Illegal affair: అందంగా రెడీ అవుతున్న భార్య, క్యాబ్ లో బయటకు తిరుగుతున్న భర్త, మూడు రోజులకు !
బెంగళూరు: పెళ్లి చేసుకున్న దంపతులు కొంతకాలం క్రితం వరకు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. భార్య ఉద్యోగం చేస్తుంటే భర్త సొంతంగా కారు తీసుకుని క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. భర్త ఒక్కోసారి రెండు మూడు రోజులు బయట తిరుగుతుంటాడు. భార్య ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వెలుతోంది. మూడు రోజుల క్రితం ఆమె ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లింది. మూడు రోజుల నుంచి ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు. మహిళ, ఆమె భర్త ఊరికి వెళ్లి ఉంటారని చుట్టుపక్కల వాళ్లు అనుకున్నారు. మహిళ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్కింటి వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా ఆమె శవమై కనిపించింది. మూడు రోజుల క్రితమే ఆమె హత్యకు గురికావడంతో శవం దుర్వాసన వస్తోందని పోలీసులు అంటున్నారు, మహిళ భర్త కూడా మూడు రోజుల నుంచి కనపడటం లేదని, అతని మొబల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని పోలీసులు అన్నారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని చాలా కాలం నుంచి ఆమె భర్త గొడవ చేస్తున్నాడని, అదే విషయంలో ఆమెను చంపేసిన భర్త మాయం అయ్యాడని పోలీసులు అంటున్నారు.

ఉద్యోగం చేస్తున్న భార్యా
బెంగళూరు నగరంలోని కామాక్షిపాళ్యలోని కావేరిపురంలో వనజాక్షి (34), బాబు దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లి చేసుకున్న బాబు, వనజాక్షి దంపతులు కొంతకాలం క్రితం వరకు సంతోషంగా కాపురం చేశారు. బాబు, వనజాక్షి దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. వనజాక్షి కామాక్షిపాళ్యలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తుంటే ఆమె భర్త బాబు సొంతంగా కారు తీసుకుని క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

భార్య మీద భర్తకు ఫుల్ డౌట్
వనజాక్షి ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వెలుతోంది. వనజాక్షి భర్త బాబు ఒక్కోసారి క్యాబ్ తీసుకుని బయటకు వెళితే రెండు మూడు రోజులు బయట తిరిగి తరువాత ఇంటికి వెలుతుంటాడు. క్యాబ్ డ్రైవర్ గా ఎక్కువ బయట తిరుగుతున్న బాబుకు అతని భార్య వనజాక్షి మీద అనుమానం ఉందని తెలిసింది.

భార్యకు ప్రియుడు ఉన్నాడని ?
ఇదే సమయంలో ఉద్యోగం చెయ్యడానికి ప్రతిరోజు శుభ్రంగా తయారై వెలుతున్న వనజాక్షి మీద ఆమె భర్త బాబుకు ఇంకా డౌట్ వచ్చేసింది. తన భార్య వనజాక్షికి ప్రియుడు ఉన్నాడని, అందుకే ప్రతిరోజు సింగారించుకుని వెలుతోందని అనుకున్న బాబు ఆమె మీద కొంతకాంగా నిఘా వేశాడని సమాచారం.

ఇంట్లో నుంచి ఆమె బయటకు రాలేదని ?
మూడు రోజుల క్రితం వనజాక్షి ఉద్యోగానికి వెళ్లి అదే రోజు సాయంత్రం తిరిగి కావేరిపురలోని ఆమె ఇంటికి వెళ్లింది. మూడు రోజుల నుంచి వనజాక్షి ఇంటి నుంచి బయటకు రాలేదు. వనజాక్షి, ఆమె భర్త బాబు ఊరికి వెళ్లి ఉంటారని చుట్టుపక్కల వాళ్లు అనుకున్నారు. వనజాక్షి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్కింటి వాళ్లకు అనుమానం వచ్చి కామాక్షిపాళ్య పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మూడు రోజుల క్రితమే హత్య
కామాక్షిపాళ్య పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా వనజాక్షి ఇంట్లో బెడ్ మీద శవమై కనిపించింది. మూడు రోజుల క్రితమే వనజాక్షి హత్యకు గురికావడంతో ఆమె ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని కామాక్షిపాళ్య పోలీసులు అంటున్నారు, వనజాక్షి భర్త బాబు కూడా మూడు రోజుల నుంచి కనపడటం లేదని, అతని మొబల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని పోలీసులు అన్నారు. భార్య వనజాక్షి అక్రమ సంబంధం పెట్టుకుందని చాలా కాలం నుంచి ఆమె భర్త బాబు గొడవలు చేస్తున్నాడని, అదే విషయంలో ఆమెను చంపేసి అతను మాయం అయి ఉంటాడని కామాక్షిపాళ్య పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications