Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

girlfriend: ఒంటరిగా ఉండలేకపోతున్నా, నీ భార్యను నాతో పంపించు అని భర్తకు చెప్పిన ప్రియుడు !

చెన్నై: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. డబ్బు సంపాధించాలని భర్త సిటీకి వెళ్లాడు. సొంత ఊరిలో ఉంటున్న భార్య ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భర్త నెలకు ఒకసారి ఇంటికి వెళ్లి వస్తున్నాడు. కొంతకాలం క్రితం భార్య అక్రమ సంబంధం గురించి ఆమె భర్తకు తెలిసిపోయింది. ఇక్కడే ఉంటే పరిస్థితులు చెయ్యిదాటిపోతాయని అనుకున్న భర్త అతని భార్యను తనతోపాటు సిటీకి వచ్చేయాలని చెప్పాడు. ప్రియురాలు దూరం అవుతున్నదని కోపంతో ప్రియుడు రగిలిపోయాడు. నేరుగా సిటీకి వెళ్లిన ప్రియుడు నీ భార్యను నాతో పంపించు అని ప్రియురాలి భర్తతో గొడవ చేసి అతన్ని దారుణంగా హత్య చేశాడు.

చెన్నైలో పని చేస్తున్న భర్త

చెన్నైలో పని చేస్తున్న భర్త

తమిళనాడులోని విరూద్ నగర్ లో నివాసం ఉంటున్న శంకర్ అలియాస్ వేలుదురై అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తిరునల్వేలి జిల్లాలో నివాసం ఉంటున్న సెల్వీ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న శంకర్, సెల్వీ దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. డబ్బు సంపాధించాలని శంకర్ చెన్నై సిటీకి వెళ్లి అక్కడ పెయింటర్ గా పని చేస్తున్నాడు.

భార్య అక్రమ సంబంధం

భార్య అక్రమ సంబంధం

శంకర్ చెన్నైలో స్నేహితుడి రూమ్ లో ఉంటూ ప్రతిరోజు పెయింట్ పని చేస్తున్నాడు. సొంత ఊరిలో ఉంటున్న శంకర్ భార్య సెల్వీ విరూద్ నగర్ జిల్లాలోనే నివాసం ఉంటున్న వీరబుదికరన్ (37) అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భర్త శంకర్ చాలా దూరంలో ఉండటం, ఇంట్లో అడగడానికి పెద్ద దిక్కులేకపోవడంతో సెల్వీ, ఆమె ప్రియుడు వీరబుధికరన్ విహారయాత్రకు వెళ్లి జల్సా చేశారు.

మ్యాటర్ లీక్ అయ్యింది

మ్యాటర్ లీక్ అయ్యింది

శంకర్ నెలకు ఒకసారి విరూద్ నగర్ లోని ఇంటికి వెళ్లి అతని భార్య సెల్వీతకి కొన్ని రోజులు గడిపి తరువాత చెన్నై వెలుతున్నాడు. ఇటీవల ఊరికి వెళ్లిన శంకర్ కు అతని భార్య సెల్వీ అక్రమ సంబందం గురించి తెలిసి షాక్ అయ్యాడు. తన భార్య సెల్వీని ఇలాగే వదిలేస్తే పరిస్థితులు చెయ్యిదాటిపోతాయని అనుకున్న శంకర్ అతని భార్యను తనతోపాటు చెన్నై సిటీకి వచ్చేయాలని, అక్కడే మనం ఉందామని చెప్పాడు.

నీ భార్యను నాతో పంపించు అని భర్తకు చెప్పిన ప్రియుడు

నీ భార్యను నాతో పంపించు అని భర్తకు చెప్పిన ప్రియుడు


శంకర్ అతని భార్య సెల్వీని పిలుచుకుని చెన్నై వెళ్లిపోయాడు. ప్రియురాలు సెల్వీ దూరం అవుతున్నదని ఆమె ప్రియుడు వీరబుధికరన్ రగిలిపోయాడు. విరూద్ నగర్ నుంచి నేరుగా చెన్నై సిటీకి వెళ్లిన ప్రియుడు వీరబుధికరన్ ప్రియురాలు సెల్వీ భర్త శంకర్ పని చేస్తున్న గిండీ ప్రాంతానికి వెళ్లాడు. తరువాత నీ భార్య సెల్వీని విరూద్ నగర్ కు పంపించేయాలని, ఆమెకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని వీరబుధికరన్ శంకర్ కు చెప్పాడు.

ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు

ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు

నా భార్యను పంపించాలని అడగడానికి నువ్వు ఎవరు అంటూ శంకర్ ఎదురుతిరిగాడు. ఆ సందర్బంలో శంకర్, వీరబుధికరన్ మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన వీరబుధికరన్ ముందుగా వెంట తీసుకెళ్లిన కత్తితో అతని ప్రియురాలు సెల్వీ భర్త శంకర్ ను పొడిచి స్పాట్ లో చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. విషయం తెలుసుకున్న చెన్నై సిటీ పోలీసులు శంకర్ భార్య సెల్వీ ప్రియుడు వీరబుధికరన్ కోసం గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+