Wife: అక్రమ సంబంధం, భార్యను చంపడానికి గూగుల్ లో భర్త ఏం వెతికాడంటె ?, పక్కాప్లన్ తో !
లక్నో: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. భార్యను ఎక్కడికి కావాలంటే అక్కడికి పిలుచుకుని వెళ్లి ఆమెకు ఏదికావాలంటే అదితీసిచ్చాడు. తనకు మంచి భర్త చిక్కాడని భార్య మురిసిపోయింది. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. అయితే భర్తతో అతని భార్య సర్దుకుపోయింది. తరువాత భర్త అతని భార్యతో సంతోషంగా ఉన్నాడు. భర్త అతని భార్యను పిలుచుకుని విహారయాత్రకు వెళ్లాడు. ఆ సందర్బంలో తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు భర్త మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించి హడలిపోయారు.

భార్యతో హ్యాపీ
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ప్రాంతంలోని మోదీ నగర్ ప్రాంతంలో వికాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్రాల క్రితం వికాస్ సోనియా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సోనియాను కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వికాస్ ఆమెతో చక్కగా కాపురం చేశాడు.
భార్య సోనియా బయటకు ఎక్కువగా పిలుచుకుని వెలుతున్న వికాస్ ఆమెకు ఏదికావాలంటే అదితీసిచ్చాడు. తనకు మంచి భర్త చిక్కాడని సోనియా మురిసిపోయింది.

అక్రమ సంబంధం
సోనియాను వివాహం చేసుకున్న తరువాత వికాస్ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వికాస్ అతని భార్య సోనియాను పట్టించుకోవడం మానేస్తూ వచ్చాడు. ఇదే విషయంలో వికాస్, సోనియా దంపతుల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయి.

డ్రామాలు ఆడిన భర్త
ఇక ముందు వేరే మహిళ గురించి ఆలోచించనని, నీతోనే జీవితాంతం ఉంటానని వికాస్ అతని భార్య సోనియాను నమ్మించాడు. భర్త వికాస్ తో అతని భార్య సోనియా సర్దుకుపోయింది. తరువాత వికాస్ కూడా అతని భార్య సోనియాతో సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ వచ్చాడు. కొంతకాలం క్రితం తన భార్య సోనియాను హత్య చేసి తప్పించుకోవాలని, తన ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలని వికాస్ కుట్రలు పన్నడం మొదలుపెట్టాడు.

ప్రియురాలితో కలిసి భార్యను చంపేశాడు
పక్కాప్లాన్ ప్రకారం వికాస్ అతని భార్య సోనియాతో కలిసి హాపూర్ ఏరియా హైవే మీదుగా విహారయాత్రకు వెళ్లాడు. వికాస్ అతని గర్ల్ ఫ్రెండ్ కు ముందుగానే సమాచారం ఇచ్చి అతను చెప్పిన చోటకు పిలిపించుకున్నాడు. వికాస్ అతని ప్రియురాలు ఇద్దరూ కలిసి సోనియాను గొంతు కోసి హత్య చేశారు. అనంతరం పోలీసుల ఫోన్ చేసిన వికాస్ తన భార్యను దుండగులు హత్య చేసిపారిపోయారని డ్రామాలుఆడాడు.

భార్యను హత్య చెయ్యాలని గూగుల్ లో వెతికేశాడు
వికాస్ చెబుతున్న సమయంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వికాస్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పరిశీలించారు. వికాస్ మొబైల్ ఫోన్ పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. వికాస్ తన ఫోన్‌లో భార్య సోనియాను ఎలా చంపాలో గూగుల్ సర్చ్ చేశాడని పోలీసులు అన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో విషం, తుపాకీ కొనడం సాధ్యం అవుతుందాని అని మొబైల్ లో వికాస్ పరిశీలించాడని పోలీసులకు క్లూ లభించింది.

గర్ల్ ఫ్రెండ్ ఎస్కేప్
వికాస్‌ని విచారించగా తనకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని, అందుకే తన భార్య సోనియాను మేమే హత్య చేశామని నిజం అంగీకరించాడని పోలీసులు అన్నారు. వికాస్‌ని అరెస్టు చేసి జైలుకు పంపించిన పోలీసులు తప్పించుకుని పారిపోయిన అతని ప్రియురాలి కోసం వెతుకుతున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications