భర్త ఎంట్రీ

కులులోని హిమాలయా హోటల్ లోకి వేకువ జామున 4 గంటల సమయంలో రిషబ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో హోటల్ రూమ్ లో బెడ్ మీద భార్య కౌర్ చావ్లా, ఆమె ప్రియుడు సన్నీ ఉండే తీరు చూసి రిషబ్ రగిలిపోయాడు. ఆ సందర్బంలో హోటల్ రూమ్ లో రిషబ్, అతని భార్య కౌర్ చావ్లా, ఆమె ప్రియుడు సన్నీల మద్య వాగ్వివాదం జరిగింది.

భార్య ప్రియుడిని స్పాట్ లో చంపేసిన భర్త

భార్య ప్రియుడిని స్పాట్ లో చంపేసిన భర్త

భార్య కౌర్ చావ్లా, ఆమె ప్రియుడు సన్నీ తీరుతో రగిలిపోయిన ఆమె భర్త రిషబ్ రివాల్వర్ తీసుకుని ఇద్దరి మీద కాల్పులు జరిపాడు. భార్య కౌర్ చావ్లా ప్రియుడు సన్నీ హోటల్ రూమ్ లోనే స్పాట్ లో చనిపోయాడు. భార్య కౌర్ చావ్లా ప్రియుడిని చంపేసిన రిషబ్ అదే రివాల్వర్ తో హోటల్ రూమ్ లోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 కిలాడీ లేడీ బతికిపోయింది

కిలాడీ లేడీ బతికిపోయింది

భర్త రిషబ్, అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు సన్నీ ఒకేసారి స్పాట్ లో చనిపోయినా కిలాడీ లేడీ కౌర్ చావ్లా మాత్రం ప్రాణాలతో బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బుల్లెట్ గాయాలైన కౌర్ చావ్లాను కులులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

నా బాయ్ ఫ్రెండ్ ని నా భర్త చంపేశాడు

నా బాయ్ ఫ్రెండ్ ని నా భర్త చంపేశాడు

రిషబ్ హోటల్ లోకి వెళ్లి అతని భార్య కౌర్ చావ్లా ప్రియుడు సన్నీని రివాల్వర్ తో కాల్చి చంపేసి అతను కూడా రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. తన బాయ్ ఫ్రెండ్ సన్నీని తన భర్త రిషబ్ హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడని కౌర్ చావ్లా స్టేట్ మెంట్ ఇచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+