Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్త లారీ డ్రైవర్, భార్య ?, క్రికెట్ బ్యాట్ తో ఆడుకున్నాడు, కొబ్బరి కాయతో తల !

చెన్నై/ కోయంబత్తూరు: కుటుంబ సభ్యులు చూపించిన యువతిని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టారు. ముగ్గురు పిల్లలు పుట్టిన 15 ఏళ్ల తరువాత భర్తకు అతని భార్య మీద అనుమానం మొదలైయ్యింది. రానురాను దంపతుల మద్య ఇదే విషయంలో గొడవలు మొదలైనాయి. పెద్దలు రాజీ చేసినా ఫలితం లేకపోవడంతో దంపతులు విడిపోయారు. ముగ్గురు పిల్లలతో కలిసి భార్య వేరుగా నివాసం ఉంటున్నది. ఇంట్లో భార్య భోజనం చేస్తున్న సమయంలో భర్త ఆమె ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన భర్త క్రికెట్ బ్యాట్ తీసుకుని అతని భార్యను చితకబాదేశాడు. ఇంట్లో ఉన్న కొబ్బరి కాయ తీసుకుని భార్య తల మీద పగలగొట్టడంతో ఆమె పుర్రె చీలిపోయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

15 ఏళ్ల క్రితం పెళ్లి

15 ఏళ్ల క్రితం పెళ్లి

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా (నెలై జిల్లా)లోని బావి సమీపంలోని పాలవూరు తెప్పకులం వీధిలో సుడలపాండి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లారీ డ్రైవర్ గా పని చేస్తున్న సుడలపాండికి వివాహం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. సుడలపాండి నివాసం ఉంటున్న ఏరియాలోనే నివాసం ఉంటున్న జయలక్ష్మి అనే మహిళతో 15 ఏళ్ల క్రితం ఇద్దరి పెళ్లి జరిగింది.

 సొంత ఊర్లో భార్యకు అక్రమ సంబంధం

సొంత ఊర్లో భార్యకు అక్రమ సంబంధం

కొన్ని సంవత్సరాలు సుడలపాండి అతని భార్య జయలక్ష్మితో సంతోషంగా కాపురం చేశాడు. సుడలపాండి, జయలక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టారు. జయలక్ష్మి అదే ఊరిలో నివాసం ఉంటున్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునింది. ప్రియుడితో జయలక్ష్మి కాలం గడపడం మొదలు పెట్టిందని తెలిసింది.

భర్త ఇంటికి వస్తే భార్య సైలెంట్

భర్త ఇంటికి వస్తే భార్య సైలెంట్


భర్త సుడలపాండి లారీ డ్రైవర్ కావడంతో అతను బయటకు వెళ్లిపోయిన తరువాత అతని భార్య జయలక్ష్మి ఆమె ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. భర్త సుడలపాండి ఇంటికి వచ్చిన తరువాత జయలక్ష్మి ఆమె ప్రియుడికి దూరంగా ఉంటూ కొంతకాలం ఆమె భర్తకు మ్యాటర్ తెలీకుండా జాగ్రత్తపడిందని తెలిసింది.

 భర్తకు భార్య మ్యాటర్ తెలిసిపోయింది

భర్తకు భార్య మ్యాటర్ తెలిసిపోయింది

ముగ్గురు పిల్లలు పుట్టిన 15 ఏళ్ల తరువాత సుడలపాండికి అతని భార్య జయలక్ష్మి తీరుపై అనుమానం మొదలైయ్యింది. తరువాత నువ్వు ఊర్లో లేని సమయంలో నీ భార్య జయలక్ష్మి పలానా వ్యక్తితో తిరుగుతోందని సుడలపాండికి స్థానికులు కొందరు చెప్పడంతో అక్కడ గొడవలు మొదలైనాయి.

విడిపోయిన దంపతులు

విడిపోయిన దంపతులు

రానురాను సుడలపాండి, జయలక్ష్మి దంపతుల మద్య ఇదే విషయంలో గొడవలు మొదలైనాయి. పెద్దలు రాజీ చేసినా ఫలితం లేకపోవడంతో సుడలపాండి, జయలక్ష్మి దంపతులు విడిపోయారు. భర్త సుడలపాండితో విడిపోయిన జయలక్ష్మి ఆమె ముగ్గురు పిల్లలతో కలిసి పుట్టింటిలో వేరుగా నివాసం ఉంటున్నది.

భార్యను క్రికెట్ బ్యాట్ తో చితకబాది...... కొబ్బరి కాయతో కొట్టి

భార్యను క్రికెట్ బ్యాట్ తో చితకబాది...... కొబ్బరి కాయతో కొట్టి

జయలక్ష్మి ఆమె ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో ఆమె భర్త సుడపాండి ఆమె ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో సుడలపాండి, జయలక్ష్మిల మద్య మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన సుడలపాండి క్రికెట్ బ్యాట్ తీసుకుని అతని భార్య జయలక్ష్మిని చితకబాదేశాడు. ఇంట్లో ఉన్న కొబ్బరి కాయ తీసుకుని జయలక్ష్మి తల మీద పగలగొట్టడంతో ఆమె పుర్రె చీలిపోయింది.

Recommended Video

    తన ఇంటిపై దాడిన అడ్డుకున్న కార్యకర్తలపై అక్రమకేసులు ఎత్తేయాలన్న రేవంత్ రెడ్డి!!
    భార్య ప్రాణం తీసిన భర్త

    భార్య ప్రాణం తీసిన భర్త

    జయలక్ష్మి గట్టిగా కేకలు వెయ్యడంతో సుడలపాండి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో స్థానికులు అతన్ని పట్టుకున్నారు. జయలక్ష్మిని ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్య జయలక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకుందని రగిలిపోయిన సుడలపాండి క్రికెట్ బ్యాట్, కొబ్బరి కాయతో ఆమెను కొట్టి చంపేయడం కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+