Wife: హీరోయిన్ కు లక్స్ సోపు, నాకు రిన్ సోప్, నా మొగుడు చీటర్, ఊరంతా సంసారాలే ?, ఎస్ఐ భార్య !
చెన్నై: నా మొగుడు పోలీసు అధికారి కావడంతో అతని పోలీసు యూనీఫామ్, ఆయన అధికారం అడ్డం పెట్టుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుని జల్సా చేస్తున్నాడని నేను కేసు పెట్టి సంవత్సరంపైగా అయ్యింది. ఇలాంటి ఆరోపణలతో ఓ పోలీసు అధికారి మీద ఓ హీరోయిన్ కేసు పెడితే కొంపలు మునిగిపోయాయని రాద్దాం చేసి వాళ్లకు మీరు రాజీ చేస్తారా ? అంటూ ఓ పోలీసు అధికారి భార్య మండిపడుతోంది. హీరోయిన్ లక్స్ సోపు వాడుతుంది, నేను రిన్ సోపు వాడుతున్నానని మీరు అనుకుంటున్నారా ?, హీరోయిన్ ది ఎర్రతోలు, నాది నల్ల తోలు అని మీకు నిర్లక్షమా ? అంటూ ఓ పోలీసు అధికారి భార్య పోలీసు అధికారుల మీద మండిపడటం హాట్ టాపిక్ అయ్యింది.

ఎస్ఐ ప్రభాకరన్ భార్య
చెన్నైలోని కాసిమేడు పోలీస్ స్టేషన్ లో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పని చేస్తున్న ప్రభాకరన్ అనే వ్యక్తికి చెన్నైలోని పెరవేరిలో నివాసం ఉంటున్న రేఖాబాను అనే యువతికి 1994లో వివాహం జరిగింది. అప్పటి నుంచి చిన్నిచిన్న గొడవల తప్పా కొన్ని సంవత్సరాలు మా కాపురంలో ఎలాంటి గొడవలు లేవని పోలీసు అధికారి ప్రభాకరన్ భార్య రేఖాబాను అంటున్నారు.

పెళ్లాం దగ్గర పిల్లి.... పక్కింటి ఆంటీల దగ్గర పోటుగాడు
రానురాను తన భర్త ప్రభాకరన్ పోలీసు ఉద్యోగం అడ్డం పెట్టుకుని వేరే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని జల్సా చేస్తున్నాడని, సక్రమంగా ఇంటికి రావడం లేదని ఆరోపిస్తూ ఆయన భార్య రేఖభాను గత ఏడాది చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన భర్త ప్రభాకరన్ ఇంట్లో పిల్లిలాగా ఉంటున్నాడని, వీధిలోకి వెళ్లి పరాయి మహిళల దగ్గర పోటుగాడు అనే ఫీలింగ్ తో బతికేస్తున్నాడని ఆయన భార్య రేఖాబాను ఆరోపిస్తోంది.

నా మొగుడికి ఎంతమంది ? అని నాకే తెలీదు
తన భర్త ప్రభాకరన్ కు చాలా మంది పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, వాళ్లు ఎంత మంది అనే విషయం తనకే సరిగా తెలీడం లేదని ఆయన భార్య రేఖాబాను ఆరోపిస్తున్నది. ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి రావడం, తన పుట్టింటి నుంచి తీసుకువచ్చిన బంగారు నగలు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, తన నగలు నా మొగుడు ఉంచుకున్న వాళ్లకు ఇవ్వాలని టార్చర్ పెడుతున్నాడని ఆరోపిస్తూ భార్య రేఖబాను చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో గత ఏడాది ఫిర్యాదు చేసింది.

హీరోయిన్ లక్స్ సోపు.....నేను రిన్ సోపు వాడుతున్నానా ?
తన భర్త ప్రభాకరన్ మీద ఫిర్యాదు చేసి ఏడాది అయినా ఆయన మీద చెన్నై సిటీ పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆయన భార్య రేఖాబాను ఓ వీడియో విడుదల చెయ్యడం కలకలం రేపింది. పోలీసు అధికారుల తీరు చూస్తుంటే హీరోయిన్ రాధా లక్స్ సోపు వాడుతున్నట్లు ఉందని, నేను సామాన్య మహిళ కాబట్టి రిన్ సోపు వాడుతున్నట్లు ఉందనే సామెతలా ఉందని రేఖాబాను మండిపడ్డారు.

హీరోయిన్ విషయంలో కొంపలు మునిగిపోయాయా ?
హీరోయిన్ రాధా ఆమె రెండో భర్త అయిన ఓ పోలీసు అధికారి మీద ఫిర్యాదు చేస్తే ఏదో కొంపలు మునిగిపోయాయని రెండు రోజుల్లో రాజీ చేసి విషయం పరిష్కరించారని, ఆ హీరోయిన్ రాధా విషయంలో తీసుకున్న శ్రధ్ద నా విషయంలో ఇంత వరకు ఎందుకు తీసుకోలేదని రేఖాబాను చెన్నై సిటీ పోలీసు అధికారులను సూటిగా ప్రశ్నించింది.

ఎర్రతోలు.... నల్లతోలు అనే తేడా చూస్తున్నారా ?
హీరోయిన్ రాధా ఎర్రగా బుర్రగా ఉందని ఆమె కేసు వెంటనే పరిష్కరించారా ?, నేను నల్లగా ఉన్నానని ఏడాది అయినా మీరు తన కేసు గురించి పట్టించుకోవడం లేదా ? అని రేఖాబాను పోలీసు అధికారులను ప్రశ్నించింది. నా రక్తం ఎర్రగానే ఉందని, హీరోయిన్ రక్తం ఎర్రగానే ఉందని పోలీసు అధికారులు గుర్తించాలని రేఖాబాను మనవి చేసింది.

ఆమెకు రక్తం.... నాకు టమోటో సూప్ లేదు
హీరోయిన్ కు రక్తం ఎర్రగా ఉంటే నా రక్తం ఏమైనా టమోటో సూప్ లాగా ఉందా ? అని రేఖాబాను ప్రశ్నించింది. వెంటనే తన భర్త ప్రభాకరన్ ను సస్పెండ్ చేసి కేసు విచారణ చేసి తనకు న్యాయం చెయ్యాలని ఆయన భార్య రేఖాబాను చెన్నై సిటీ పోలీసు కమినర్ కార్యాలయం పోలీసు అధికారులకు మనవి చేసింది. మొత్తం మీద చెన్నైలో మరో పోలీసు అధికారి భార్య రెచ్చకు ఎక్కడంతో ఆ నగర పోలీసు అధికారులు హడలిపోయారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications