Illegal affair: భర్త లేనిలోటు, కుర్రాడు ఎంట్రీ, అంతా ఓకే అనుకుంటే ?, సీక్రెట్ గా ఫినిష్ !
చెన్నై: దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. అనారోగ్యానికి గురైన భర్త చాలా కాలం ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఆరోగ్యం తిరగబడటంతో భర్త మరణించాడు. ఇద్దరు పిల్లలతో కలిసి భార్య జీవితం ప్రారంభించింది. అనుకోకుండా తనకంటే తక్కువ వయసు ఉన్న యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకునింది. తల్లి అక్రమ సంబంధం విషయం తెలిసినా ఆమె కొడుకులు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. అయితే సీక్రెట్ సాగిపోతున్న అక్రమ సంబంధం విషయంలో ఆమె ప్రియుడిని గుడ్డిగా నమ్మింది. ఎంతో నమ్మిన ప్రియుడి చేతిలో ఆమె హత్యకు గురి కావడం కలకలం రేపింది.

హ్యాపీ లైఫ్
తమిళనాడులోని కల్లకురిచ్చి సమీపంలోని కచ్చిరాయపాళయంలోని అమ్మాపేట్ గ్రామంలో మనోహరన్ (45), సంగీత (39) దంపతులు నివాసం ఉంటున్నారు. మనోహరన్, సంగీత దంపతులకు సురేష్, గోకుల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మనోహరన్, సంగీత దంపతులు ఇద్దరు కొడుకులతో కలిసి చాలా సంతోషంగా జీవించేవాళ్లు.

భర్త దెబ్బతో ఫ్యామిలీలో సమస్యలు
కొన్ని సంవత్సరాల క్రితం మనోహర్ అనారోగ్యానికి గురైనాడు. అర్థిక సమస్యలతో మనోహరన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స చేసుకుని మందులు వాడుతున్నా మనోహరన్ ఆరోగ్యం కుదటపడలేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఆరోగ్యం తిరగపడటంతో మనోహరన్ మరణించాడు. మనోహరన్ చనిపోవడంతో అతని ఫ్యామిలీలో సమస్యలు మొదలైనాయి.

భార్యకు బాయ్ ఫ్రెండ్
భర్త మనోహరన్ చనిపోయిన తరువాత సంగీత ఆమె ఇద్దరు కొడుకులు గోకుల్, సురేష్ తో కలిసి వేరుగా నివాసం ఉంటున్నది. కూలి పనులు చేసుకుంటున్న సంగీత ఇద్దరు కొడుకులను పెంచిపోషిస్తోంది. తనకంటే వయసులో తక్కువ వయసు ఉన్న అత్తియూర్ నివాసి రాజేష్ కార్తీతో సంగీతకు పరిచయం అయ్యింది. సంగీత, కార్తీ కలిసి తిరగడం మొదలుపెట్టారు.

తల్లి అక్రమ సంబంధం కొడుకులకు తెలిసింది
సంగీతతో చనువుగా తిరుగుతున్న కార్తీ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్త చనిపోవడంతో అతను లేనిలోటును సంగీత ఆమె ప్రియుడు కార్తీతో తీర్చుకునింది. తన తల్లి సంగీతకు అక్రమ సంబంధం ఉందని తెలిసినా నిస్సహాయస్థితిలో ఆమె కొడుకులు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. ఇదే సమయంలో సంగీత ఆమె ప్రియుడు కార్తీతో విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టింది.
Recommended Video

సంగీతను చంపేసి పరారైన ప్రియుడు
రాత్రి సంగీత, ఆమె ప్రియుడు గొడవపడ్డారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన కార్తీ కత్తి తీసుకుని ప్రియురాలు సంగీత మీద దాడి చేసి చంపేశాడు. సంగీత శవాన్ని బలరామ్ పట్టు బస్ స్టాండ్ సమీపంలోని ఘట్టపారై రోడ్డు సమీపంలో విసిరేసి పరారైనాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంగీతకు కార్తీ అనే యువకుడితో అక్రమ సంబంధం ఉందని, అతనే ఆమెను హత్య చేసి ఉంటాడని, కేసు విచారణలో ఉందని డీఎస్పీ రామనాథ్ స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications