Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illicit Relationship: ప్రేమలో పడిన ఐదుగురు పిల్లల తల్లి.. ప్రేమికుల రోజున భర్త సూసైడ్

Illicit Relationship: ఏ మగాడైనా ఎలాంటి కష్టాన్ని అయినా తట్టుకోగలుగుతారు. కానీ తన భార్య వేరే పురుషుడితో ఉంటే మాత్రం భరించలేరు. ఇలాంటి కేసుల్లో చాలా వరకు హత్యలు లేదా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ లోని ముంగేర్ లో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పెళ్లి అయిన 14 ఏళ్ల తర్వాత ఐదుగురు పిల్లల తల్లి ప్రేమలో పడింది. తట్టుకోలేక భర్త ప్రేమికుల రోజునే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంగేర్ లోని ఖాసిం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుడి భార్య అదే గ్రామానికి చెందిన యువకుడితో సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాసిం బజార్ పీఎస్ పరిధిలోని హజ్రత్ గంజ్ లోని ఓ గల్లీలో అర్మాన్(35) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అర్మాన్ 14 ఏళ్ల క్రితం రుక్సానా బేగంను వివాహం చేసుకున్నాడు. వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. భార్యకు అదే గ్రామానికి చెందిన ఓ పాల వ్యాపారితో కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. షబ్-ఎ-బరాత్(ఫిబ్రవరి 14) రాత్రి అర్మాన్ తన భార్య మరొక వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుండడం చూశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. శుక్రవారం రాత్రి తీవ్ర నిరాశకు గురైన మహ్మద్ అర్మాన్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి మృతితో ఐదుగురు పిల్లలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సమాచారం అందిన వెంటనే భార్య కూడా ఆస్పత్రికి చేరుకుంది. కానీ ఆ భార్య కూడా షాక్ కు గురైంది.

Illicit Relationship Leads to Tragedy Husband Commits Suicide After Discovering Wife s Affair in Bihar

తన భార్య చేసిన ద్రోహం, మానసిక హింసతో అర్మాన్ విసిగిపోయాడని మృతుడి సోదరుడు ఫర్మాన్ చెప్పాడు. పోలీసులు కుటుంబ సభ్యులను విడివిడిగా విచారిస్తున్నారు. ఖాసిం బజార్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రూబీకాంత్ కచ్చప్ మాట్లాడుతూ.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ముంగేర్ లోని సదర్ ఆస్పత్రికి పంపినట్లు వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపడుతున్నారని ఆయన చెప్పారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+