Illegal affair: షాపు చూసుకోమని భర్తకు చెప్పిన ప్రియుడు, ఇంట్లో ఫ్రెండ్ భార్యతోనే ?, ఇద్దరూ ఫినిష్ !

డెహ్రాడూన్/లక్నో: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భర్త ఇంటికి దూరంగా ఉన్న ఏరియాలో సొంతంగా షాపు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. అదే ప్రాంతంలో వేరే షాపు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న యువకుడు భర్తకు పరిచయం అయ్యాడు. షాపు దగ్గర మాట్లాడుకుంటున్న ఇద్దరు షాపు ఓనర్లు తరువాత చాలా దగ్గర అయ్యారు. ఇంకా పెళ్లి కాని యువకుడు పక్కషాపు యజమాని ఇంటికి వెళ్లి రావడం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో స్నేహితుడి భార్యతో ఆ యువకుడికి పరిచయం అయ్యింది. తనకంటే వయసులో వయసులో చాలా సంవత్సరాలు పెద్దదైన మహిళతో ఆ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న భర్త ఆ ఏరియాలోనే ఇళ్లు ఖాళీ చేసి దూరంగా కాపురం పెట్టాడు. ప్రియుడు అక్కడికి వెళ్లి ఆమెతో అక్రమ సంబందం కొనసాగించాడు. ఇక లాభం లేదని తెలుసుకున్న భర్త అతని ప్రియురాలితో కలిసి కట్టుకున్న భార్యను, ఆమె ప్రియుడిని దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

 వ్యాపారం చేస్తున్న భర్త

వ్యాపారం చేస్తున్న భర్త

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీకి చెందిన 32 ఏళ్ల విక్రమ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు సహస్ పూర్ లో షాపు నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం విక్రమ్ స్వప్నా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న విక్రమ్, స్వప్నా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు.

 భర్త షాపు పక్కనే యువకుడి షాపు

భర్త షాపు పక్కనే యువకుడి షాపు

ఇంటికి దూరంగా ఉన్న ఏరియాలోనే విక్రమ్ సొంతంగా షాపు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. అదే ఏరియాలో 18 ఏళ్ల వయసు ఉన్న రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు సొంతంగా షాపు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఒకే ప్రాంతంలో వేర్వేరు షాపులు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న విక్రమ్, రాజేష్ కు పరిచయం అయ్యింది.

 నేరుగా ఇంటికి వెలుతున్న పెళ్లికాని కుర్రాడు

నేరుగా ఇంటికి వెలుతున్న పెళ్లికాని కుర్రాడు

షాపు దగ్గర మాట్లాడుకుంటున్న విక్రమ్, రాజేష్ ఇద్దరూ షాపు ఓనర్లు కావడంతో తరువాత చాలా దగ్గర అయ్యారు. ఇంకా పెళ్లి కాని రాజేష్ అప్పుడప్పుడు పక్కషాపు యజమాని విక్రమ్ ఇంటికి వెళ్లి రావడం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో స్నేహితుడు విక్రమ్ భార్య స్వప్నాతో పెళ్లి కాని రాజేష్ కు పరిచయం అయ్యింది.

స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం

స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం

రాజేష్ అతని స్నేహితుడు స్వప్నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తరువాత రానురాను విక్రమ్ భార్య స్వప్నాకు ఫోన్ చేస్తున్న రాజేష్ ఆమెతో పిచ్చపాటిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇలా రాజేష్, స్వప్నా దగ్గర అయ్యారు. తరువాత విక్రమ్ భార్య స్వప్నా, రాజేష్ అక్రమ సంబంధం పెట్టుకుని కాలం గడపడం మొదలు పెట్టారు.

 షాపు చూసుకోమని భర్తకు చెప్పి భార్యతో ఎంజాయ్

షాపు చూసుకోమని భర్తకు చెప్పి భార్యతో ఎంజాయ్

తన షాపు చూసుకోవాలని, వెంటనే పని ముగించుకుని వస్తానని విక్రమ్ కు చెబుతున్న రాజేష్ నేరుగా అతని ఇంటికి వెళ్లి అతని భార్య స్వప్నాతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. విక్రమ్ అతని స్నేహితుడు రాజేష్ షాపు చూసుకుని అక్కడే కాపలా ఉంటే అతను మాత్రం విక్రమ్ ఇంటికే వెళ్లి అతని భార్య స్వప్నాతో మస్త్ మజా చేసి అతని కోరికలు తీర్చుకుంటున్నాడు.

 భర్తకు తెలిసి ఏరియానే మార్చేశాడు

భర్తకు తెలిసి ఏరియానే మార్చేశాడు

ప్రతిసారి తనను షాపుకు కాపలా పెట్టి రాజేష్ ఎక్కడికి వెలుతున్నాడు అంటూ విక్రమ్ ఆరా తీశాడు. చివరికి తన భార్య స్వప్నాతో రాజేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని స్థానికులు చెప్పడంతో విక్రమ్ షాక్ అయ్యాడు. పద్దతి మార్చుకోవాలని భార్య స్వప్నాకు విక్రమ్ ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చాడు. అయినా భార్య స్వప్నా పద్దతి మార్చుకోకపోవడంతో విసిగిపోయిన విక్రమ్ ఆ ఏరియాలో ఇళ్లు ఖాళీ చేసి దూరంగా ఇంటిని తీసుకుని అక్కడికి కాపురం మార్చేశాడు.

 ఇల్లు మార్చినా భార్య ప్రియుడి పీడ వదల్లేదు

ఇల్లు మార్చినా భార్య ప్రియుడి పీడ వదల్లేదు

ఇల్లు మార్చినా ప్రియురాలు స్వప్నా మీద మోజు తగ్గకపోవడంతో రాజేష్ అక్కడికి కూడా వెళ్లి ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. కొత్తగా ఇంటిని మార్చిన విక్రమ్ ఆ ఏరియాలో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తాను ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి ఎవరెవరు వచ్చి వెలుతున్నారు అని చూడాలని విక్రమ్ అతని ప్రియురాలికి చెప్పాడు.

 పక్కాప్లాన్ తో భార్య, ప్రియుడిని చంపేసిన భర్త

పక్కాప్లాన్ తో భార్య, ప్రియుడిని చంపేసిన భర్త

తన భార్య స్వప్నా, ఆమె ప్రియుడు రాజేష్ కు ఎంత చెప్పినా వారు పద్దతి మార్చుకోలేదని, ఇలాగే వదిలేస్తే నా కొంప మునిగిపోతుందని విక్రమ్ అనుకున్నాడు. ప్రియురాలి సహాయంతో డిసెంబర్ 2వ తేదీన పక్కాప్లాన్ ప్రకారం భార్య స్వప్నా, ఆమె ప్రియుడు రాజేష్ ను చంపేసిన విక్రమ్ ఇద్దరి శవాలు తీసుకెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు.

 150 సీసీటీవీ కెమెరాల్లో ?

150 సీసీటీవీ కెమెరాల్లో ?

స్వప్నా కనపడకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సెలక్వీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్వప్నా నివాసం ఉంటున్న ఇంటి పరిసర ప్రాంతాల్లోని సుమారు 150 సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. స్వప్నా భర్త విక్రమ్ మొబైల్ ఫోప్ సీడీఆర్ ను పరిశీలించారు. అక్రమ సంబంధం కారణంగా స్వప్నాను ఆమె భర్త హత్య చేశాడని వెలుగు చూసింది. విక్రమ్ తో పాటు జంట హత్యలు చెయ్యడానికి సహకరించిన అతని ప్రియురాలిని అరెస్టు చేశామని స్థానిక సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+