చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: భర్తకు విడాకులు, ప్రియుడితో రొమాన్స్, ఏడాది బిడ్డ అడ్డుగా ఉన్నాడని, హాలీవుడ్ స్టైల్లో హత్య !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ఊటి/కోయంబత్తూరు: పెద్దలు సెట్ చేసిన వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతుల కాపురం నిలబడలేదు. విడాకులు తీసుకున్న దంపతులు కొడుకులను కూడా పంచుకున్నారు. ఒక కొడుకు తల్లి దగ్గర, ఇంకో కొడుకు తండ్రి దగ్గర ఉంటున్నారు. విడిపోయిన దంపతులు ఎవరిపాటికి వాళ్లు జీవిస్తున్నారు. భార్య గురించి ఏమాత్రం పట్టించుకోని భర్త అతనిపాటికి అతను జీవిస్తున్నాడు.

తల్లి ఆమె దగ్గర ఉన్న కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లింది. నా కొడుకు ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడని ఆమె వైద్యులకు చెప్పింది. అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులు చెప్పారు. బాలుడి శరీరం మీద ఎలాంటి చిన్న గాయం కూడా లేకపోవడంతో పోలీసులు అయోమయంలో పడిపోయారు. పోస్టుమార్టం నివేదికలో విష ప్రయోగం జరగలేదని వెలుగు చూసింది. అయితే పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. తల్లికి నలుగురితో అక్రమ సంబంధం ఉందని, బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారని వెలుగు చూసింది. తన జల్సాలకు కొడుకు అడ్డుగా ఉన్నాడని రగిలిపోయిన తల్లి పక్కాప్లాన్ తో హాలీవుడ్ స్టైల్లో బిడ్డను హత్య చేసిందని గుర్తించిన పోలీసులు హడలిపోయారు.

Lady teacher: అబ్బాయిని లేపుకుపోయి గుడిలో పెళ్లి, ఎంఫీల్ మేడమ్ కు జైల్లో చిప్పకూడు, కన్నింగ్ లేడి !Lady teacher: అబ్బాయిని లేపుకుపోయి గుడిలో పెళ్లి, ఎంఫీల్ మేడమ్ కు జైల్లో చిప్పకూడు, కన్నింగ్ లేడి !

 ఇద్దరు పిల్లలు పుట్టే వరకు హ్యాపి

ఇద్దరు పిల్లలు పుట్టే వరకు హ్యాపి

తమిళనాడులోని ఊటీలోని వాషర్ మెన్ పేట్ లో కార్తీక్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పెద్దలు సెట్ చేసిన గీతా (38) అనే మహిళను కార్తీక్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కార్తీక్, గీతా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. కార్తీక్, గీతా దంపతులకు నితీష్, నితిన్ ( 1 సంవత్సరం ) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టే వరకు గీతా, కార్తీక్ దంపతులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిసింది.

 విడాకులు తీసుకుని కొడుకులను పంచుకున్నారు

విడాకులు తీసుకుని కొడుకులను పంచుకున్నారు

ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కార్తీక్, గీతా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా గీతా, కార్తీక్ దంపతుల కాపురం నిలబడలేదు. విడాకులు తీసుకున్న కార్తీక్, గీతా దంపతులు కొడుకులను కూడా పంచుకున్నారు. నితిన్ అతని తల్లి గీతా దగ్గర, ఇంకో కొడుకు నితీష్ అతని తండ్రి కార్తీక్ దగ్గర ఉంటున్నారు.

 ఎవరి బతుకులు వాళ్లవి అని డిసైడ్ అయ్యారు

ఎవరి బతుకులు వాళ్లవి అని డిసైడ్ అయ్యారు

కొడుకు నితీష్ తో కలిసి కోయంబత్తూరు వెళ్లిపోయిన కార్తీక్ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఊటిలోని వాషర్ మెన్ పేట్ లోనే నివాసం ఉంటున్న గీతా ఆమె కొడుకు నితిన్ తో కలిసి ఉంటోంది. విడిపోయిన కార్తీక్, గీతా దంపతులు ఎవరిపాటికి వాళ్లు జీవిస్తున్నారు. భార్య గీతా గురించి ఏమాత్రం పట్టించుకోని ఆమె మాజీ భర్త కార్తీక్ కోయంబత్తూరులో అతనిపాటికి అతను జీవిస్తున్నాడు.

 తల్లి దగ్గర ఉన్న కొడుక్కి ?

తల్లి దగ్గర ఉన్న కొడుక్కి ?

గీతా ఆమె దగ్గర ఉన్న కొడుకు నితిన్ ను ఊటిలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. నా కొడుకు నితిన్ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడని గీతా ఆసుపత్రిలోని వైద్యులకు చెప్పింది. అప్పటికే నితిన్ చనిపోయాడని వైద్యులు చెప్పారు. నితిన్ శరీరం మీద ఎలాంటి చిన్న గాయం కూడా లేకపోవడంతో ఊటీ పోలీసులు అయోమయంలో పడిపోయారు.

 కిలాడీ లేడీకి నలుగురు ప్రియులు

కిలాడీ లేడీకి నలుగురు ప్రియులు

పోస్టుమార్టం నివేదికలో నితిన్ మీద విష ప్రయోగం కూడా జరగలేదని వెలుగు చూసింది. అయితే పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. గీతా ఇటీవల విడుకులు ఇచ్చిన కార్తీక్ ఆమెకు మూడో భర్త అని, అంతకు ముందే ఆమె ఇద్దరిని వివాహం చేసుకుని అందరికి విడాకులు ఇచ్చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 నాలుగవ ప్రియుడి మోజులో

నాలుగవ ప్రియుడి మోజులో

నితిన్ తల్లి గీతాకు నాలుగవ వక్తితో అక్రమ సంబంధం ఉందని, సోషల్ మీడియాలో పరిచయం అయిన బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మూడో భర్త కార్తీక్ ఒత్తిడి మేరకు గీతా ఓ బిడ్డను పిలుచుకుని వెళ్లి ఆమె దగ్గర పెట్టుకుని పోషించిందని పోలీసులు అన్నారు.

 మద్యం తాగించింది.....ఎక్కువ భోజనం పెట్టి బిడ్డను చంపేసింది

మద్యం తాగించింది.....ఎక్కువ భోజనం పెట్టి బిడ్డను చంపేసింది

తన నాలుగవ ప్రియుడితో బయటకు వెళ్లడానికి నితిన్ అడ్డుగా ఉంటున్నాడని, ఏడాది వయసు ఉన్న నితిన్ కు పదేపదే తల్లి పాలు తాగించాల్సి వస్తోందని, తన జల్సాలకు కొడుకు అడ్డు పడుతున్నాడని రగిలిపోయిన గీతా నితిన్ కు పక్కాప్లాన్ తో హాలీవుడ్ స్టైల్లో ఎక్కువగా మద్యం తాగించి, భోజనం తినిపించి హత్య చేసిందని గుర్తించిన పోలీసులు హడలిపోయారు. ప్రియుడి మోజులో పడి కన్న కొడుకు నితిన్ ను హత్య చేసిన గీతాను అరెస్టు చేసి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించామని ఊటి పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Illegal affair: Mother in Ooty was arrested for killed her son in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X