Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: కోటీశ్వరుడి భార్య, ప్రియుడితో బిజినెస్ మ్యాన్ భార్య జంప్, రెండు నెలలు, క్లైమాక్స్ లో !

చెన్నై/ కన్యాకుమారి/కొచ్చి: వ్యాపారం చేస్తున్న కోటీశ్వరుడికి ఓ యువతికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. జిల్లాలోనే ఫోర్ వీలర్ డీలర్ గా భర్తకు మంచి పేరు ఉంది. ఫోర్ వీలర్ వాహనాల వ్యాపారం చేస్తున్న భర్త లక్షలు లక్షలు డబ్బులు సంపాధిస్తున్నారు. వ్యాపారి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారం చేస్తూ భర్త చాలా బిజీబిజీగా ఉంటున్నాడు. ఇంట్లో ఇద్దరు పిల్లలను చూసుకుంటున్న వ్యాపారి భార్యకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యాపారి భార్య కళ్లు మూసుకుపోయి అతనితో ఎంజాయ్ చేసింది. ప్రియుడి వ్యామోహంలో పడిపోయిన భార్య ఇంట్లో ఉన్న లక్షల రూపాయల నగదుతో పాటు 80 పౌండ్ల బంగారం, భర్త విలాసవంతమైన కారుతో సహ బిడ్డను ఎత్తుకుని ప్రియుడితో పరారైయ్యింది. నా భార్య, బిడ్డ కనపడటం లేదని భర్త పోలీసులను ఆశ్రయించాడు. నీ భార్య లేచిపోతే మేము ఎందుకు కష్టపడాలి, మేము ఏమి చెయ్యాలి అంటూ పోలీసులు నిర్లక్షం చేశారు. భర్త హైకోర్టను ఆశ్రయించాడు. సుమారు రెండు నెలలు పోలీసులు, భర్తకు చిక్కకుండా అతని భార్య ప్రియుడితో ఎంజాయ్ చూస్తూ కాలం గడిపేసింది. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో పోలీసులు వ్యాపారి భార్య, ఆమె ప్రియుడిని పట్టుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. అందరి ముందు భార్య చెప్పిన మాటలకు అతని భర్తతో పాటు పోలీసులు షాక్ అయ్యారు.

 ఫేమస్ ఫోర్ వీలర్ డీలర్

ఫేమస్ ఫోర్ వీలర్ డీలర్

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని మార్తాండంలో మోహన్ రాజ్ (41) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కన్యాకుమారి జిల్లాలోనే మోహన్ రాజ్ ఫేమస్ ఫోర్ వీలర్ వాహనాల డీలర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. వాహనాల వ్యాపారం చేస్తున్న మోహన్ రాజ్ కు కొన్ని సంవత్సరాల క్రితం సోనియా గాంధీ అలియాస్ సోనియా (35) అనే యువతితో గ్రాండ్ గా వివాహం జరిగింది.

విపరీతంగా డబ్బులు సంపాధిస్తున్న భర్త

విపరీతంగా డబ్బులు సంపాధిస్తున్న భర్త

ఫోర్ వీలర్ వాహనాల వ్యాపారం చేస్తున్న మోహన్ రాజ్ లక్షలు లక్షలు డబ్బులు సంపాధిస్తున్నాడు. వ్యాపారి మోహన్ రాజ్, సోనియా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారం చేస్తూ మోహన్ రాజ్ చాలా బిజీబిజీగా ఉంటున్నాడు. వ్యాపారం పనిమీద మోహన్ రాజ్ ఎక్కువగా బయటతిరుగుతున్నాడు.

భార్యకు అక్రమ సంబంధం

భార్యకు అక్రమ సంబంధం

ఇంట్లో ఇద్దరు పిల్లలను చూసుకుంటున్న వ్యాపారి మోహన్ రాజ్ భార్య సోనియాకు సెల్వరాజ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. సెల్వరాజ్, సోనియా పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. సెల్వరాజ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యాపారి మోహన్ రాజ్ భార్య సోనియా కళ్లు మూసుకుపోయి అతనితో ఆమె ఇంటిలోనే ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది.

భారీ మొత్తంలో నగలు, నగదుతో ఎస్కేప్

భారీ మొత్తంలో నగలు, నగదుతో ఎస్కేప్

ప్రియుడు సెల్వరాజ్ వ్యామోహంలో పడిపోయిన సోనియా అతనితో లేచిపోయి ఎంజాయ్ చెయ్యాలని డిసైడ్ అయ్యింది. ఆగస్టు 19వ తేదీన భర్త మోహన్ రాజ్ బయటకు వెళ్లాడు. తరువాత అదే రోజు మోహన్ రాజ్ భార్య సోనియా ఇంట్లో ఉన్న లక్షల రూపాయల నగదుతో పాటు 80 పౌండ్ల బంగారం, భర్త విలాసవంతమైన కారుతో సహ బిడ్డను ఎత్తుకుని ప్రియుడితో పరారైయ్యింది.

బిత్తరపోయిన భర్త

బిత్తరపోయిన భర్త

రాత్రి ఇంటికి వెళ్లిన మోహన్ రాజ్ అతని రెండో బిడ్డతో పాటు భార్య సోనియా కనపడకపోవడంతో ఆందోళన చెందాడు. ఇంట్లో ఉన్న భారీ మొత్తంలో నగదు, నగలు కూడా కనపడకపోవడంతో మోహన్ రాజ్ హడలిపోయాడు. ఇంటి ముందు ఉన్న కారు కనపడకపోవడంతో మోహన్ రాజ్ ఆందోళన చెంది నా భార్య సోనియా, నా బిడ్డ కనపడటం లేదని మార్తాండం పోలీసులను ఆశ్రయించాడు.

 కేసు పెట్టిన భార్య..... కేరళలో భార్య

కేసు పెట్టిన భార్య..... కేరళలో భార్య

పోలీసులు సోనియా మొబైల్ నెంబర్ ట్రేస్ చేశారు. సోనియా ఓ యువకుడితో కలిసి కేరళలోని లాడ్జ్ లో ఉందని మార్తాండం పోలీసులు తెలుసుకున్నారు. పోలీసులు కేరళ వెళ్లే సమయానాకి సోనియా, ఆమె ప్రియుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. తరువాత తమిళనాడు పోలీసులు సోనియా కనపడటం లేదని మోహన్ రాజ్ కు చేతులు ఎత్తేశారు.

హైకోర్టు ఆదేశాలతో హడల్

హైకోర్టు ఆదేశాలతో హడల్

నా భార్య సోనియా, నా బిడ్డ ఆచూకి తెలుసుకోవాలని మోహన్ రాజ్ పోలీసుల చుట్టూ తిరిగాడు. నీ భార్య లేచిపోతే మేము ఎందుకు కష్టపడాలి, మేము ఏమి చెయ్యాలి అంటూ పోలీసులు నిర్లక్షం చేశారు. మోహన్ రాజ్ చివరికి తన భార్య, బిడ్డ కనపడటం లేదని మదురై హైకోర్టు బెంచ్ లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. 30 రోజుల్లో మోహన్ రాజ్ భార్య, అతని బిడ్డను కోర్టులో హాజరుపరచాలని మదురై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీలో ప్రియుడితో మకాం వేసిన భార్య

ఢిల్లీలో ప్రియుడితో మకాం వేసిన భార్య

కోర్టు ఆదేశాలతో పోలీసులు సోనియా కోసం ముమ్మరంగా గాలించారు. సోనియా ఆమె ప్రియుడు ఢిల్లీలో ఉన్నారని పోలీసులకు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీ వెళ్లిన కన్యాకుమారి పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో సోనియా, ఆమె ప్రియుడిని, బిడ్డను పట్టుకుని తమిళనాడు తీసుకు వచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు,

కారు, నగలు, నగదు సీజ్

కారు, నగలు, నగదు సీజ్

సోనియాను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలోనే ఆమె దగ్గర ఉన్న 45 పౌండ్ల బంగారు నగలు, విలాసవంతమైన కారుతో పాటు నగదు సీజ్ చేసి కోర్టు ముందు సమర్పించారు. మోహన్ రాజ్, అతని పెద్ద కొడుకు కోర్టు ముందు హాజరైనారు. ఆ సమయంలో నేను నా భర్త మోహన్ రాజ్ తో కలిసి జీవించలేనని, నేను నా ప్రియుడితో ఉంటానని సోనియా చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

భార్యను వేడుకున్న భర్త..... నోచెప్పిన భార్య

భార్యను వేడుకున్న భర్త..... నోచెప్పిన భార్య


తనతో కలిసి జీవించాలని మోహన్ రాజ్ అతని భార్య సోనియాను వేడుకున్నాడు. నేను నా ప్రియుడితోనే ఉంటానని సోనియా పట్టుబట్టింది. పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం మీద వ్యాపారం చేస్తున్న భర్తకు హ్యాండ్ ఇచ్చి ప్రియుడితో చెక్కేసిన అతని భార్య సుమారు రెండు నెలల తరువాత పోలీసులకు చిక్కడం కన్యాకుమారిలో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+