Wife: బిజినెస్ మేన్ కు బలిసిన ప్రియురాలు, మ్యాటర్ లీక్, భార్య, కూతుర్లను ఏం చేశాడంటే ?, పోయేకాలం!
ముంబాయి/థానే: వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓ కుమార్తె వయసుకు వచ్చింది. వ్యాపారం చేస్తున్న భర్త బయట ఎక్కువగా తిరుగుతున్నాడు. ఇదే సందర్బంలో సార్ ఓ కిలాడీ లేడీని తగులుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. బిజినెస్ ట్రిప్పులు అని భార్యకు చెప్పి అతని ప్రియురాలితో హనీమూన్ ట్రిప్పులు వేస్తున్నాడు. భర్త మ్యాటర్ భార్యకు తెలిసిపోయింది. నీకు ఏమి పోయేకాలంరా, నేను బాగానే ఉన్నాను కదా, నీకు ఆ టక్కులాడి కావలసి వచ్చిందా అంటూ భార్య గొడవ చెయ్యడం మొదలుపెట్టింది. భార్య బతికుంటే నా జల్సాలకు అడ్డుపడుతుందని భర్త అనుకున్నాడు.
భార్యతో పాటు కూతుర్లను కూడా చంపేస్తే ఉన్న ఆస్తితో తన ప్రియురాలితో జల్సాలు చెయ్యడానికి భలే చాన్స్ ఉంటుందని అనుకున్నాడు. ఇంట్లో వేకువ జామున నిద్రపోతున్న భార్య, కూతుర్ల మీద కిరోసిన్ పోసిన భర్త నిప్పంటించాడు. పనిలో పనిగా అతని మీద లైట్ గా పెట్రోల్ చల్లుకుని నిప్పంటిచుకున్నాడు.

ఇద్దరు అందమైన కూతుర్లు
మహారాష్ట్రలోని థానే సిటీలోని డోంబివిలీకి ప్రాంతంలో ప్రసాద్ శాంతారామ్ అలియాస్ ప్రసాద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 16 ఏళ్ల క్రితం భీరితీ అనే మహిళను ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడు. ప్రసాద్ అతని భార్య భీరితీతో సంతోషంగా కాపురం చేశాడు. ప్రసాద్, బీరితీ దంపతులకు 14 ఏళ్లు, 11 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వయసుకు వచ్చింది.

బిజినెస్ మేన్ కు బలిసిన ప్రియురాలు
వ్యాపారం చేస్తున్న ప్రసాద్ బయట ఊర్లకు ఎక్కువగా తిరుగుతున్నాడు. ఇదే సందర్బంలో ప్రసాద్ బాగా బలిసిన కిలాడీ లేడీ రవళి (పేరు మార్చడం జరిగింది) అనే మద్య వయసు ఉన్న మహిళను తగులుకుని ఆమెతో అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. చాలాకాలం నుంచి ప్రసాద్, రవళి అక్రమ సంబంధం పెట్టుకుని జల్సాలు చేస్తున్నారు.

భార్యకు మ్యాటర్ లీక్
బిజినెస్ ట్రిప్పులు అని భార్య బీరితీకి చెప్పి రెండుమూడు రోజులు బయటకు వెళ్లిపోతున్న ప్రసాద్ అతని ప్రియురాలు రవళితో హనీమూన్ ట్రిప్పులు వేస్తున్నాడు. చాలాకాలం నుంచి ప్రసాద్ అక్రమ సంబంధం విషయం బయటకురాలేదు. అయితే ఇటీవల ప్రసాద్, రవళిల అక్రమ సంబంధం మ్యాటర్ అతని భార్య బీరితీకి తెలిసిపోయింది.

భార్య, కూతుర్లను చంపేయాలని స్కెచ్
నీకు ఏమి పోయేకాలంరా, నేను అందంగా బాగానే ఉన్నాను కదా, నీకు ఆ టక్కులాడి కావలసి వచ్చిందా అంటూ బీరతీ ఆమె భర్త ప్రసాద్ తో గొడవ చెయ్యడం మొదలుపెట్టింది. రానురాను ప్రసాద్, బీరతీ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భార్య బీరతీ, తన కూతుర్లు బతికుంటే నా జల్సాలకు అడ్డుపడుతుందని ప్రసాద్ అనుకున్నాడు.

ప్రియురాలి మోజులో?
భార్య బీరతీతో పాటు ఇద్దరు కూతుర్లను కూడా చంపేస్తే ఉన్న ఆస్తితో తన ప్రియురాలితో జల్సాలు చెయ్యడానికి భలే చాన్స్ ఉంటుందని ప్రసాద్ అనుకున్నాడు. ఇంట్లోనే అందరి మీద పెట్రోల్ పోసి నిప్పంటించేయాలని, తనకు చిన్న గాయాలు అయితే ఎవ్వరికి అనుమానం రాదని ప్రసాద్ అనుకున్నాడు. ఇంట్లో ఐదు లీటర్ల పెట్రోల్ తెచ్చిపెట్టుకున్నాడు.

భార్య ప్రాణం పోయింది
రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోయాడు. వేకువ జామున 5 గంటల సమయంలో నిద్రపోతున్న భార్య బీరతీ, ఇద్దరు కూతుర్ల మీద కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పనిలో పనిగా ప్రసద్ కూడా అతని మీద లైట్ గా పెట్రోల్ చల్లుకుని నిప్పంటిచుకున్నాడు. బీరతీ, కూతుర్లు మంటలు తట్టుకోలేక కేకులు వేశారు. రెండు గంటల తరువాత అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తల్లీ, కూతుర్లను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అవిఫలమై ప్రసాద్ భార్య బీరతీ ప్రాణాలు వదిలేసింది.

సార్ ఏదో అనుకుంటే ఏదో జరిగింది
ప్రసాద్ ఇద్దరు కుమార్తెలు కూడా 90 శాతం కాలిపోయి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బీరతీ చనిపోయే ముందు ఆమె భర్త ప్రసాద్ నిప్పంటించాడని, అతనికి అక్రమ సంబంధం ఉందని పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. పోలీసులు చిన్నచిన్న గాయాలైన ప్రసాద్ కు చికిత్స చేయించి అతన్ని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications