చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: ప్రియుడితో అడ్డంగా చిక్కిపోయిన బిజినెస్ మ్యాన్ భార్య, భర్తను చంపేసి స్మార్ట్ స్కెచ్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ సేలం: ఇంట్లో చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్న యువకుడు ఆమెతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. సొంతంగా ఫైనాన్స్ సంస్థను నడుపుతున్న భర్త 8 కార్లు, ఐదు టెంపో వాహనాలు పెట్టుకుని వాటిని అద్దెకు ఇస్తున్నాడు. ఫైనాన్స్ వ్యాపారంతో పాటు వాహనాలు అద్దెకు ఇస్తున్న భర్త డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. అప్పు తీసుకున్న వ్యక్తులు వడ్డీ చెల్లించడానికి, తీసుకున్న రుణం తిరిగి ఇవ్వడానికి అతని ఇంటికి వచ్చి వెలుతున్నారు. ఇదే సమయంలో ఫైనాన్స్ వ్యాపారి భార్య ఓకుర్రాడిని లైన్ లో పెట్టింది. తండ్రి తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించడానికి వచ్చి వెలుతున్న కొడుకు వడ్డీ వ్యాపారి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో జల్సా చేశాడు. అనుకోకుండా ఓ రోజు వడ్డీ వ్యాపారి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో బెడ్ రూమ్ లో అతని భార్య, కుర్రాడు కుస్తీ పడుతున్న విషయం కళ్లారా చూసి రగిలిపోయాడు.

తరువాత కథ అనేక మలుపులు తిరిగింది. కొంతకాలానికి ఫైనాన్స్ వ్యాపారి అతని ఇంట్లో నోటిలో, ముక్కులో రక్తం కక్కుకుని శవమైకనిపించాడు. నా భర్త మూర్చవ్యాధితో చనిపోయాడని అతని భార్య ఆమె స్మార్ట్ ఫోన్ నుంచి అందరికి ఫోన్లు చేసి చెప్పి అంతే స్మార్ట్ గా చెప్పి చాలా డీసెంట్ గా కేసు నుంచి తప్పించుకోవడానికి స్కెచ్ వేసింది. అయితే చేసుకున్నోడికి చేసుకున్నంత అంటూ ఫైనాన్స్ వ్యాపారి అసలు గట్టును పోలీసులు ఎలా బయటకు లాగారు అనేది అసలు కథ.

College girl: కూతుర్ని రేప్ చేసి రెండు పార్టీల లీడర్స్ కు దానం చేసిన తండ్రి, 28 మందితో, అరెస్టు !College girl: కూతుర్ని రేప్ చేసి రెండు పార్టీల లీడర్స్ కు దానం చేసిన తండ్రి, 28 మందితో, అరెస్టు !

 ఫైనాన్స్ వ్యాపారి

ఫైనాన్స్ వ్యాపారి

తమిళనాడులోని సేలం జిల్లాలోని శంకరగిరిలో దయానంద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం దయానంద్ అన్ని ప్రియా అలియాస్ ప్రియా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సొంతంగా ఫైనాన్స్ సంస్థను నడుపుతున్న దయానంద్ 8 కార్లు, ఐదు టెంపో వాహనాలు పెట్టుకుని వాటిని అద్దెకు ఇస్తున్నాడు.

 డబ్బులు బాగా సంపాదిస్తున్న వ్యాపారి

డబ్బులు బాగా సంపాదిస్తున్న వ్యాపారి

ఫైనాన్స్ వ్యాపారంతో పాటు వాహనాలు అద్దెకు ఇస్తున్న దయానంద్ డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. ఇంట్లో చూపించిన అమ్మాయి ప్రియాను వివాహం చేసుకున్న దయానంద్ ఆమెకు ఏలోటూ రానివ్వకుండా చూసుకుంటూ ఆమెతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దయానంద్, ప్రియా దంపతులు చూడముచ్చటగా ఉన్నారని అందరూ మురిసిపోయారు.

 ఇంట్లో శవమైన ఫైనాన్స్ వ్యాపారి

ఇంట్లో శవమైన ఫైనాన్స్ వ్యాపారి

మూడు రోజుల క్రితం రాత్రి ఫైనాన్స్ వ్యాపారం ముగించుకుని, రుణం తీసుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేసుకున్న దయానంద్ ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చేసిన దయానంద్ ఇంట్లో నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం దయానంద్ భార్య ప్రియా గట్టిగా కేకలు వేసుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చింది. బంధువులు, చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా ఇంట్లో దయానంద్ శవమై కనిపించాడు.

 డీసెంట్ గా ఫోన్లు చేసి చెప్పిన భార్య ప్రియా

డీసెంట్ గా ఫోన్లు చేసి చెప్పిన భార్య ప్రియా

ఫైనాన్స్ వ్యాపారి దయానంద్ అతని ఇంట్లో నోటిలో, ముక్కులో రక్తం కక్కుకుని శవమైకనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. నా భర్త దయానంద్ మూర్చవ్యాధితో చనిపోయాడని అతని భార్య ప్రియా ఆమె స్మార్ట్ ఫోన్ నుంచి అందరికి ఫోన్లు చేసి చెప్పింది. భర్త దయానంద్ చనిపోయాడని అంతే స్మార్ట్ గా ప్రియా అందరికి చెప్పింది.

 తమిళ తంబి పోలీసులకు తెలివి ఎక్కువ

తమిళ తంబి పోలీసులకు తెలివి ఎక్కువ

దయానంద్ శవాన్ని పోస్టుమార్టుంకు తరలించిన పోలీసులు మొదట అతని భార్య ప్రియాను ఏమీ మాట్లాడలేదు. దయానంద్ తల మీద బలమైన గాయం అయ్యిందని, అతన్ని విషప్రయాగంతో హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. దయానంద్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని పోలీసులు విచారణ చేశారు.

 గదిలో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్న భార్య

గదిలో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతున్న భార్య

వడ్డీకి డబ్బులు తీసుకున్న వారు చాలా మంది దయానంద్ ఇంటికి వచ్చి వెలుతుంటారని చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పారు. బుధవారం దయానంద్ అంత్యక్రియలు జరిగాయి. తరువాత పోలీసులు రంగప్రవేశం చేశారు. దయానంద్ భార్య ప్రియా పదేపదే గదిలోకి వెళ్లి ఎవరితోనే ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతుందని దయానంద్ కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 ప్రియాకు ఓ కన్నింగ్ ప్రియుడు ఉన్నాడని ?

ప్రియాకు ఓ కన్నింగ్ ప్రియుడు ఉన్నాడని ?

రాత్రి దయానంద్ ఇంట్లో భోజనం చేసిన తరువాత మరుసటి రోజు అతను ఇంట్లో శవమైనాడని, ఆ మధ్యకాలంలో అతను ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని పోలీసులు తెలుసుకున్నారు. దయానంద్ భార్య ప్రియా మీద పోలీసులకు అనుమానం పెరిగిపోయింది. చాలా చక్కగా నటిస్తూ అందరిని ముందు నాటకాలు ఆడుతున్న దయానంద్ భార్య ప్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ప్రియా ముఖేష్ అనే యువకుడి పేరు తెరమీదకు వచ్చింది.

 వ్యాపారికి వడ్డీ ఇవ్వడానికి వచ్చి అతని భార్యను లైన్ లో పెట్టాడు

వ్యాపారికి వడ్డీ ఇవ్వడానికి వచ్చి అతని భార్యను లైన్ లో పెట్టాడు

పోలీసులు ముఖేష్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో దయానంద్ భార్య ప్రియా, ఆమె ప్రియుడు ముఖేష్ మ్యాటర్ మొత్తం బయటకు చెప్పారు. ఫైనాన్స్ వ్యాపారి దయానంద్ భార్య ప్రియా ఇంటికి వచ్చి వెలుతున్న ముఖేష్ ను లైన్ లో పెట్టింది. తన తండ్రి తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించడానికి తాను దయానంద్ ఇంటికి వెళ్లేవాడినని, ఆ సమయంలో తనకు ఆయన భార్య ప్రియా పరిచయం అయ్యిందని ముఖేష్ పోలీసులకు చెప్పాడు.

 బెడ్ రూమ్ లో ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన భార్య

బెడ్ రూమ్ లో ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన భార్య

తన ఇంటికి వచ్చి వెలుతున్న ముఖేష్ తో దయానంద్ భార్య ప్రియా అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో జల్సా చేసిందని పోలీసు విచారణలో వెలుగు చూసింది. అనుకోకుండా ఓ రోజు వడ్డీ వ్యాపారి దయానంద్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో బెడ్ రూమ్ లో అతని భార్య ప్రియా, ఆమె ప్రియుడు ముఖేష్ ఎంజాయ్ చేస్తున్నారని, ఇద్దరూ నగ్నంగా కుస్తీ పడుతున్న విషయం కళ్లారా చూసిన దయానంద్ రగిలిపోయాడని పోలీసులు చెప్పారు. ఇంకోసారి ఇలా చూస్తే ఇద్దరిని చంపేసి మీ శవాలు కాల్చి బూడిద చేస్తానని దయానంద్ అతని భార్య ప్రియా, ఆమె ప్రియుడు ముఖేష్ కు వార్నింగ్ ఇచ్చి వదిలేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 పాలలో విషయం కలిపి భర్తను చంపేసిన భార్య

పాలలో విషయం కలిపి భర్తను చంపేసిన భార్య

దయనాంద్ వార్నింగ్ ఇచ్చిన తరువాత ప్రియా ఆమె ప్రియుడు ముఖేష్ తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. దయానంద్ బతికుంటే మనం కలవడం కుదరదని, అతన్ని చంపేసి మనం పెళ్లి చేసుకుందామని ముఖేష్ ప్రియురాలు ప్రియాకు చెప్పాడు. రోజూ నిద్రపోయే ముందు పాలు తాగే అలావాటు ఉన్న ముఖేష్ మూడు రోజుల ముందు అతని భార్య పాలలో విషం కలిపి ఇచ్చిందని, తరువాత మత్తులోకి జారుకున్న దయానంద్ తల మీద ఆమె ప్రియుడు ముఖేష్ దాడి చెయ్యడంతో అతను చనిపోయాడని విచారణలో ఇద్దరూ అంగీకరించారని పోలీసులు అన్నారు. ప్రియా, ఆమె ప్రియుడు ముఖేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.

 ప్రియుడి మోజులో పడిన ప్రియాకు చిప్పకూడు

ప్రియుడి మోజులో పడిన ప్రియాకు చిప్పకూడు

ప్రియాను సేలం మహిళా సెంట్రల్ జైలుకు, ముఖేష్ ను అత్తూరు జైలుకు తరలించామని పోలీసులు అన్నారు. మొత్తం మీద వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలకే కట్టుకున్న భర్త దయానంద్ ను ప్రియుడి మోజులో పడిని ప్రియా అతన్ని హత్య చేసి జైలుపాలు కావడం సేలంలో కలకలం రేపింది.

English summary
Illegal affair: Young businessman beaten to death wife arrested due to illegal love near Salem in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X