చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: తల్లీ కూతురి హత్య, పెద్ద కూతురు, ప్రియుడు స్కెచ్, ఆస్తులు, సీక్రెట్స్ తో ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: పుట్టిన ఊరిలో కూతురు ఉంటే తనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని తల్లి బావించింది. ఇద్దరు కూతుర్లకు తల్లి సంబంధాలు చూసి వేర్వేరు వ్యక్తులతో పెళ్లి చేసింది. పెద్ద కూతురు సొంత ఊర్లో భర్తతో కాపురం చేస్తోంది. రెండో కూతురి పెళ్లి పెటాకులు అయ్యింది. భర్తను వదిలేసిన చిన్న కూతురు పుట్టింటికి చేరుకుని తల్లితో కలిసి నివాసం ఉంటోంది. ఇదే సమయంలో పెద్ద కుమార్తె భర్తకు, తల్లికి తెలీకుండా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునింది. సొంత ఊర్లో భర్త, ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న కుమార్తె విషయం ఆమె తల్లికి తెలిసింది. నీ పద్దతి మార్చుకోవాలని, లేదంటే కుటుంబం పరువు పోతుందని తల్లి కుమార్తెను హెచ్చరించింది. ఇదే సమయంలో ఇంట్లో ఉంటున్న తల్లి, ఆమె చిన్న కుమార్తె దారుణ హత్యకు గురికావడంతో కలకలం రేపింది. ఆస్తుల విషయం, సీక్రెట్ విషయంలో పెద్ద కూతురు ప్రియుడు స్కెచ్ వేశాడని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు.

Sadist: వదినతో వన్స్ మోర్, ఆమెతో పెళ్లి, బెడ్ రూమ్ వద్దు, డైనింగ్ టేబుల్ మీద?, నో అంటే కాల్చేశాడు!Sadist: వదినతో వన్స్ మోర్, ఆమెతో పెళ్లి, బెడ్ రూమ్ వద్దు, డైనింగ్ టేబుల్ మీద?, నో అంటే కాల్చేశాడు!

 ఆంటీకి ఇద్దరు కుమార్తెలు

ఆంటీకి ఇద్దరు కుమార్తెలు

తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు సమీపంలోని పాడినెట్టంగుడి ప్రాంతంలో లీలాదేవి అలియాస్ దేవి (48) అనే మహిళ నివాసం ఉంటున్నారు. లీలాదేవికి మహేశ్వరి, అఖిలాండేశ్వరి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త లేకపోవడంతో లీలాదేవి కష్టపడి ఇద్దరు కుమార్తెలు మహేశ్వరి, అఖిలాండేశ్వరిని పెంచి పెద్ద చేసింది.

 ఇద్దరు కూతుర్లకు పెళ్లి

ఇద్దరు కూతుర్లకు పెళ్లి

సొంత ఊర్లో ఓ కూతురు ఉంటే తనకు అన్నింటికి అనుకూలంగా ఉంటుందని లీలాదేవి ఆలోచించింది. కొడుకులు లేకపోవడంతో లీలాదేవి జీవితాంతం ఒక కూతురు తోడుకావాలని ఆలోచించి పెద్ద కుమార్తె మహేశ్వరికి సొంత ఊర్లో సెల్వరాజ్ అనే వ్యక్తితో వివాహం జరిపించింది. రెండో కూతురు అఖిలాండేశ్వరి మోహన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది.

 రెండో కూతురి పెళ్లి పెటాకులు

రెండో కూతురి పెళ్లి పెటాకులు

చిన్న కూతురు అఖిలాండేశ్వరి పెళ్లి చేసుకుని కొంతకాలం ఆమె భర్త మోహన్ తో కాపురం చేసింది. తరువాత అఖిలాండేశ్వరి కాపురంలో గొడవలు మొదలైనాయి. చాలా కాలం పెద్దలు పంచాయితీలు చేసినా అఖిలాండేశ్వరి కాపురం ఓ కొలిక్కిరాలేదు. ఇదే సమయంలో విసిగిపోయిన అఖిలాండేశ్వరి భర్తను వదిలేసి తల్లి లీలావతి ఇంటికి వెళ్లిపోయింది.

 ప్రియుడితో పెద్ద కూతురు రొమాన్స్

ప్రియుడితో పెద్ద కూతురు రొమాన్స్

పెద్ద కూతురు మహేశ్వరి యవ్యారం మరో రకంగా ఉంది. భర్త సెల్వరాజ్ కు తెలీకుండా మహేశ్వరి అదే ఊరిలో ఉంటున్న శశికుమార్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త అమాయకుడు కావడంతో మహేశ్వరి ఆమె ప్రియుడు శశికుమార్ తో కలిసి అడ్డూఅదుపు లేకుండా ఎంజాయ్ చేసింది. ఎక్కడపడితే అక్కడ మహేశ్వరి, శశికుమార్ తిరగడంతో ఊరంతా టామ్ టామ్ అయిపోయింది.

 కూతురికి వార్నింగ్ ఇచ్చిన తల్లి

కూతురికి వార్నింగ్ ఇచ్చిన తల్లి

పెద్ద కుమార్తె మహేశ్వరి అక్రమ సంబంధం విషయం అక్కడా ఇక్కడ తెలిసి చివరికి ఆమె తల్లి లీలాదేవి చెవిలో పడింది. నువ్వు మన కుటుంబం పరువు తీస్తున్నావని, భర్త బతికుండగానే నీకు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం ఏమిటి అని కుమార్తె మహేశ్వరి మీద మండిపడింది. మర్యాదగా నీ పద్దతి మార్చుకోవాలని లీలావతి ఆమె కుమార్తె మహేశ్వరికి వార్నింగ్ ఇచ్చింది. నీ గురించి నాకు తెలుసు, నువ్వు నాకు నీతులు చెబుతున్నావా అంటూ మహేశ్వరి ఆమె తల్లి లీలాదేవికి ఎదురు తిరిగింది.

 తల్లి, చెల్లి ఒక్కటైనారని పగ

తల్లి, చెల్లి ఒక్కటైనారని పగ

తల్లి లీలావతితో పాటు భర్తను వదిలేసి పుట్టింటిలో ఉన్న చెల్లెలు అఖిలాండేశ్వరి కూడా మహేశ్వరికి బుద్దిమాటలు చెప్పడం మొదలుపెట్టారు. వయసులో తనకంటే తక్కువ అయిన అఖిలాండేశ్వరి బుద్దిమాటలు చెప్పడం ఆమె అక్క మహేశ్వరి జీర్ణించుకోలేకపోయింది. తల్లి లీలావతి, చెల్లెలు అఖిలాండేశ్వరి మీద మహేశ్వరి రగిలిపోయింది.

 ప్రియుడితో స్కెచ్.... ఆస్తి మొత్తం వస్తుందని ఆశ

ప్రియుడితో స్కెచ్.... ఆస్తి మొత్తం వస్తుందని ఆశ

ఎక్కడ తన భర్తకు తన అక్రమ సంబంధం విషయం చెబుతారో అని మహేశ్వరి ఆమె తల్లి, సోదరి అఖిలాండేశ్వరి మీద పగపెంచుకునింది. తల్లి లీలాదేవి, చెల్లెలు అఖిలాండేశ్వరిని చంపేస్తే పీడపోతుందని, ఆస్తి మొత్తం తనకే వస్తుందని మహేశ్వరి ఆలోచించింది. తన తల్లి లీలావతి, చెల్లెలు అఖిలాండేశ్వరిని చంపేయాలని మహేశ్వరి ఆమె ప్రియుడు శిశికుమార్ కు చెప్పింది.

 అర్దరాత్రి ఇద్దరూ ఫినిష్

అర్దరాత్రి ఇద్దరూ ఫినిష్

రాత్రి భోజనం చేసిన తరువాత లీలావతి, అఖిలాండేశ్వరి ఇంట్లో నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత ఇంట్లో చొరబడి తల్లి లీలావతి, ఆమె చిన్న కుమార్తె అఖిలాండేశ్వరిని కొడవలితో దారుణంగా నరికేశారు. తల్లీ కూతురు కేకలు వెయ్యడంతో అప్పటికే నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 కూతురు, ప్రియుడే హంతకులు

కూతురు, ప్రియుడే హంతకులు

పోలీసుల విచారణలో లీలావతికి, అఖిలాండేశ్వరికి శత్రువులు ఎవ్వరూ లేరని తెలిసింది. అఖిలాండేశ్వరి భర్తకు కూడా ఈ జంట హత్యలతో సంబంధం లేదని వెలుగు చూసింది. ఇదే సమయంలో మహేశ్వరి, శశికుమార్ అక్రమ సంబంధం విషయం తెరమీదకు వచ్చింది. పోలీసులు మహేశ్వరి, ఆమె ప్రియుడు శశికుమార్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. అక్రమ సంబంధం విషయం బయటపడుతుందని భయంతో, ఆస్తి వస్తుందని ఆశతో తన ప్రియడు శశికుమార్ సహాయంతో తన తల్లి లీలాదేవి, సోదరి అఖిలాండేశ్వరిని చంపేయాలని తానే స్కెచ్ వేశానని మహేశ్వరి అంగీకరించింది. పోలీసులు మహేశ్వరి, ఆమె ప్రియుడు శశికుమార్ ను అరెస్టు చేశారు. సొంత కూతురు తల్లిని, చెల్లిని హత్య చేయించిన విషయం తమిళనాడులో కలకలం రేపింది.

English summary
Illegal affair: Woman arrested for murdering mother and sister near Madurai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X