ILO Report: ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కీలక రిపోర్ట్.. నారాయణ మూర్తికి గట్టి కౌంటర్..?

Narayana Murthy news: దేశంలో పనిగంటలు, ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై ఇటీవల తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దీనిపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. అప్పటి నుంచి ఏదో ఒక రూపేణా ఈ విషయంపై వాదోపవాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి అనుబంధంగా పనిచేస్తున్న ఓ అంతర్జాతీయ సంస్థ ఓ కీలక నివేదిక విడుదల చేసింది. దీంతో నారాయణమూర్తి వ్యాఖ్యలకు గట్టిగా బదులు ఇచ్చిపడేసినట్లయిందని టెక్ రంగంలోని పలువురు చెవులు కొరుక్కుంటున్నట్లు సమాచారం.

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలో సిబ్బంది అత్యధికంగా పని చేసే దేశాలలో భారతదేశం ఒకటి. ఓ ఉద్యోగి సగటున వారానికి 46.7 గంటలు పనిచేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఇండియాలోని 51 శాతం మంది శ్రామిక శక్తి వారానికి 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిలోనే గడుపుతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది. ఇక అత్యధిక పని గంటలను పొడిగించిన దేశాలలో రెండవ స్థానంలో నిలిచినట్లు పేర్కొంది.

ILO gave big shock Infosys Narayana Murthy

ఈ జాబితాలో భూటాన్ ప్రపంచంలో అగ్రగామిగా ముందుండి. 61 శాతం మంది శ్రామిక శక్తి వారానికి 49 గంటలకు పైగా అక్కడ పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్ 47 శాతం మరియు పాకిస్తాన్ 40 శాతంతో టాప్ 10 దక్షిణాసియా దేశాల్లో చోటు సంపాదించాయి. ఆయా దేశాల్లోని శ్రామికశక్తిలో గణనీయమైన భాగం ఎక్కువ గంటలు పనిలోనే నిమగ్నమై ఉన్నట్లు ILO నివేదిక తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (50.9 గంటలు, 39 శాతం) మరియు లెసోతో (50.4 గంటలు, 36 శాతం) వంటి దేశాలు కూడా అధిక పని గంటలను నివేదిస్తున్నాయి. కాగా 49 గంటలకు మించి శ్రామికశక్తి నిష్పత్తిలో భారతదేశం నిలిచింది. అరుబా, చైనా, క్రొయేషియా, జార్జియా, జర్మనీ, ఐల్ ఆఫ్ మ్యాన్, జపాన్, జెర్సీ మరియు సింగపూర్ వంటి దేశాల్లో ఉద్యోగి వారానికి సగటున 36.6 నుంచి 46.1 గంటల మధ్య పనిచేస్తున్నారు. అంటే ఈ దేశాల్లో ఎవరూ వారానికి 49 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయడం లేదు.

తక్కువ సగటు పని గంటలు కలిగిన దేశంగా వనాటు అవతరించింది. అక్కడ కార్మికులు వారానికి సగటున కేవలం 24.7 గంటలు మాత్రమే పనిచేస్తారు. సర్వే నిర్వహించబడిన అన్ని దేశాలలో ఇదే అతి తక్కువ కావడం విశేషం. వనాటులోని శ్రామికశక్తిలో కేవలం 4 శాతం మాత్రమే వారానికి 49 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేస్తున్నారు. ఇది ప్రపంచ కార్మిక పోకడలకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు కనుగొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+