Illegal affair: తల్లితో కలిసి మాజీ లవర్ ను లేపేసింది, మిడ్ నైట్ స్కెచ్, మ్యాటర్ భర్తకు తెలిస్తే !
నోయిడా/లక్నో: ఒకే ఊరిలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి ముందు నుంచి పరిచయం ఉంది. యువతి, యువకుడి పరిచయం ప్రేమకు దారితీసింది. పెళ్లికాకుండానే యువతి, యువకుడు శారీరక సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. మూడు నాలుగు సంవత్సరాలు ప్రియుడితో ఎంజాయ్ చేసిన ప్రియురాలు తరువాత ఆమె కుటుంబ సభ్యులు చూపించిన మరో యువకుడిని వివాహం చేసుకుని ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది. ఇంట్లో చూపించిన యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి వివాహం జరిగిన తరువాత అత్తారింటిలో ఉంటూ ఆమె ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుని చాలాకాలం ఎంజాయ్ చేసింది. కూతురు పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేస్తున్నా మాజీ ప్రియుడిని మరిచిపోకుండా అతనితో తిరుగుతోందని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. మా కూతురి విషయం అల్లుడికి తెలిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని, కూతుర్ని అల్లుడు వదిలేస్తే మొదటికే మోసం వస్తోందని ఆమె తల్లితో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇటీవల మహిళ భర్త ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లింది. తన మాజీ ప్రియురాలు వచ్చిందని ఆమెకు మాజీ ప్రియుడు ఫోన్ చేశాడు. మా ఇంట్లో ఎవ్వరూ లేరని, మనం ఏకాంతంగా కలుసుకుందామని, నువ్వు రావాలని ఆమె చెప్పింది. మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన మాజీ ప్రియుడు తరువాత అడ్రెస్ లేడు. యువకుడి కుటుంబ సభ్యులు ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి పెద్ద గొడవ చేశారు. గొడవలు పెద్దవి కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో ఆ యువకుడిని అతని మాజీ ప్రియురాలు, ఆమె తల్లి, ముగ్గురు సోదరులు కలిసి హత్య చేసి శవం మాయం చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. అక్రమ సంబందం కారణంగా ప్రియురాలు ఆమె తల్లి, సోదరులతో కలిసి మాజీ ప్రియుడిని హత్య చేశారని వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు.

ఒకేఊరిలో లవర్స్
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలోని సూరజ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబిన్ అనే యువకుడు, మోనీషా అనే యువతి నివాసం ఉంటున్నారు. ఒకే ఊరిలో నివాసం ఉంటున్న రాబిన్, మోనీషాకు ముందు నుంచి పరిచయం ఉంది. రాబిన్, మోనీషాల పరిచయం కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమకు దారితీసింది.

పెళ్లికాకుండానే మస్త్ మజా చేశారు
పెళ్లికాకుండానే రాబిన్, మోనీషా శారీరక సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. మూడు నాలుగు సంవత్సరాలు ప్రియుడి రాబిన్ తో ఎంజాయ్ చేసిన అతని ప్రియురాలు మోనీషా సినిమాలు, షికార్లు తిరిగింది. రాబిన్, మోనీషా పెళ్లి చేసుకుంటారని ఇద్దరి స్నేహితులు చాలా కాలం అనుకున్నారు. మోనీషాతో రాబిన్ అంత గాఢంగా తిరిగేశాడు.

ప్రియుడికి హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు
ప్రియుడు రాబిన్ తో మోజు తీర్చుకున్న తరువాత మోనీషా ఆమె కుటుంబ సభ్యులు చూపించిన మరో యువకుడిని వివాహం చేసుకుని ప్రియుడికి హ్యాండ్ ఇచ్చింది. ఇంట్లో చూపించిన యువకుడిని పెళ్లి చేసుకున్న మోనీషా వివాహం జరిగిన తరువాత అత్తారింటిలో ఉంటూ ఆమె ప్రియుడు రాబిన్ తో అక్రమ సంబంధం పెట్టుకుని చాలాకాలం ఎంజాయ్ చేసింది.

కూతురి గురించి తల్లికి ఆందోళన
కూతురు మనీషా పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేస్తున్నా మాజీ ప్రియుడు రాబిన్ ను మరిచిపోకుండా అతనితో తిరుగుతోందని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. మా కూతురు మోనీషా విషయం అల్లుడికి తెలిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని, కూతుర్ని అల్లుడు వదిలేస్తే మొదటికే మోసం వస్తోందని ఆమె తల్లి అంజూతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

మా ఇంట్లో ఎవ్వరూ లేరు వచ్చేయ్ అంటూ ప్రియుడికి ఫోన్
గత నెల 25వ తేదీన మోనీషా ఆమె భర్త ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లింది. తన మాజీ ప్రియురాలు మోనీషా వచ్చిందని ఆమెకు మాజీ ప్రియుడు రాబిన్ ఫోన్ చేసి మాట్లాడాడు. ఫిబ్రవరి 27వ తేదీ రాత్రి 10 గంటలకు మోనీషా ఆమె ప్రియుడు రాబిన్ కు ఫోన్ చేసింది. మా ఇంట్లో ఎవ్వరూ లేరని, మనం ఏకాంతంగా కలుసుకుందామని, నువ్వు రావాలని రాబిన్ కు అతని మాజీ ప్రియురాలు మోనీషా చెప్పింది. మాజీ ప్రియురాలు మోనీషా ఇంటికి వెళ్లిన ఆమె మాజీ ప్రియుడు రాబిన్ తరువాత అడ్రెస్ లేకుండాపోయాడు.

గొడవ చేసిన ప్రియుడి ఫ్యామిలీ
రాత్రి10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాబిన్ తరువాత అడ్రస్ లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు గాలించారు. ఎక్కడెక్కడ గాలించినా రాబిన్ ఆచూకి చిక్కలేదు. మాజీ ప్రియురాలు మోనీషా ఊరికి వచ్చిందని, ఆమె కుటుంబ సభ్యులు రాబిన్ ను ఏదైనా చేసి ఉంటారని అనుమానం వచ్చింది. రాబిన్ కుటుంబ సభ్యులు మోనీషా ఇంటి దగ్గరకు వెళ్లి పెద్ద గొడవ చేశారు.

రచ్చరచ్చ అయ్యింది
మోనీషా కుుటంబ సభ్యులు రాబిన్ కుటుంబ సభ్యుల మీద ఎదురుదాడికి దిగడంతో అక్కడ గొడవలు పెద్దవి అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రాబిన్ ను మోనీషా కుటుంబ సభ్యులు చంపేసి ఉంటారని అతని చిన్నాన పోలీసు కేసు పెట్టడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు.

తల్లీ, కూతురు కిలాడీ స్కెచ్
పోలీసులు మోనీషాను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారణ చేశారు. పోలీసుల విచారణలో మోనీషా మ్యాటర్ మొత్తం బయటకు చెప్పింది ఫిబ్రవరి 27వ తేదీ తాను, తన తల్లి అంజూ రాబిన్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నామని, తరువాత తనతో ఇక ముందు మాట్లాడకూడదని అతనికి నేను, మా అమ్మ, మా సోదరులు సాగర్, రవి సుభోద్ చెప్పామని, అందుకు అతను నిరాకరించడంతో గొడవ పెద్దది అయ్యింది, ఆ సమయంలో రాబిన్ ను గొంతు నులిమి చంపేశామని మోనీషా అంగీకరించింది.

ఫ్రెండ్ కారులో శవం మాయం చేసేశారు
రాబిన్ ను హత్య చేసిన తరువాత మా సోదరుల ఫ్రెండ్ మోనీష్ కు ఫోన్ చేసి అతని కారులో శవాన్ని తీసుకెళ్లి విసిరేశామని మోనీషా పోలీసులకు చెప్పింది. రాబిన్ హత్య కేసులో మాజీ ప్రియురాలు మోనీషా, ఆమె తల్లి అంజూ, మాజీ ప్రియురాలి సోదరులు రవి, సుభోద్, సాగర్ తో పాటు వీళ్ల స్నేహితులు మోనీష్ ను అరెస్టు చేశామని నోయిడా సెంట్రల్ డీసీపీ హరీష్ చందర్ మీడియాకు చెప్పారు. అక్రమ సంబందం కారణంగా ప్రియురాలు మోనీషా ఆమె తల్లి అంజూ, సోదరులతో కలిసి మాజీ ప్రియుడు రాబిన్ ను హత్య చేశారని వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications