Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: చెల్లెలి భర్తతో అక్క?, మిడ్ నైట్ మసాలా, దేవుడి ప్రసాదం అని భర్తకు నిద్రమాత్రలు !

బెంగళూరు/యాదగిరి : సొంత అక్కా, చెల్లికి ఇప్పటికే వేర్వేరు వ్యక్తులతో వివాహం అయ్యింది. ఎవరి భర్తలతో వాళ్లు కాపురాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటికి వస్తున్న చెల్లెలి భర్తతో కిలాడీ లేడీకి ఎక్కువ చనువు ఏర్పడింది. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. చెల్లెలి కాపురం నాశనం అవుతుందని ఏమాత్రం ఆలోచించకుండా అక్క చెల్లెలి భర్తతో అక్రమ సంబందం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. వదిన చూడటానికి ఎర్రగా, బుర్రగా అందంగా ఉండటంతో మరిది కూడా ఆమెను వదిలి ఉండలేకపోయాడు. చాలాకాలం ఈ వ్యవహారం సీక్రేట్ గా సాగిపోయింది. అయితే భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. తరువాత కథ చాలా జరిగింది. దేవుడి తీర్థం అని చెప్పిన భార్య నీళ్లలో నిద్రమాత్రల పొడి కలిసి భర్తకు ఇచ్చింది. మిడ్ నైట్ భార్య, మరిది కలిసి భర్తను చంపేయాలని స్కెచ్ వేశారు .అయితే చాకచక్యంగా తప్పించుకున్న భర్త అతని భార్య, ఆమె ప్రియుడిని చితకబాది తప్పించుకుని పారిపోయాడు. భార్య, ఆమె మరిది కలిసి భర్తను ఎలా హత్య చెయ్యాలని అనే విషయం క్లియర్ గా మాట్లాడిన ఆడియో క్లిప్ పోలీసులకు చిక్కడంతో కిలాడీ భార్యతో పాటు ఆమె మరిది పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

వివాహం చేసుకున్న అక్కా చెల్లి

వివాహం చేసుకున్న అక్కా చెల్లి

కర్ణాటకలోని యాదగిరి జిల్లాలోని సురపుర తాలుకాలోని హూవిన హళ్ళిలో విశ్వనాథ్ రెడ్డి అలియాస్ విశ్వనాథ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం విశ్వనాథ్ రెడ్డి చంద్రకళ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. చంద్రకళా చెల్లెలిని బసవనగౌడ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు.

వేర్వేరు కాపురాలు...... అక్కా, చెల్లి రాకపోకలు

వేర్వేరు కాపురాలు...... అక్కా, చెల్లి రాకపోకలు


చంద్రకళా ఆమె భర్త విశ్వనాథ్ రెడ్డితో, చంద్రకళా చెల్లెలు ఆమె భర్త బసవనగౌడతో వేర్వేరు ఇళ్లల్లో కాపురాలు చేసుకుంటున్నారు. చంద్రకళలా ఆమె చెల్లెలు ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెలుతున్నారు. ఇలా విశ్వనాథ్ రెడ్డి, చంద్రకళా, ఆమె సోదరి, ఆమె భర్త బసవనగౌడ నెలకు రెండుమూడుసార్లు కలుస్తున్నారు.

చెల్లెలి భర్తతో అక్క ?

చెల్లెలి భర్తతో అక్క ?


ఇంటికి వస్తున్న చెల్లెలి భర్త బసవనగౌడతో కిలాడీ లేడీ చంద్రకళకు ఎక్కువ చనువు ఏర్పడింది. వరుసకు మరిది అయ్యే బసవనగౌడతో చంద్రకళ అక్రమ సంబంధం పెట్టుకుంది. చెల్లెలి కాపురం నాశనం అవుతుందని ఏమాత్రం ఆలోచించకుండా చంద్రకళ చెల్లెలి భర్త బసవనగౌడతో అక్రమ సంబందం పెట్టుకుని అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

కామంతో కళ్లు మూసుకుని ఎంజాయ్ !

కామంతో కళ్లు మూసుకుని ఎంజాయ్ !


భార్య అక్క చంద్రకళ (వదిన) చూడటానికి ఎర్రగా, బుర్రగా అందంగా ఉండటంతో ఆమె మరిది బసవనగౌడ కూడా ఆమెను వదిలి ఉండలేకపోయాడు. చాలాకాలం చంద్రకళ, బసవనగౌడ వ్యవహారం చాలా సీక్రేట్ గా, నాలుగు గోడల మద్యలోనే సాగిపోయింది. అయితే భార్య చంద్రకళ, ఆమె మరిది బసవనగౌడ ఎక్కువగా సీక్రేట్ గా కలుస్తున్నారని ఆమె భర్త విశ్వనాథ్ రెడ్డిక అనుమానం వచ్చింది.

 భార్యను చితకబాదుతున్న భర్త

భార్యను చితకబాదుతున్న భర్త

చంద్రకళ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త విశ్వనాథ్ రెడ్డికి తెలిసిపోయింది. అప్పటి నుంచి విశ్వనాథ్ రెడ్డి అతని భార్య చంద్రకళలను పట్టుకుని చితకబాదుతున్నాడు. చెల్లెలికి ఇంటికి వెళ్లకుండా విశ్వనాథ్ రెడ్డి అతని భార్య చంద్రకళను కొంతకాలం కట్టడి చేశాడు. తన అక్రమ సంబంధానికి తన భర్త విశ్వనాథ్ రెడ్డి అడ్డుగా ఉన్నాడని, అతన్ని ఎలాగైనా చంపేయాలని చంద్రకళా ఆమె మరిది బసవనగౌడతో కలిసి స్కెచ్ వేసింది.

 నిద్రమాత్రల స్కెచ్ తో చంపేయాలని !

నిద్రమాత్రల స్కెచ్ తో చంపేయాలని !

నిద్రమాత్రలు నీటిలో, ఆహారంలో కలిపి విశ్వనాథ్ రెడ్డికి ఇచ్చి తరువాత అతని గొంతు నులిమి చంపేయాలని అతని భార్య చంద్రకళ, ఆమె చెల్లెలి భర్త బసవనగౌడ స్కెచ్ వేశారు. ఎలాగైనా విశ్వనాథ్ రెడ్డిని చంపేసి తరువాత ప్రియుడు బసవనగౌడతో కలిసి జీవించాలని చంద్రకళ డిసైడ్ అయ్యింది.

 దేవుడి తీర్థం అని భర్తతో బలవంతంగా తిగించిన భార్య

దేవుడి తీర్థం అని భర్తతో బలవంతంగా తిగించిన భార్య


బసనగౌడ నిద్రమాతలు పొడి చేసి దానికి చంద్రకళ దగ్గరకు చేర్చాడు. నిద్రమాత్రల పొడిని నీటిలో కలిపిన చంద్రకళ ఆ నీరును బర్త విశ్వనాథ్ రెడ్డికి ఇచ్చింది. ఈనెల 18వ తేదీన నిద్రమాత్రల పొడి కలిపిన నీరు భర్తకు ఇచ్చి ఇది దేవుడి తీర్థం అని, మనం తాగితో కష్టాలు తొలగిపోతాయని చెప్పిన చంద్రకళ దానికి భర్త విశ్వనాథ్ రెడ్డితో బలవంతంగా తాగించింది. నీళ్లు చేదుగా ఉండటంతో విశ్వనాథ్ రెడ్డి దానిని పూర్తిగా తాగలేక పక్కన పడేశాడు.

 తప్పించుకుని పారిపోయిన భర్త

తప్పించుకుని పారిపోయిన భర్త

నిద్రమాత్రలు కలిపిన నీరు తాగిన విశ్వనాథ్ రెడ్డి మత్తులోకి జారుకున్నాడు. మిడ్ నైట్ భార్య చంద్రకళ, ఆమె మరిది బసనగౌడ కలిసి విశ్వనాథ్ రెడ్డి గొంతు నులిమి చంపేయాడానికి ప్రయత్నించారు. అయితే నిద్రలో మెలుకవ రావడంతో విశ్వనాథ్ రెడ్డి పైకి లేచి భార్య చంద్రకళ, ఆమె ప్రియుడు బసవనగౌడను చితకబాదేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు.

 పిన్ టూ పిన్ రికార్డు అయింది

పిన్ టూ పిన్ రికార్డు అయింది


విశ్వనాథ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు సీక్రేట్ గా చంద్రకళ, ఆమె ప్రియుడు బసవనగౌడ మొబైల్ ఫోన్ కాల్ డేటాను సంపాధించారు. విశ్వనాథ్ రెడ్డిని నిద్రమాత్రలు కలిపిన నీళ్లు తాగించి తరువాత గొంతు నులిమి చంపేయాలని చంద్రకళ, బసనగౌడ మాట్లాడుకున్న కాల్ డేటా చిక్కిందని యాదగిరి జిల్లా ఎస్పీ డాక్టర్ సిబి. వేదమూర్తి మీడియాకు చెప్పారు. భర్తను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన చంద్రకళాతో పాటు ఆమె ప్రియుడు బసవనగౌడ ను అరెస్టు చేశామని యాదగిరి జిల్లా ఎస్పీ డాక్టర్ సిబి. వేదమూర్తి మీడియాకు చెప్పారు. మొత్తం మీద మరిది బసవనగౌడతో కలిసి చంద్రకళ ఆమె భర్త విశ్వనాథ్ రెడ్డిని హత్య చెయ్యడానికి విఫలయత్నం చెయ్యడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+