Illegal affair: సినిమా థియేటర్ లో ప్రియుడితో భార్య ఫుల్ బిజీ, ముందు సీట్లో భర్త, విశ్రాంతి, క్లైమాక్స్ ఒకేసారి
తిరువనంతపురం/ తుత్తుకుడి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉద్యోగం చెయ్యడానికి భర్త పొరుగు రాష్ట్రానికి వెళ్లాడు. దంపతుల పెద్ద కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు. రోజు ఉదయం కొడుకు ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నాడు. రెండో కొడుకు కాలేజ్ లో చదువుతున్నాడు. భర్త అతని పనికి అతను వెలుతున్నాడు. భర్త అతని స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు. సినిమా విశ్రాంతి సమయంలో సినిమా థియేటర్ లో ఉన్న ఓ జంటవైపు చాలా మంది చూస్తున్నారు. మహిళ పక్కన ఉన్న వ్యక్తి ఒళ్లో వాలిపోయి అతనికి సమోసా తినిపిస్తుంటే ఆ వ్యక్తి ఆమెకు కూల్ డ్రింక్ తాపిస్తున్నాడు. ఇదే సమయంలో భర్త కూడా అటువైపు చూసి షాక్ అయ్యాడు. నాకు పని ఉందని, మీరు సినిమా చూసుకుని రావాలని ఫ్రెండ్స్ కు చెప్పిన భర్త థియేటర్ లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. థియేటర్ లో ఎవడికో సమోసా తినిపించిన భార్యను ఆమె భర్త దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

కేరళ వెళ్లిన దంపతులు
తమిళనాడులోని తుత్తుకూడిలో నివాసం ఉంటున్న మరియప్పన్ (45) అనే వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం కన్నియమ్మాల్ (42) అనే మహళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న మరియప్పన్, కన్నియమ్మాల్ దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉద్యోగం చెయ్యడానికి మారియప్పన్ అతని కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు పొరుగు రాష్ట్రం కేరళకు వెళ్లాడు.

డెలవరీ బాయ్ ఉద్యోగం చేస్తున్న కొడుకు
మారియప్పన్, కన్నియమ్మాల్ దంపతులు కేరళలోని తిరువనంతపురంలో కాపురం పెట్టారు. మారియప్పన్ పెద్ద కుమారుడు మణికందన్ డెలవరీబాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు గణేశన్ కాలేజ్ లో చదువుకుంటున్నాడు. రోజు ఉదయం మారియప్పన్ పెద్ద కొడుకు మణికందన్ ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నాడు. రెండో కొడుకు గణశేన్ కాలేజ్ లో చదువుతున్నాడు. మారియప్పన్ కూడా అతని పనికి అతను వెలుతున్నాడు.

సినిమా థియేటర్ లో భర్తకు షాక్
2018 సెప్టెంబర్ 22వ తేదీన మారియప్పన్ అతని స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లాడు. సినిమా విశ్రాంతి సమయంలో సినిమా థియేటర్ లో ఉన్న ఓ జంటవైపు చాలా మంది చూస్తున్నారు. మహిళ పక్కన ఉన్న వ్యక్తి ఒళ్లో వాలిపోయి అతనికి సమోసా తినిపిస్తుంటే ఆ వ్యక్తి ఆమెకు కూల్ డ్రింక్ తాపిస్తున్నాడు. ఆ సందర్బంలో మారియప్పన్ కూడా అటువైపు చూసి షాక్ అయ్యాడు.

భార్యకు అక్రమ సంబంధం. బరితెగించిందని ఆవేదన
ఒడిలోపనుకుని సమోసా తినిస్తున్నది తన భార్య కన్నియమ్మాన్ అని గుర్తించిన మారియప్పన్ రగిలిపోయాడు. ఇంతకాలం ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న తన భార్య కన్నియమ్మాన్ చివరికి ప్రియుడిని వెంటపెట్టుకుని సినిమాకు వచ్చేసిందని తెలుసుని హడలిపోయాడు. నాకు పని ఉందని, మీరు సినిమా చూసుకుని రావాలని ఫ్రెండ్స్ కు చెప్పిన మారియప్పన్ సినిమా థియేటర్ లో నుంచి ఆవేశంగా బయటకు వెళ్లిపోయాడు.

భార్యను స్పాట్ లో చంపేశాడు
సినిమా చూసిన కన్నియమ్మాన్ సాయంత్రం తీరికగా ఇంటికి వెళ్లింది. ఎక్కడికి వెళ్లావు ? అని భర్త మారియప్పన్ ప్రశ్నిస్తే స్నేహితురాలి ఇంటికి వెళ్లానని కన్నియమ్మాన్ కూల్ గా సమాధానం చెప్పింది. 2018 సెప్టెంబర్ 23వ తేదీన కన్నియమ్మాన్ అక్రమ సంబంధం విషయం గురించి ఆమె భర్త మారియప్పన్ ప్రశ్నిస్తే ఆమె ఎదురుతిరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన మారియప్పన్ కత్తి తీసుకుని అతని భార్య కన్నియమ్మాన్ ను స్పాటో పొడిచి చంపేసి పారిపోయాడు.

తండ్రికి వ్యతిరేకంగా సాక్షం చెప్పిన కొడుకులు
ఇంటికి వెళ్లిన కొడుకు మణికందన్ అతని తల్లి కన్నియమ్మాన్ హత్యకు గురైన విషయం గుర్తించి అతని తండ్రి మీద కేసు పెట్టాడు. హత్య జరిగిన మూడు రోజుల తరువాత మారియప్పన్ పోలీసులకు చిక్కిపోయాడు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. కన్నియప్పకు వ్యతిరేకంగా అతని కుమారులు కోర్టులో సాక్షం చెప్పారు.

భర్తకు యావజ్జీవ శిక్ష
కన్నియమ్మాన్ ను ఆమె భర్త మారియప్పన్ హత్య చేశాడని సాక్షాలు ఉన్నాయని రుజువు అయ్యిందని, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 50,000 జరిమానా విధిస్తూ సెషన్ కోర్టు న్యాయమూర్తి కే. విష్ణు తీర్పు చెప్పారని కేరళ పోలీసులు తెలిపారు. ప్రియుడితో కలిసి సినిమాకు వెళ్లిన కన్నియమ్మాన్ హత్యకు గురికావడం అప్పట్లో కేరళలో హాట్ టాపిక్ అయ్యింది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications